ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: శ్రీకాళహస్తి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తొట్టంబేడు మండలం పూర్తిగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేరింది. మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఇక్కడ నుండి గెలుపొందారు. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడే ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 1952 లో అనంతపురం లో పోటీ చేసి తన సమీప బంధువు తరిమెల నాగిరెడ్డి చేతిలో ఓడి పోయారు. ఆ తరువాత ఆయన కోసం శ్రీకాళహస్తి లో గెలుపొందిన బలరామిరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. ఆయన హిందూపూర్, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల నుండి ఎన్నియ్యారు. స్పీకర్ గా , రాష్ట్రపతిగా అత్యున్నత పద వులు చేపట్టారు. ఏఐసిసి అధ్యక్ష పదవిని నిర్వహించారు.
17 సార్లు ఎన్నికలు జరగ్గా..
శ్రీకాళహస్తి నియోకవర్గంలో ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్ ఎనిమిది సార్లు, టిడిపి ఏడు సార్లు గెలవగా, స్వతంత్రులు రెండు సార్లు గెలిచారు. అయిదు సార్లు గెలిచిన గోపాలకృష్ణా రెడ్డి కి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలి చిన గంగ సుబ్బరామిరెడ్డి తండ్రి. కాగా మరో సీనియర్ నేత పెద్దిరెడ్డి తిమ్మారెడ్డికి గోపాలకృష్ణారెడ్డి అల్లుడు అవుతారు. గోపాల కృష్ణా రెడ్డి మూడు సార్లు మంత్రిగా పని చేసారు.

2014 ఎన్నికల్లో..
2014 ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం లో మొత్తంగా 228388 ఓట్లు ఉండగా, అందులో 183445 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుం డి పోటీ చేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి 89953 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన మధుసూధన రెడ్డికి 82379 ఓట్లు దక్కాయి. టిడిపి నుండి పోటీ చేసిన గోపాలకృష్ణారెడ్డి 7583 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంలో అటవీ శాఖా మంత్రిగా పని చేసారు. 2017 లో జరిగిన మంత్రి వర్గ విస్తరణ లో ఆయన అనారోగ్య కారణాలతో మంత్రి పదవి నుండి ఉద్వాసనకు గురయ్యారు. ఆయన స్థానంలో వైసిపి నుండి గెలిచి టిడిపిలో చేరిన అమరనాధరెడ్డి చిత్తూరు జిల్లా నుండి మంత్రి అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో..
వచ్చే ఎన్నికల్లో టిడిపి నుండి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఈ సారి అనారోగ్య కారణాలతో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారుద. ఆయన స్థానంలో బొజ్జల తనయుడు సుధీర్ రెడ్డి టిడిపి నుండి టిక్కెట్ ఆశిస్తు న్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే సైతం పోటీ లో ఉన్నారు. ఇక, వైసిపి నుండి ఎవరు బరిలో ఉంటారనేది అధికారి కంగా ప్రకటించలేదు. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసిన ప్రజారాజ్యం అభ్యర్ది సాయి సుబ్రమణ్యం కు 24349 ఓట్లు వచ్చాయి. ఈ సారి జనసేన నుండి ఎవరు బరిలో ఉంటారో స్పష్టత రావాల్సి ఉంది. ఇక్కడ ప్రధానంగా టిడిపి - వైసిపి మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications