చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Businessman: అధికార పార్టీ లేడీ కార్పోరేటర్ తండ్రి దారుణ హత్య, ఇంట్లోనే చంపేసిన నిందితులు, డోర్లు!

|
Google Oneindia TeluguNews

చెన్నై/తంజావూర్: దుబాయ్ లో చాలా సంవత్సరాలు ఉన్న వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం సొంత ఊరికి వచ్చి ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నారు. వ్యాపారం చేస్తున్న వ్యక్తికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉంది. ఒక్క కుమారుడికి మాత్రమే పెళ్లి జరిగింది. మిగిలిన ముగ్గురు కుమారులు, కూతురికి ఇంకా పెళ్లి కాలేదు. కూతురు అధికార పార్టీ కార్పోరేటర్ గా విజయం సాధించి ఆమె రాజకీయాల్లో చురుకుగా పాలొంటోంది. ప్రతిరోజు ఉదయం షాపు తీసి వ్యాపారం చేస్తున్న ఆయన రాత్రి ఇంటికి వెలుతున్నాడు.

రాత్రి ఇంటికి వెళ్లిన వ్యక్తి తరువాత షాపు దగ్గరకు వెళ్లలేదు. సాయంత్రం అయినా ఆయన షాపు తియ్యకపోవడంతో పక్కషాపుల వాళ్లకు అనుమానం వచ్చి ఆయన కొడుక్కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇంటికి వెళ్లిన కొడుకు తలుపులు తియ్యాలని చెబుతున్నా తండ్రి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూశారు. ఇంటి లోపల వ్యాపారి, లేడీ కౌన్సిలర్ తండ్రి హత్యకు గురైనాడని వెలుగు చూడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Illegal affair: ప్రియుడి కోసం కిలాడీ తల్లి బిడ్డలను ఏం చేసిందంటే ?, భర్తకు ఫోన్ చేసి డ్రామాలు, చరణ్!Illegal affair: ప్రియుడి కోసం కిలాడీ తల్లి బిడ్డలను ఏం చేసిందంటే ?, భర్తకు ఫోన్ చేసి డ్రామాలు, చరణ్!

సొంత ఊర్లో వ్యాపారం

సొంత ఊర్లో వ్యాపారం

తమిళనాడులోని తంజావూర్ జిల్లాలోని కుంభకోణం సమీపంలోని పాపనాశం తాలుకాలోని రేగునాథపురంలో అబ్దుల్ రజాక్ (63) అనే ఆయన నివాసం ఉంటున్నారు. దుబాయ్ లో చాలా సంవత్సరాలు ఉన్న అబ్దుల్ రజాక్ కొన్ని సంవత్సరాల క్రితం సొంత ఊరు రేగునాథపురం వచ్చి ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నారు.

కూతురు అధికార పార్టీ కార్పోరేటర్

కూతురు అధికార పార్టీ కార్పోరేటర్

వ్యాపారం చేస్తున్న అబ్దుల్ రజాక్ కు నలుగురు కుమారులు, హదీజా అనే కుమార్తె ఉంది. ఒక్క కుమారుడికి మాత్రమే పెళ్లి జరిగింది. అబ్దుల్ రజాక్ మిగిలిన ముగ్గురు కుమారులు, కూతురు హజీదాకు ఇంకా పెళ్లి కాలేదు. కూతురు హదీజా అధికార పార్టీ డీఎంకే టిక్కెట్ మీద కుంభకోణం కార్పోరేషన్ 3వ వార్డు కార్పోరేటర్ గా విజయం సాధించి ఆమె రాజకీయాల్లో చురుకుగా పాలొంటోంది.

పక్క షాపు వాళ్లకు అనుమానం

పక్క షాపు వాళ్లకు అనుమానం

ప్రతిరోజు ఉదయం షాపు తీసి వ్యాపారం చేస్తున్న అబ్దుల్ రజాక్ రాత్రి ఇంటికి వెలుతున్నాడు. రాత్రి ఇంటికి వెళ్లిన అబ్దుల్ రజాక్ తరువాత షాపు దగ్గరకు వెళ్లలేదు. సాయంత్రం అయినా అబ్దుల్ రజాక్ షాపు తియ్యకపోవడంతో పక్కషాపుల వాళ్లకు అనుమానం వచ్చి ఆయన కొడుక్కు సమాచారం ఇచ్చారు.

 ఇంట్లో శవమైన లేడీ కార్పోరేటర్ తండ్రి

ఇంట్లో శవమైన లేడీ కార్పోరేటర్ తండ్రి

వెంటనే ఇంటికి వెళ్లిన కొడుకు తలుపులు తియ్యాలని చెబుతున్నా తండ్రి అబ్దుల్ రజాక్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూశారు. ఇంటి లోపల వ్యాపారి, లేడీ కౌన్సిలర్ తండ్రి అబ్దుల్ రజాక్ తీవ్రగాయాలై హత్యకు గురైనాడని వెలుగు చూడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, వేలిముద్రల నిపుణలు సంఘటనా స్తలంలో ఆధారాలు సేకరించి విచారణ ముమ్మరం చేశారు. అబ్దుల్ రజాక్ హత్యకు కచ్చితమైన కారణాలు తెలీయడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Shock: DMK party lady corporator father beaten to death in Thanjavur district in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X