Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Boyfriend: కేజీ నగలతో పెళ్లి కూతురు పరార్, ప్రియుడే ముద్దు, మొగుడు అసలే వద్దు, ఏం లవ్ స్టోరీరా!

చెన్నై/ కన్యాకుమారి: పెళ్లి చేసుకున్న భర్తతో 10 రోజుల పాటు సంతోషంగా గడిపిన పెళ్లి కూతురు సుమారు కేజీ నగలతో పక్కింటి ప్రియుడితో కలిసి పరారైయ్యింది. పెళ్లి కూతురు ఎస్కేప్ కావడంతో ఆమె ప్రియుడి మీద పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చెయ్యడంతో అవమానంతో అతని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లేచిపోయిందని అవమానంతో కలక్టరేట్ లో ఉద్యోగం చేస్తున్న భర్త ఇంటికే పరిమితం అయ్యాడు.

పెళ్లి పారాణి ఆరకముందే పెళ్లి కుమార్తె వేరే వ్యక్తితో లేచిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కుమిలిపోయారు. కేజీ నగలతో ప్రియుడితో పరారైన పెళ్లి కుమార్తె మాత్రం బెంగళూరులో స్నేహితుల ఇంటిలో తలదాచుకుని ఎంజాయ్ చేసింది. ప్రియుడే ముద్దు, నాకు ఆ మొగుడు అసలే వద్దు అంటూ ఆమె ఎదురుతిరిగింది.

 ఢాంఢాం అంటూ పెళ్లి

ఢాంఢాం అంటూ పెళ్లి

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా ఇరుదాంకాట్టుకు చెందిన వేల్ మురుగన్ (29), పరచూరుకు చెందిన రాజేశ్వరి (27) అనే యువతి పెళ్లి 2020 జనవరిలో వారి కుటుంబ సభ్యులు రూ. లక్షలు ఖర్చు చేసి ఘనంగా చేశారు. పెళ్లి కుమారుడు వేల్ మురుగన్ కన్యాకుమారి కలెక్టరేట్ లో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లికి భారీ మొత్తంలో ఖర్చు చేసి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందర్నీ ఆహ్వానించి పెళ్లి వేడుక ముగించారు.

రాజేశ్వరికి ఒంటినిండా బంగారం

రాజేశ్వరికి ఒంటినిండా బంగారం

పెళ్లి కుమార్తె రాజేశ్వరీకి ఆమె కుటుంబ సభ్యులు సుమారు 90 సవర్ల బంగారు నగలు చేయించారు. పెళ్లి సందర్బంగా రాజేశ్వరీకి ఆమె కుటుంబ సభ్యులు ఆ నగలు ఇచ్చారు. పెళ్లి జరిగిన సుమారు 10 రోజుల పాటు రాజేశ్వరి భర్త వేల్ మురుగన్ తో చాలా సంతోపంగా ఉంది. వేల్ మురుగన్, రాజేశ్వరీ కలిసి హాయిగా సినిమాలు, షికార్లు, బంధువుల ఇళ్లకు వెళ్లారు.

కేజీ నగలతో పెళ్లి కూతురు మాయం

కేజీ నగలతో పెళ్లి కూతురు మాయం

పెళ్లి జరిగిన కొన్ని రోజుల తరువాత రాజేశ్వరీ ఇంటి నుంచి బయటకు వెళ్లి పత్తాలేకుండా పోయింది. రాజేశ్వరీతో పాటు ఇంటిలో ఉన్న సుమారు కేజీ బంగారు నగలు, 20 వేల రూపాయల నగదు మాయం కావడంతో వేల్ మురుగన్ కుటుంబ సభ్యులు హడలిపోయారు. రాజేశ్వరీ కోసం బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లు, ఆమె స్నేహితుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోయింది. తన భార్య రాజేశ్వరీ కనపడటం లేదని వేల్ మురుగన్ కన్యాకుమారి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పెళ్లి కూతురికి పక్కింట్లో ప్రియుడు

పెళ్లి కూతురికి పక్కింట్లో ప్రియుడు

రాజేశ్వరీ మాయం అయిన రోజు నుంచి ఆమె పక్కింటిలో నివాసం ఉంటున్న సంతోష్ అనే యువకుడు కూడా మాయం అయ్యాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పెళ్లి కూతురు రాజేశ్వరీ, పక్కింటి యువకుడు సంతోష్ ఒకే రోజు మాయం కావడంతో పోలీసులకు అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సంతోష్ కు బెంగళూరు నగరంలో గోవు అనే యువకుడితో పాటు అనేక మంది స్నేహితులు ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పోలీసులు గోవును విచారణ చెయ్యగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బెంగళూరు ఫ్రెండ్స్ కు బెండ్ ఎత్తేశారు

బెంగళూరు ఫ్రెండ్స్ కు బెండ్ ఎత్తేశారు

సంతోష్ ను అతని పక్కింటిలో నివాసం ఉంటున్న రాజేశ్వరీ అనేక సంవత్సరాల నుంచి ప్రేమిస్తోందని గోవు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంతోష్, రాజేశ్వరీతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడని గోవు పోలీసులకు చెప్పాడు. ఎలాంటి ఉద్యోగం చెయ్యకుండా తల్లిదండ్రులు సంపాధిస్తున్న డబ్బుతో కాలం గడుపుతున్న సంతోష్ తో నీకు ప్రేమ, పెళ్లి ఏమిటని రాజేశ్వరీ కుటుంబ సభ్యులు ఆమెను మందలించారని తెలిసింది. సంతోష్ కు ఉద్యోగం లేకపోవడంతో తండ్రి చెప్పినట్లుగా రాజేశ్వరీ వేల్ మురుగన్ ను పెళ్లి చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ప్రియుడే ప్రాణం.... నగలతో మాయం

ప్రియుడే ప్రాణం.... నగలతో మాయం

తండ్రి చెప్పినట్లు వేల్ మురుగన్ ను వివాహం చేసుకున్న రాజేశ్వరీ ప్రియుడు సంతోష్ ను మరిచిపోలేక అతనితో కలిసి పారిపోయిందని పోలీసులు గుర్తించారు. రాజేశ్వరీ భర్త వేల్ మురుగన్ ఫిర్యాదు చెయ్యడంతో ప్రియుడు సంతోస్ మీద పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కేజీ నగలతో పెళ్లి కుమార్తె రాజేశ్వరీని లేపుకుపోయాడని సంతోష్ మీద కిడ్నాప్ కేసు నమోదు కావడంతో అతని కుటుంబ సభ్యులు హడలిపోయారు.

అవమానంతో ప్రియుడి తండ్రి ఆత్మహత్య

అవమానంతో ప్రియుడి తండ్రి ఆత్మహత్య

సంతోష్ పెళ్లి కుమార్తెను లేపుకోయాడని పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో అవమానంతో అతని తండ్రి జగదీశన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం గుర్తించిన సంతోష్ కుటుంబ సభ్యులు జగదీశన్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై జగదీశన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తండ్రి మరణించాడని సమాచారం అందినా అప్పట్లో సంతోష్ మాత్రం పోలీసులకు భయపడి అంత్యక్రియలకు కూడా హాజరుకాకపోవడం 2020లో కన్యాకుమారిలో కలకలం రేపింది. కొన్ని నెలల తరువాత రాజేశ్వరీ పోలీసులకు చిక్కినా ఆమె భర్తతో కలిసి ఉండటానికి నిరాకరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+