బీజేపీ ఏం చేసినా మేం హ్యాండిల్ చేస్తాం..పీఎం మోడీని టార్గెట్ చేసిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్

తమిళనాడులో ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చేపాక్-ట్రిప్లికేన్ అసెంబ్లీ సీటు నుండి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఈ ఎన్నికలతో రాజకీయాలలో అడుగుపెడుతున్నారు. చలన చిత్ర నిర్మాత, నటుడు మరియు ఎం కరుణానిధి యొక్క రాజకీయ వారసుడు అయిన, 43 ఏళ్ల ఉదయనిది స్టాలిన్ ఎన్నికల కురుక్షేత్రంలో దూసుకుపోతున్నారు.

నరేంద్ర మోడీ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్

నరేంద్ర మోడీ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్

మధురైలో డి.ఎం.కె కూటమి అభ్యర్థులకు మద్దతుగా చేపట్టిన ప్రచార సభలో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంటు ఎన్నికలలో తమిళనాడు ప్రజలు ఓడించారన్న కారణంతో ప్రధాని మోడీ కి రాష్ట్ర ప్రజలపై ఆగ్రహం అని డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్ ఆరోపణలు గుప్పించారు. అధికారం కోసం బీజేపీ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉందని అయితే తాము బిజెపిని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం అని చెప్పారు.

డీఎంకే పార్టీ నుండి ఎమ్మెల్యేలను ఎవరూ కొనుగోలు చేయలేరు

డీఎంకే పార్టీ నుండి ఎమ్మెల్యేలను ఎవరూ కొనుగోలు చేయలేరు

డీఎంకే పార్టీ నుండి ఎమ్మెల్యేలను ఎవరూ కొనుగోలు చేయలేరని ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు పన్నులు కడుతున్న జీఎస్టీ నుండి పన్నుల వాటాకు సంబంధించిన 15 వేల కోట్ల రూపాయలను కేంద్రం చెల్లించలేదని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. ఇక కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిది వేల కోట్లతో రెండు అత్యాధునిక విమానాలను కొనుగోలు చేశారని విమర్శించారు.

బీజేపీ విధానాలను సమర్ధించి అన్నా డీఎంకే రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కింది

బీజేపీ విధానాలను సమర్ధించి అన్నా డీఎంకే రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కింది

కరోనా సమయంలో 5 వేల కోట్లు ఇస్తామని చెప్పి కేవలం రాష్ట్రానికి ఐదు వందల కోట్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. తమిళనాడు రాష్ట్రంలో అధికారం కోసం బిజెపి ఎంతకైనా దిగజారుతుందని వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్ బిజెపి ప్రభుత్వం చేపట్టిన కొత్త విద్యా విధానాన్ని, నూతన సాగు చట్టాలను అన్నాడీఎంకే సమర్ధించి రాష్ట్ర హక్కులను తుంగలో తొక్కిందని ఫైర్ అయ్యారు. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్న ఉదయనిది స్టాలిన్ తాము అధికారంలోకి వస్తే నీట్ రద్దు చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

కమల్ హాసన్ పార్టీని పార్టీగా చూడటం లేదు

కమల్ హాసన్ పార్టీని పార్టీగా చూడటం లేదు

ఈ ఎన్నికల్లో బిజెపికి, అన్నాడీఎంకే కి బుద్ధి చెప్పాలన్నారు. ఇక కమల్ హాసన్ పార్టీని తాను పార్టీ లాగా చూడటం లేదని, ఇక తన రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని ఉదయనిధి స్టాలిన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి తమిళనాడు రాష్ట్రంలో హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను పేలుస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల మైనస్ లను చెబుతూ తమకు పట్టం కట్టాలని కోరుతున్నారు. మరి ఓటర్ల నిర్ణయం తమిళనాడులో ఏ విధంగా ఉండబోతున్నది అన్నది ముందుముందు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+