ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న‌లో భాగంగా కుర‌బ‌ల‌కోట‌..బి.కొత్త‌కోట మండ‌లాలు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి 2009 లో టిడిపి నుండి గెలిచిన ప్ర‌వీణ్‌కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ల‌క్ష్మీ దేవ‌మ్మ కుమారుడు. ఆ మె రెండు సార్లు ఇక్క‌డి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్ర‌వీ ణ్ కుమార్ తండ్రి ఉమామ‌హేశ్వ‌ర రెడ్డి సైతం గ‌తంలో ఎమ్మె ల్సీగా ప‌ని చేసారు.2004, 2009 ఎన్నిక‌ల్లో బిజెపి నుండి పోటీ చేసిన న‌ర‌సింహారెడ్డి 2009 లో ప్ర‌జారాజ్యం అభ్య‌ర్ధిగా పోటీ చేసారు. 2009 ఎన్నిక‌ల త‌రువాత రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణాల కారణంగా అప్ప‌టి వ‌ర‌కు ఒక ర‌కంగా ఉన్న తంబ‌ళ్ల‌ప‌ల్లి రాజ‌కీయాల్లో స‌మీక‌ర‌ణాలు మారి పోయాయి.

12 సార్లు ఎన్నిక‌లు..
తంబ‌ళ్ల‌ప‌ల్లి లో 12 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ఆరు సార్లు, టిడిపి నాలుగు సార్లు, స్వ‌తంత్ర పార్టీ ఒక్క సారి, ఇండిపెండెంట్ ఒక సారి గెలుపొందారు. తంబ‌ళ్ల‌ప‌ల్లిలో క‌డ‌ప ప్ర‌భాక‌ర‌రెడ్డి మూడుసార్లు గెలిచారు. ఆయ‌న తండ్రి క‌డ‌ప న‌ర‌సింహారెడ్డి ఒక‌సారి గెలుపొందారు. టిఎన్‌వి కుటుంబ స‌భ్యులు సుబ్బారెడ్డి, అన‌సూయమ్మ‌, శ్రీనివాస రెడ్డిలు అయిదు సార్లు గెలిచారు. ఇక్క‌డ ఒక‌సారి గెలిచిన మ‌ద‌న మోహ‌న రెడ్డి మ‌ద‌నప‌ల్లె లో మరోసారి గెలిచారు. 2009 లో ఇక్క డ గెలిచిన టిడిపి అభ్య‌ర్ది వైయస్సార్ మ‌ర‌ణం త‌రువాత జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా నిలిచారు. దీంతో, ఆయ‌న పై అన‌ర్హ‌త వేటు ప‌డింది. ఆ త‌రువాత ఇక్క‌డి కొత్త అభ్య‌ర్దులు తెర మీద‌కు వ‌చ్చారు.

#AndhraPradeshElections2019: All about Thamballapalle Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో తంబ‌ళ్ల‌ప‌ల్లిలో మొత్తం 199201 ఒట్లు ఉండ‌గా, అందులో 162487 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన శంక‌ర్ యాద‌వ్ కు 82690 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన ప్ర‌వీణ్ కుమార్ రెడ్డికి 72900 ఓట్లు వ‌చ్చాయి. టిడి పి అభ్య‌ర్ది శంక‌ర్ యాద‌వ్ 9190 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన శంక‌ర్ యాద వ్ ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ త‌రువాత ప్రవీణ్ కుమార్ రెడ్డి టిడిపి వీడి వైసిపి లో చేర‌టం తో..శంక‌ర్ యాద‌వ్ కాంగ్రెస్ వీడి టిడిపి లో చేరారు. 2009 ఎన్నిక‌ల్లో పోటీ ప‌డినే అభ్య‌ర్దులే తిరిగి 2014 ఎన్నిక‌ల్లో భిన్నంగా పోటీకి దిగారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో...
2014 ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత సుదీర్ఘ రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న ల‌క్ష్మీ దేవ‌మ్మ కుటుంబ నుండి వ‌చ్చిన ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి క్రియా శీల‌క రాజ‌కీయాల‌కు దూర‌మయ్యారు. టిడిపి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే శంక‌ర్ యాద‌వ్ తిరిటి సీటు ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, వైసిపి నుండి ఇద్ద‌రి పేర్లు ప్ర‌చారం లో ఉన్నాయి. చివ‌రి నిమ‌షంలో ఎవ‌రికి ఈ పార్టీ నుండి సీటు ద‌క్కుతుంద‌నేది వేచి చూడాలి. ఇక‌, 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసిన క‌డ‌ప ప్ర‌భాక‌ర రెడ్డికి 28,857 ఓట్లు వ‌చ్చాయి. దీంతో..జ‌న‌సేన ఇక్క‌డ నుండి ఎవ‌రిని పార్టీ అభ్య‌ర్దిగా ప్ర‌క‌టిస్తుందో చూడాలి. త్రిముఖ పోటీ ఉన్నా..ప్ర‌ధాన పోటీ మాత్రం టిడిపి - వైసిపి మ‌ధ్య‌నే ఉండ‌నుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+