Shock: అర్దరాత్రి తండ్రి వార్నింగ్, కొడుకు ఆత్మహత్య, అదే ఫ్యాన్ కు ఉరి వేసుకున్న తల్లి, ఏం జరిగిందంటే?!

చెన్నై: దంపతులు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. దంపతుల కుమారుడు బీకామ్ చదివాడు. బీకామ్ పూర్తి చేసిన యువకుడు డ్యాన్స్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడే. డ్యాన్స్ మాస్టర్ గా పని చేస్తున్న యువకుడు రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వెలుతున్నాడు. ఇంటిలో తండ్రి అతని కొడుక్కి ఓ విషయంలో వార్నింగ్ ఇచ్చి భార్యను మందలించాడు. తరువాత కొడుకు అతని బెడ్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఆత్మహత్మ చేసుకున్న కొన్ని గంటల్లోనే తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది.

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

చెన్నై సిటీలోని వ్యాసర్పడి ప్రాంతంలో రఘనాథన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 23 సంవత్సరాల క్రితం రఘునాథన్ రాజకుమారి అనే మహిళను వివాహం చేసుకున్నాడు.. రాజకుమారి, రఘునాథన్ చాలా సంతోషంగా జీవిస్తున్నారు. రఘునాథన్, రాజకుమారి దంపతులకు సుశీల్ అలియాస్ సుశీ (21) అనే కుమాడు ఉన్నాడు.

కొడుకు మంచి ఉద్యోగం చెయ్యాలని

కొడుకు మంచి ఉద్యోగం చెయ్యాలని

రఘునాథ్ అతని కుమారుడు సుశీల్ ను బీకామ్ చదివించాడు. తన కొడుకు మంచి ఉద్యోగం చెయ్యాలని రఘునాథన్ ఆశపడుతున్నాడు. బీకామ్ పూర్తి చేసిన సుశీల్ చెన్నై సిటీలో కొంతమంది యువతి, యువకులకు డ్యాన్స్ నేర్పిస్తున్నాడు. సుశీల్ డ్యాన్స్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు.

ఏమి అడుక్కుతింటున్నావా?

ఏమి అడుక్కుతింటున్నావా?

డ్యాన్స్ మాస్టర్ గా పని చేస్తున్న సుశీల్ రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వెలుతున్నాడు. అర్దరాత్రి ఇంటికి వెళ్లిన సుశీల్ కు అతని తండ్రి రఘునాథన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తండ్రి రఘునాథన్ మందలించడంతో భోజనం కూడా చెయ్యకుండా సుశీల్ నేరుగా అతని బెడ్ రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు.

అదే ఫ్యాన్ కు ఉరి వేసుకున్న తల్లి

అదే ఫ్యాన్ కు ఉరి వేసుకున్న తల్లి

గంట తరువాత రూమ్ లోకి వెళ్లిన కొడుకు సుశీల్ ను పిలవడానికి అతని తల్లి రాజకుమారి వెళ్లింది. అప్పటికే సుశీల్ ఉరి వేసుకోవడంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సుశీల్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. కొడుకు చనిపోయాడు అని తెలుసుకు్న రాజకుమారి తాను ఇంటికి వెలుతున్నానని భర్త రఘునాథన్ కు చెప్పి ఇంటికి వెళ్లింది. కొడుకు ఉంటున్న బెడ్ రూమ్ లోకి వెళ్లిన రాజకుమారి ఆమె కొడుకు సశీల్ ఉరి వేసుకున్న ఫ్యాన్ కే ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+