Viral :ఏందీ, స్వామీ, కౌన్సిలర్ భర్త దర్పం, హెల్త్ వర్కర్స్ అటెండెన్స్
అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు.. తల పొగరు పనులను కూడా చేయొద్దు. ప్రజా ప్రతినిధులు అంటే వారే పనిచేయాలి.. మరొకరు అంటే భర్త/ కుమారుడు పనులు చేయొద్దు. దీనిపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తోన్నా కొందరు మారడం లేదు. అవును తమిళనాడులో అధికార పార్టీ నేత తలపొగరు చూపించాడు. హెల్త్ డిపార్ట్‌మెంట్ అటెండెన్స్ తీశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
కోయంబత్తూరు 61వ వార్డులోకి డీఎంకే కౌన్సిలర్ భర్త వచ్చాడు. వస్తే ఓకే.. హాయ్, బై చెప్పి వెళ్లాలి. కానీ కూర్చిలో కూర్చొని హాజరు తీయడం ప్రారంభించాడు. అతను ఆది మహేశ్వర భర్త ద్రవిడ మణి అని గుర్తించారు. అటెండెన్స్ తీసే సమయంలో కొందరు అభ్యంతరం తెలిపారు. మీరెందుకు అటెండెన్స్ తీస్తున్నారని ఫైరయ్యారు.ఫ్రంట్ లైన్ వారియర్స్‌ను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. సమస్య ఉంటే సూపర్ వైజర్‌తో మాట్లాడాలని కోరారు. ఆ వీడియోలో అభ్యంతరం వ్యక్తం చేస్తే వాయిస్ వినిపిస్తోంది.

సిబ్బంది నుంచి వ్యతిరేకత రావడంతో.. దిగిరాక తప్పలేదు. ఎవరూ వచ్చారో లేదో.. హాజరుతీసి చెక్ చేస్తున్నామని తెలిపారు. కార్మికుల సంక్షోభం, కార్మికులపై ఒత్తిడి ఉందని వారు చెబుతున్నారు. ఇంతలో పోలీసులు ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పుడే కాదు గతంలో కూడా మరో డీఎంకే నేత ఇలానే చేశారు. అప్పుడు డీఎంకే కౌన్సిలర్ భర్త గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్‌పై చేయి చేసుకున్నాడు. ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది. తిరుపూరు జిల్లాలో స్కూల్ ఆవరణలో విద్యారుల మధ్య ఘటన జరిగింది.ఇపుడు ఇలా ఇతను హాజరు తీసి కలకలం రేపాడు.












Click it and Unblock the Notifications