చిత్తూరు లో సిలికాన్ సిటీ ఏర్పాటు : టీసీఎల్ కు భూమిపూజ
రాబోయే రోజుల్లో చిత్తూరు లో సిలికాన్ సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రానున్న కాలంలో చిత్తూరుకు అనేక కంపెనీలు వస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీసీఎల్ కు భూమి పూజ చేసారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాల లో టీసీఎల్ కంపెనీకి భూమి పూజ చేసారు. చిత్తూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఇస్తున్న ప్రాధాన్యత ను వివరించారు. 2019 డిసెంబర్ నాటికి టీసీఎల్ ఉత్పత్తులను ప్రారంభిస్తారన్నారు. రాబోయే రోజుల్లో చిత్తూరు ను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తామని..దీని లో భాగంగా రానున్న రోజుల్లో అనేక కంపెనీలు జిల్లాకు తరలి వస్తాయని చెప్పారు.
చిత్తూరు జిల్లా వికృతమాల వద్ద చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం టీసీఎల్ కంపెనీ స్మార్ట్ టీవీల ఉత్పత్తుల యూనిట్‌కు నేడు శంకుస్థాపన చేశాం. రూ.2200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మందికి ఉపాధి లభించనుంది. #TCLIndustrialParkLaunch pic.twitter.com/D1aC7wYZID
— N Chandrababu Naidu (@ncbn) December 20, 2018

జిల్లాలో మౌలిక సదుపాయాల కల్ప న కు పెద్దపీట వేస్తామని సీయం ప్రకటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపి తొలి స్థానంలో ఉందని సీయం వివరించారు. దేశానికి తిరుపతి ఆదర్శంగా నిలుస్తోందని..తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుతుందని విశ్లేషించారు. జిల్లాలోని ఏర్పేడు మండలం వికృతమాలలో టీసీఎల్ కంపెనీకి సీయం భూమి పూజ చేసారు.
తిరుపతి- చెన్నై,-నెల్లూరు మధ్య సిలికాన్ కారిడార్ ఏర్పాటు చేస్తామని సీయం ప్రకటించారు. మూడేళ్లలో 2, 618 ఎంవో యూలు కుదుర్చుకున్నామన్నారు. పరిశుభ్రతలో 6వ స్థానం, భద్రతలో రెండో స్థానంలో ఉన్నామని గుర్తుచేశారు. తిరుపతి.. ఏపీకే ఆరోగ్య కేంద్రంగా ఉంటుందన్నారు. తిరుపతిని ప్రపంచపటంలో పెట్టడమే తన లక్ష్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ. 500 కోట్లతో తిరుపతిలో గరుడ వారధి పేరుతో ఫ్లైఓవర్ నిర్మిస్తామని సీఎం ప్రకటించారు.












Click it and Unblock the Notifications