Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా గంగాధ‌ర నెల్లూరు, పెనుమూరు మండ‌లాలు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరా యి. పుత్తూరు నియోజ‌క‌వ‌ర్గం నుండి ఎస్సార్ పురం, పాల‌స‌ముద్రం మండ‌లాలు, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుండి కార్వేటి న‌గ‌రం మండ‌లాలు వ‌చ్చి క‌లిసాయి. వెదురుకుప్పం మండ‌లం సైతం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరింది. గ‌తంలో ఉన్న వేపంజ‌రి (ఎస్సీ) నియోజ‌క‌వ‌ర్గం 2009 లో ర‌ద్దు అయింది. ఒక మ‌హిళా నాయ‌కురాలు నాలుసార్లు శాస‌న‌స‌భ‌కు ఎన్నికైన అతికొద్ది నియోజ‌క‌వ‌ర్గాల్లో వేపంజ‌రి ఒక‌టి. ఇక్క‌డి నుండి మాజీ మంత్రి జి కుతూహ‌ల‌మ్మ నాలుగు సార్లు ఎన్నియ్యారు. 2009 లో కాంగ్రెస్ నుండి గెలిచిన కుతూహ‌ల‌మ్మ 2014 లో ఓడిపోయారు.

గంగాధ‌ర నెల్లూరు లో రెండు సార్లు ఎన్నిక‌లు..
గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలో రెండు సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. 2009 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెల‌వ‌గా.. 2014 లో వైసిపి గెలిచింది. ఇక‌, వేపంజ‌రి లో కాంగ్రెస్ ఆరు సార్లు గెల‌వ‌గా.. టిడిపి రెండు సార్లు గెలిచింది. జ‌న‌తా పార్టీ నుండి ఒక‌సారి, స్వ‌తంత్ర అభ్య‌ర్ధి ఒక‌సారి గెలుపొందారు. ఇక‌, 2009 త‌రువాత ఇక్క‌డి రాజ‌కీయ ప‌రిణామాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయి.

#AndhraPradeshElections2019: All about Gangadhara Nellore Constituency

2014 ఎన్నిక‌ల్లో వైసిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 184112 ఓట్లు ఉండ‌గా, అందులో155679 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన నారా య‌ణ స్వామికి 84538 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన కుతూహ‌ల‌మ్మ కు 63973 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి అభ్య‌ర్ధి నారాయ‌ణ స్వామి 20565 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండి వైసిపి అభ్య‌ర్దిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయ‌ణ స్వామి తిరిగి పోటీ చేయ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక‌, టిడిపి నుండి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన కుతూహ‌ల‌మ్మ కు ఇస్తారా లేక మ‌రో అభ్య‌ర్ధిని రంగంలోకి దింపుతారా అనేది తేలాల్సి ఉంది. ఇక‌, 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండి ప్ర‌జారాజ్యం అభ్య‌ర్దిగా పోటీ చేసిన నాగ‌భూష‌ణం కు 12405 ఓట్లు వ‌చ్చాయి. ఈ సారి జ‌న‌సేన ఇక్క‌డ బ‌రిలో ఉంటుందా ..ఉండ‌దా ఉంటే ఎవ‌రు పోటీలో ఉంటార‌నే క్లారిటీ లేదు. దీంతో..ఇక్క‌డ త్రిముఖ పోటీ జ‌రిగే అవ‌కాశం ఉన్నా..ప్ర‌ధాన పోటీ మాత్రం టిడిపి -వైసిపి మ‌ధ్య‌నే ఉండ‌నుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+