ఆసుపత్రిలో చేరిన నటుడు శరత్ కుమార్

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్.. అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటోన్నారు. ఆయన అస్వస్థతకు గురి కావడానికి గల కారణం తెలియరావట్లేదు గానీ.. డీ హైడ్రేషన్‌కు గురయ్యారని తెలుస్తోంది. ఆయన భార్య, ప్రముఖ నటి రాధిక, కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ ఆసుపత్రి వద్దే ఉన్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పలువురు కోలీవుడ్ ప్రముఖులు శరత్ కుమార్‌ను పరామర్శిస్తోన్నారు.

శరత్ కుమార్ తాజాగా వారిసు సినిమాలో నటించారు. విజయ్ హీరో. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. తెలుగులో వారసుడు పేరుతో ఇది విడుదల కానుంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని 2023 జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు శరత్ కుమార్.

 Tamil actor Sarath Kumar reportedly admitted in hospital, here is the reason

రెండు రోజులుగా ఆయన డయేరియాతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోన్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రికి తరలించగా.. డయేరియా వల్ల డీహైడ్రేషన్‌కు గురైనట్లు డాక్టర్లు పేర్కొన్నారు. వెంటనే ఆయనకు ఫ్లూయిడ్స్‌ను ఎక్కించినట్లు తెలుస్తోంది. కాగా ఆయన అరోగ్య పరిస్థితిపై ఈ ఉదయం హెల్త్ బులెటిన్‌ను జారీ చేసే అవకాశం ఉన్నట్లు తమిళ మీడియా చెబుతోంది. శరత్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.

ఈ సమాచారం తెలిసిన వెంటనే తమిళ చలనచిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించినట్లు తమిళ మీడియా పేర్కొంది. శరత్ కుమార్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటోన్న కొందరు నటులు, దర్శకులు అపోలో ఆసుపత్రికి చేరుకున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+