చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bumper offer: కైలాసంలో వ్యాపారాలకు నిత్యానందస్వామి గ్రీన్ సిగ్నల్, సిల్క్ చీరలు, పరోటా మాస్క్ లు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చెన్నై/ న్యూఢిల్లీ: అత్యాచారం, అమ్మాయిలను ఆశ్రమంలో అక్రమంగా నిర్భంధించారని కేసులు నమోదు కావడంతో దేశం విడిచిపారిపోయాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందస్వామి అలియాస్ నిత్యానంద మూడు ప్రాంతాల వ్యాపారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నా కైలాసదేశంలో మీరు వ్యాపారులు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నానని, మీరు త్వరపడండి, ఆలసించిన ఆశా భంగం అంటూ నిత్యానందస్వామి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇదే సమయంలో తాను మోనార్క్, నన్ను ఎవ్వరూ మోసం చెయ్యలేరు అంటూ నిత్యానంద అంటున్నారు. చిక్కింది భలే చాన్స్ అంటూ కాంచీపురం చీరలు, మదురై పరోటా మాస్క్ లు, కరోనా దోసెలు, కాంచీపురం పట్టు, సిల్క్ చీరలు విక్రయించడానికి పలువురు వ్యాపారులు పొలో అంటూ కైలాసదేశానికి క్యూకడుతున్నారు.

Reserve Bank of Kailasa: నిత్యానందస్వామి దెబ్బ, సేమ్ వాటికన్ బ్యాంకు టైప్, దేవుడా !Reserve Bank of Kailasa: నిత్యానందస్వామి దెబ్బ, సేమ్ వాటికన్ బ్యాంకు టైప్, దేవుడా !

కైలాస దేశానికి నేనే చక్రవర్తి

కైలాస దేశానికి నేనే చక్రవర్తి


అత్యాచారం ఆరోపణలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందస్వామి నకిలీ పాస్ పోర్టు ఉపయోగించి ఈక్వీడార్ పారిపోయారని పోలీసులు అంటున్నారు. ఈక్వీడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపం కొనుగోలు చేసిన నిత్యానందస్వాది ఆ ద్వీపానికి కైలాస దేశంగా నామకరణం చేసి తానే ప్రధాన మంత్రి, నేనే రాజు నేనే మంత్రి అంటూ మూడు రోజుల క్రితం వినాయక చవతి రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసా బ్యాంకులను ప్రారంభించి అందరికీ షాక్ ఇచ్చారు.

 నేను మోనార్క్..... నన్ను ఎవ్వరూ మోసం చెయ్యలేరు

నేను మోనార్క్..... నన్ను ఎవ్వరూ మోసం చెయ్యలేరు


కైలాస దేశానికి కొత్త రిజర్వ బ్యాంకు, కొత్త కరెన్సీ, కొత్త నాణాలు సృష్టించిన నిత్యానంద ఆదేశంలో వ్యాపారులు చెయ్యడానికి ఇతర దేశాల్లోని వ్యాపారులను ఆకర్షించే పనిలో నిమగ్నం అయ్యారు. తాము కేవలం 56 హిందూ దేశాల వారితో మాత్రమే వ్యాపారాలు చెయ్యాలని నిర్ణయిం తీసుకున్నామని, ప్రపంచంలోని మిగిలిన దేశాలతో వ్యాపారాలు చెయ్యడానికి తాము అంగీకరించమని నిత్యానందస్వామి స్సష్టం చేశారు. ఒకొనక సమయంలో తాను మోనార్క్ ను నన్ను ఎవ్వరూ మోసం చెయ్యలేరు అనే టైప్ లో నిత్యానందస్వామి చెబుతున్నారు.

 మదురై పరోటా మాస్క్ లు, కరోనా దోసెలు

మదురై పరోటా మాస్క్ లు, కరోనా దోసెలు

తమిళనాడులోని టెంపుల్ సిటీ మదురైకి చెందిన కుమార్ అనే ప్రముఖ హోటల్ వ్యాపారి ఇటీవల నిత్యానందకు ఓ లేఖ రాశారు. తాను కైలాస దేశంలో హోటల్ వ్యాపారం ప్రారంభించాలని, అందుకు మీరు అనుమతి ఇవ్వాలని మదురై కుమార్ నిత్యానందకు మనవి చేశారు. తాను కైలాస దేశంలో పరోటా మాస్క్ లు, కరోనా దోసెలు విక్రయించాలని మదురైలోని ప్రముఖ హోటల్ వ్యాపారి కుమార్ మనవి చెయ్యడంతో ఆయనకు నిత్యానందస్వామి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరో లేఖను పంపించారు.

కాంచీపురం పట్టుచీరలు, తిరుచ్చి సిల్క్స్

కాంచీపురం పట్టుచీరలు, తిరుచ్చి సిల్క్స్

తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ప్రముఖ టెక్స్ టైల్స్ వ్యాపారి న్యూ శారదా వస్త్ర దుకాణం యజమాని సైతం కైలాస దేశంలో వ్యాపారం చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని నిత్యానందస్వామికి లేఖ రాశారు. తిరుచ్చి న్యూ శారదా వస్త్ర దుకాణం వ్యాపారులకు కైలాస దేశంలో కాంచీపురం పట్టుచీరలు వ్యాపారం చెయ్యడానికి నిత్యానందస్వామి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

మీకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం

మీకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం

తమిళనాడులోని కాంచీపురం, మదురై, తిరువణ్ణామలై జిల్లాల ప్రజలు కైలాసదేశంలో పర్యటించడానికి వస్తే వారికి ప్రత్యేక ఏర్పాట్లు, అన్ని సౌకర్యాలు కల్పించడానికి తాము సిద్దంగా ఉన్నామని, ఈ మూడు జిల్లాల ప్రజల కోసం డిస్కౌంట్స్ ఇస్తామని నిత్యానందస్వామి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తన దేశంలో మదురై, కాంచీపురం, తిరువణ్ణామలై (నిత్యానందస్వామి పుట్టిన జిల్లా) ప్రజలు ఎప్పుడు తనకు చాలా ప్రత్యేక మని, ఆ జిల్లాల ప్రజలకు తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని నిత్యానందస్వామి స్పష్టం చేశారు.

సీక్రెట్ ఏజెంట్స్ ?

సీక్రెట్ ఏజెంట్స్ ?


తాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో ? అని పూర్తి సమాచారం తెలుసుకోవడానికి చాలా మంది సీక్రెట్ ఏజెంట్లు (భారత్ పోలీసులు) ప్రయత్నాలు చేస్తున్నారని నిత్యానందస్వామి నవ్వుతూనే అంటున్నారు. మొత్తం మీద నిత్యానందస్వామి ఎక్కడ ఉన్నారు ? కైలాస దేశం ఎక్కడ ఉంది ?, ఆయన ఏమేమి చేస్తున్నారు ? అంటూ భారత్ పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

English summary
Tamil Nadu: Nithyananda gives a big offer for Madurai, Thiruvannamalai, Kanchipuram district people to start a new industry in Kailasa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X