youtube Channel: సెక్స్ కోరికలు, రెచ్చిపోయిన లేడీస్, లవర్స్ ఇంటర్వూలు, దెబ్బకు వైరల్, ఓనర్, యాంకర్!

చెన్నై/న్యూఢిల్లీ/బెంగళూరు: బెడ్ రూమ్ లో ఎలా ఎంజాయ్ చేస్తారు, లవర్స్ ఎలా జల్సాలు చేస్తారు అంటూ యూట్యూబ్ చానల్ లో వీడియోలు ప్రసారం చేస్తున్న ముగ్గురు మొనగాళ్లు కటకటాలపాలైనారు. చెన్నై టాక్స్ పేరుతో యూట్యూబ్ చానల్స్ నిర్వహిస్తూ సెక్స్ జోకులు, సంభోగంలోని రహస్యాలు, వాటి మెలుకవల గురించి కొందరు లేడీస్, కాలేజ్ లవర్స్ దగ్గర పార్క్ లు, బీచ్ ల్లో ఇంటర్వూలు తీసుకుని వాటికి మరికొన్ని అశ్లీల వీడియోలు జత చేసి యూట్యూబ్ చానల్స్ లో ప్రసారం చేశారు. కాలేజ్ అమ్మాయిలు, ఆంటీలు, ప్రేమికులను టార్గెట్ చేసుకుని పార్క్ లు, బీచ్ లు, రహస్య ప్రాంతాల్లో ఇంటర్వూలు చేసి యూట్యూబ్ చానల్ లో పోస్టు చేసిన ముగ్గురు ఇప్పుడు 7 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడానికి సిద్దంగా ఉన్నారు.

 మొగ్గురు మొనగాళ్లు

మొగ్గురు మొనగాళ్లు


చెన్నైలో నివాసం ఉంటున్న దినేష్ బాబు అలియాస్ దినేష్ 'చెన్నై టాక్స్' అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. వీజే. అసిన్ బాద్ షా, వీడియో జర్నలిస్ట్ అజయ్ బాబు అనే ఇద్దరి సహాయంతో చెన్నైలో అనేక మందిని ఇంటర్వూలు చేసి ఆ వీడియోలను చెన్నై టాక్స్ యూట్యూబ్ చానల్స్ లో పోస్టు చేస్తున్నారు.

 సెక్స్ ఎలా చెయ్యాలి ? మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు

సెక్స్ ఎలా చెయ్యాలి ? మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు

చెన్నైకి చెందిన ఓ మహిళను వీరు ఇంటర్వూ చేశారు. భాగస్వామితో సెక్స్ కోరికల ఎలా తీర్చుకోవాలి, ఎలా ఎంజాయ్ చెయ్యాలి, ఎలా సుఖపడాలి అంటూ ఓ మహిళ పచ్చి బూతులు మాట్లాడుతూ ఓ ఇంటర్వూ ఇచ్చింది. మీ ఇంటర్వూలో ఆశ్లీలంగా ఉన్న మాటలను ఎడిట్ చేసి ఆ వీడియోను యూట్యూబ్ చానల్ లో పోస్టు చేస్తామని చెన్నై టాక్స్ యూట్యూబ్ చానల్ నిర్వహకులు ఆ మహిళకు హామీ ఇచ్చారని తెలిసింది.

కెమెరా ముందు రెచ్చిపోయిన లేడీస్

కెమెరా ముందు రెచ్చిపోయిన లేడీస్

సెక్స్ ఎలా చెయ్యాలి అంటూ ఆమె అనుభంతో పాటు సెక్స్ కోరికలు ఎలా తీర్చుకోవాలి అంటూ పిన్ టూ పిన్ చెబుతూ చాంతాడు అంత క్లారిటీ ఇస్తూ ఆమె రెచ్చిపోయింది. పచ్చి బూతులు మాట్లాడుతూ ఆమె ఇచ్చిన ఇంటర్వూ యూట్యూబ్ లో వైరల్ అయ్యాయి. ఆమెతో పాటు అనేక మంది మహిళల దగ్గర తీసుకున్న ఇంటర్వూలను ఎడిట్ చెయ్యకుండా, వాటికి అశ్లీల వీడియోలు మిక్స్ చేసిన చెన్నై టాక్స్ యూట్యూబ్ చానల్ నిర్వహకులు వాటిని యూట్యూబ్ లో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

పార్క్ లు, బీచ్ ల్లో రెచ్చిపోయారు

పార్క్ లు, బీచ్ ల్లో రెచ్చిపోయారు

చెన్నైలోని బసంత్ నగర్ బీచ్ లో కొందరు ప్రేమికులు, కొందరు టెక్కులాడి మహిళల దగ్గర ఇంటర్వూలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చెన్నైలోని బీచ్ లు, పార్క్ లు, పబ్లిక్ ప్లేస్ ల్లో కొందరు నోటికి అడ్డుఅదుపు లేకుండా మాట్లాడిన వీడియోలు చెన్నై టాక్స్ యూట్యూబ్ చానల్స్ లో ప్రత్యక్షం కావడంతో అవి వైరల్ అయిపోయాయి.

దుమ్ము దులిపేసింది

దుమ్ము దులిపేసింది


ఒక్కసారిగా చెన్నై టాక్స్ యూట్యూబ్ చాన్ ల్ పేరు మార్మోగిపోయింది. తాము రహస్యంగా ఇచ్చిన ఇంటర్వూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలుసుకున్న కొందరు భాదితుతు చెన్నైలోని శాస్త్రీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మమ్మల్ని కెమెరాల ముందు బలవంతంగా మాట్లాడించి, మా మాటలకు కొన్ని అశ్లీల వీడియోలు జతచేసి యూట్యూబ్ చానల్ లో పెట్టారని, మా పరువు పోయిందని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

10 సంవత్సరాల జైలు శిక్ష

10 సంవత్సరాల జైలు శిక్ష


చెన్నై టాక్స్ యూట్యూబ్ చానల్ నిర్వహకుల మీద చెన్నై సిటీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. చెన్నై టాక్స్ యూట్యూబ్ చానల్స్ యజమాని దినేష్, యాసిన్ బాద్ షా, టీవీ జర్నలిస్టు అజయ్ బాబును అరెస్టు చేశారు. ఈ ముగ్గురి మీద ఐపీసీ సెక్షన్ 354 ( B), 294 (B), 509, 506 (ii) సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల మీద నేరం చేసినట్లు రుజువు అయితే 7 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. చెన్నై టాక్స్ యూట్యూబ్ చానల్ ను బ్లాక్ చెయ్యాలని చెన్నై సిటీ పోలీసు అధికారులు యూట్యూబ్ చానల్ నిర్వహకులకు లేఖ రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+