చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూమ్‌ను వదలని చంద్రబాబు: వర్చువల్ మ్యారేజ్: ఆన్‌లైన్‌లోనే వధూవరులకు బ్లెస్సింగ్స్

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. పార్టీ సమావేశాలు, నేతల సమీక్షలను జూమ్ వీడియో ద్వారా నిర్వహిస్తోన్నారు. ఈ ఏడెనిమిది నెలల కాలంలో ఆయన ఎక్కువ సమయం పాటు జూమ్ వీడియోకే పరిమితం అయ్యారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పార్టీ సమావేశాలు, సమీక్షలను నిర్వహించారు. కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో తరచూ పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. తాజాగా- జూమ్ యాప్ ద్వారా ఓ పెళ్లి వేడుకకూ హాజరయ్యారు చంద్రబాబు.

 నీ వెనుక మేం ఉన్నాం: ఆ విషయంలో జాగ్రత్త: అఖిల ప్రియకు చంద్రబాబు ఫోన్: ఫస్ట్‌టైమ్ నీ వెనుక మేం ఉన్నాం: ఆ విషయంలో జాగ్రత్త: అఖిల ప్రియకు చంద్రబాబు ఫోన్: ఫస్ట్‌టైమ్

చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని విజయపురం మండలంతెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు ఎస్ అశోకన్ కుమారుడి వివాహాన్ని చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా వీక్షించారు. వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వారిని ఆశీర్వదించారు. అశోకన్ కుమారుడు ఆల్బర్ట్, ఏంజెల్ వివాహం బుధవారం రాత్రి క్రైస్తవ సంప్రదాయంగా నిర్వహించారు. ఈ వివాహానికి చంద్రబాబు జూమ్ వీడియో ద్వారా హాజరయ్యారు. ఉండవల్లి నివాసం నుంచే వారి వివాహాన్ని వీక్షించారు.

Chandrababu attends a marriage on virtual platform, blessed the couple

ఆల్బర్ట్-ఏంజెల్‌ను ఆశీర్వదించారు. అన్యోన్యంగా జీవించాలని ఆశీర్వదించారు. వారి జీవితం ఆనందంగా సాగాలని అకాంక్షించారు. ఓ సామాన్య కార్యకర్త వివాహానికి చంద్రబాబు హాజరు కావడం ఆనందంగా ఉందని టీడీపీ నగరి అసెంబ్లీ ఇన్‌ఛార్జి గాలి భానుప్రకాష్ నాయుడు అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా ఆదరిస్తారని చెప్పారు. టీడీపీకి కార్యకర్తలే బలం అని వ్యాఖ్యానించారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో మెజారిటీ పంచాయతీలను గెలిపించుకుంటామని, చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని గాలి భానుప్రకాష్ ధీమా వ్యక్తం చేశారు.

English summary
Chandrababu attends a marriage on virtual platform, blessed the couple. The Party leaders from Nagari assembly constituency in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X