ఘోరం: కూతుర్ని చంపి, తండ్రి ఆత్మహత్య, భార్య అక్రమ సంబంధాలే కారణం!

చిత్తూరు: ఐదేళ్ల తన కుమార్తెను ఉరివేసి చంపిన తండ్రి.. ఆ తర్వాత అతడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ విషాద ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి బాధితుడి భార్య, అతడి ప్రియుడే కారణంగా తేలింది.

భార్య అక్రమ సంబంధాలతో..

భార్య అక్రమ సంబంధాలతో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డెలివరీ బాయ్‌గా పనిచేసే గణేశ్.. తన భార్య అక్రమ సంబంధాలపై తరచూ ఆమెతో గొడవపడేవాడు. పెద్దల పంచాయతీతో ఈ వ్యవహారం కొన్నాళ్లు సద్దుమణిగినా ఆ తర్వాత మాత్రం భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.

కూతురికి చిత్రహింసలు.. భార్య ప్రియుడి లైంగిక వేధింపులు

కూతురికి చిత్రహింసలు.. భార్య ప్రియుడి లైంగిక వేధింపులు


అయితే, ఐదేళ్ల కుమార్తె కీర్తకను భార్య తన వద్దే ఉంచుకుని చిత్రహింసలు పెట్టేందని.. అంతేగాక, ఆమె ప్రియుడు కార్తీకను లైంగికంగా వేధించేవాడని గణేష్ ఆరోపించాడు. కుమార్తెను అప్పగించాలంటూ కోర్టు మెట్లెక్కినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరో దారిలేక కూతుర్ని చంపి, తండ్రీ ఆత్మహత్య..

మరో దారిలేక కూతుర్ని చంపి, తండ్రీ ఆత్మహత్య..


ఈ క్రమంలోనే వేరేదారిలేక తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపాడు. అనంతరం కుమార్తెను బాత్రూంలో ఉరివేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరులోని ఓ లాడ్జీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గణేష్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదో ఘోరం: ఆడపిల్లలు పుట్టారని విషమిచ్చి చంపిన ఘాతకుడు

ఇదో ఘోరం: ఆడపిల్లలు పుట్టారని విషమిచ్చి చంపిన ఘాతకుడు

ఇది ఇలావుండగా, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా గుండేడు మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన కవల ఆడపిల్లలకు తల్లిపాలకు బదులు పురుగుల మందు తాగించాడో తండ్రి. వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 1న గర్భవతి అయిన భార్య కృష్ణవేణిని కోస్గిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు. అదే రోజు రాత్రి ఆమెకు ఇద్దరు ఆడ కవల పిల్లలు పుట్టారు. అయితే, మొదటి కాన్పులో ఆడపిల్ల కావడం.. ఇప్పుడు కూడా ఆడపిల్లలే కావడంతో వారిని ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు తండ్రి కేశవులు. భార్యకు తెలియకుండా ఇద్దరు పసి పిల్లలకు పురుగుల మందు తాగించి అక్కడ్నుంచి జారుకున్నాడు. పిల్లల నోటి నుంచి నురగరావడంతో కుటుంబసభ్యులు వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చారు. పరీక్షించిన వైద్యులు పిల్లలపై విషప్రయోగం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం పిల్లల పరిస్థితి విషమంగానే ఉందన్నారు. ఘటనపై పిల్లల కుటుంబసభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+