చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Politics: కమల్ తో కెమిస్ట్రీ కుదర్లేదు, అందుకే సీఎంకు జై, హీరోకి దెబ్బ మీద దెబ్బ, పోతేపోతాడు !

|
Google Oneindia TeluguNews

చెన్నై: లోక్ సభ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటుకోలేక చితకలబడిన జాతీయ ఉత్తమ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ కు మంచి ఎదురుదెబ్బ తగిలింది. మక్కల్ నీది మయ్యం పార్టీలో కీరోల్ పోషించిన ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మహేంద్రన్ కమల్ హాసన్ కు గుడ్ బై చెప్పేసి తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీలో చేరిపోయారు. మహేంద్రన్ చేరికతో కొంగు ప్రాంతంలో మా పార్టీ ఇంకా అభివృద్ది చెందుతుందని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ అన్నారు. మా పార్టీ నుంచి బహిష్కరించే టైమ్ లో మహేంద్రన్ ఆయన అంతకు ఆయనే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని, మాకేమి నష్టంలేదని, పోతేపోతాడు అని కమల్ హాసన్ అంటున్నారు.

Illegal affair: సెక్సీ ఆంటీ, సిక్స్ ప్యాక్ ప్రియుడు, వేరే అమ్మాయితో పెళ్లి, విశ్వరూపం చూపించి !Illegal affair: సెక్సీ ఆంటీ, సిక్స్ ప్యాక్ ప్రియుడు, వేరే అమ్మాయితో పెళ్లి, విశ్వరూపం చూపించి !

వ్యాపారవేత్త, మాస్ లీడర్

వ్యాపారవేత్త, మాస్ లీడర్


ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు మహేంద్రన్ కు కోయంబత్తూరు, సేలం జిల్లాలతో పాటు కొంగు ప్రాంతాల్లో మాస్ లీడర్ గా మంచి పేరు ఉంది. హీరో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించకముందు నుంచి ఆయన వెంట మహేంద్రన్ ఉన్నారు. కమల్ హాసన్ వెంట సుడిగాలి పర్యటన చేసి మంచి గుడ్ విల్ సంపాధించుకున్న మహేంద్రన్ మక్కల్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్ష పదవిని దక్కించుకున్నారు.

రెండు చోట్ల ఓడిపోయాడు

రెండు చోట్ల ఓడిపోయాడు


గత లోక్ సభ ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్ సభ నియోజక వర్గం నుంచి, గత అసెంబ్లీ ఎన్నికల్లో సింగానల్లూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసిన మహేంద్రన్ ఓడిపోయారు. లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన మహేంద్రన్ మక్కల్ నీది మయ్యం పార్టీకి ఓటు బ్యాంకు రావడానికి శక్తి వంచన లేకుండా పని చేశారని గుర్తింపు ఉంది.

 సీఎంకు జై..... కమల్ హాసన్ కు హ్యాండ్

సీఎంకు జై..... కమల్ హాసన్ కు హ్యాండ్


మక్కల్ నీది మయ్యం పార్టీ నుంచి బయటకు వచ్చిన మహేంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ సమక్షంలో డీఎంకే పార్టీలో చేరారు. గత శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని, కొంగు ప్రాంతంలో అనుకునన్ని సీట్లు సంపాధించుకోలేకపోయామని, మహేంద్రన్ చేరికతో ఆ ప్రాంతాల్లో మా పార్టీ ఇంకా పుంజుకుంటుందని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 పీకేయాలని అనుకున్నాను..... పోతేపోతాడు

పీకేయాలని అనుకున్నాను..... పోతేపోతాడు


మహేంద్రన్ చేరికతో కొంగు ప్రాంతాల్లో డీఎంకే పార్టీ మరింత అభివృద్ది చెందుతుందని, ఆ దిశగా మహేంద్రన్ పని చేస్తారని మాకు నమ్మకం ఉందని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ అన్నారు. మా పార్టీ నుంచి బహిష్కరించే టైమ్ లో మహేంద్రన్ ఆయన అంతకు ఆయనే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని, పోతేపోతాడు అని ప్రముఖ హీరో, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ వ్యంగంగా అన్నారు.

Recommended Video

New IT Rules : Facebook తగ్గినా WhatsApp Court Plea | Indian Government || Oneindia Telugu
కమల్ పార్టీకి ఆ విలువలు లేవు

కమల్ పార్టీకి ఆ విలువలు లేవు

మక్కల్ నీది మయ్యం పార్టీలో మానవతా విలువలు లేవని, అందుకే ఆ పార్టీ నుంచి తాను బయటకు వచ్చేశానని మహేంద్రన్ ఆరోపించారు. శుక్రవారం మహేంద్రన్ తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ తో పాటు ముఖ్యమంత్రి కుమారుడు, డీఎంకే పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయానిధి స్టాలిన్ ను కలిశారు.

English summary
Tamil Nadu CM Stalin and Udhaynidhi Stalin meets newly joined Mahendran alone yesterday to talk on Kongu Politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X