చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాళికనని నాలుక కోసి తినేసి .. మదనపల్లె హత్యల కేసులో డాక్టర్ లతో భయానక విషయాలు

|
Google Oneindia TeluguNews

మదనపల్లె జంట హత్యల కేసులో భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈనెల 24వ తేదీన మూఢ భక్తితో కన్న బిడ్డలను తల్లిదండ్రులు హతమార్చిన ఘటన లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రుయా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించిన దంపతులకు వైద్య పరీక్షలు చేసే క్రమంలో వైద్యులతో పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు పురుషోత్తం నాయుడు.

దేవుడి దగ్గరకు వెళ్తున్నానంటూ డిగ్రీ స్టూడెంట్ మిస్సింగ్: మదనపల్లె ఘటన మరచిపోకముందే మరో ఘటనదేవుడి దగ్గరకు వెళ్తున్నానంటూ డిగ్రీ స్టూడెంట్ మిస్సింగ్: మదనపల్లె ఘటన మరచిపోకముందే మరో ఘటన

పెద్ద కుమార్తె అలేఖ్య ని చంపిన తరువాత ఆమె నాలుకను కోసి తినేసిందన్న పురుషోత్తం నాయుడు

పెద్ద కుమార్తె అలేఖ్య ని చంపిన తరువాత ఆమె నాలుకను కోసి తినేసిందన్న పురుషోత్తం నాయుడు


తనను తాను కాళిక అని భావించుకుని పద్మజ పెద్ద కుమార్తె అలేఖ్య ని చంపిన తరువాత ఆమె నాలుకను కోసి తినేసిందని పురుషోత్తం నాయుడు చెప్పినట్లుగా సమాచారం . అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది తెలిసే అవకాశం ఉంది. పద్మజ లాగా పెద్ద కుమార్తె అలేఖ్య కూడా తనకు అర్జునుడివని చెప్పేదని పురుషోత్తం నాయుడు వైద్యులకు తెలిపారు. అంతే కాదు కళాశాల లో పాఠాలు చెప్పడం నివృత్తి కాదు పాండవుల తరఫున అర్జునుడు ముందుండి నడిపిన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని తనకు చెప్పినట్లుగా ఆయన పేర్కొన్నారు.

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్యులకు షాకింగ్ విషయాలు చెప్పిన దంపతులు

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్యులకు షాకింగ్ విషయాలు చెప్పిన దంపతులు

కలియుగం అంతమై సత్య యుగం వస్తుందని, అందుకు కరోనా ని సూచన అని పెద్ద కుమార్తె అలేఖ్య చెప్పేదని పురుషోత్తం నాయుడు వైద్యులు తెలిపారు. ఇక తన కుమార్తె చెప్పిన విషయాలన్నీ నిజమేనని తెలిపిన తాను ఈ విషయాలన్నీ ఆధ్యాత్మిక పుస్తకాలలో చదివాను అంటూ వైద్యులకు వెల్లడించారు.

పురుషోత్తం నాయుడు, పద్మజా ఇద్దరికీ మానసిక వ్యాధి లక్షణాలు కనిపించడంతో, జైలు అధికారులు వారిద్దరినీ తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడిన క్రమంలో కూడా పద్మజ నానా హంగామా చేశారు.

ణా బిడ్డలు తిరిగొస్తారు అంటూ పద్మజ హంగామా .. విశాఖ మెంటల్ ఆస్పత్రికి చికిత్సకు సిఫార్సు

ణా బిడ్డలు తిరిగొస్తారు అంటూ పద్మజ హంగామా .. విశాఖ మెంటల్ ఆస్పత్రికి చికిత్సకు సిఫార్సు

పద్మజ మంత్రాలు చదువుతూ, నా బిడ్డలు తిరిగి వస్తున్నారు ఇంటికి వెళ్లాలి అంటూ కేకలు వేశారు. అంతేకాదు జైల్లో తోడుగా ఉన్న శివుడు, కృష్ణయ్య ఇక్కడ ఎందుకు కనిపించడం లేదంటూ వైద్యులను ప్రశ్నించారు. వైద్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఇదే తరహాలో సమాధానాలు చెప్పారు. ఇక వేరే గదిలో పురుషోత్తం నాయుడు ఏడుస్తూ వైద్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. వీరిద్దరి మానసిక పరిస్థితిని పరిశీలించిన వైద్యులు వారికి జైలు లాంటి వాతావరణంలోనే చికిత్స చేయాల్సిన అవసరం ఉందని, అందరితో పాటు ఉంచితే ప్రమాదమని పేర్కొన్నారు. అందుకోసం వారికి విశాఖ ప్రభుత్వ మానసిక చికిత్స కేంద్రానికి వైద్యం కోసం సిఫార్స్ చేశారు.

 బాగా ఎక్కువ అధ్యయనం .. భ్రమల్లోకి తీసుకెళ్ళింది .. కుటుంబం అంతా మనో వ్యాధిగ్రస్తులే

బాగా ఎక్కువ అధ్యయనం .. భ్రమల్లోకి తీసుకెళ్ళింది .. కుటుంబం అంతా మనో వ్యాధిగ్రస్తులే


చెల్లి చనిపోతా అంటే అక్క ప్రోత్సహించడం, ఆ ఆలోచన సరికాదని చెప్పాల్సిన తల్లిదండ్రులు చివరికి అదే మూఢ విశ్వాసంతో ఘోరమైన హత్యలకు పాల్పడటం , అలేఖ్య తనను చంపమని తల్లిదండ్రులను కోరడం, తాము తిరిగి బ్రతికి వస్తాము అని చెప్పడం ...ఇదంతా టోటల్ గా ఫ్యామిలీ మొత్తం మానసిక వ్యాధితో బాధపడుతున్నదని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రబోధకుల ప్రసంగాలు వింటూ, రచనలు చదువుతూ చివరికి వారు తమను తాము దేవుళ్లుగా ఊహించుకుంటూ భ్రమల్లోకి వెళ్లి పోయారు. తనలా అమ్మాయి రూపంలో శివుడు రావటం అరుదని భావించి అలేఖ్య, తన మూఢవిశ్వాసాలను తల్లిదండ్రులు నమ్మేలా చేశారు. చివరకు ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు కూడా అదే మూఢ విశ్వాసాలతో భయానక ఘటనలకు పాల్పడ్డారు. ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చారు.

English summary
Horrific things are coming to light in the Madanapalle double murder case. On the 24th of this month, the incident in which the parents killed their children with superstitious devotion came to light. Purushottam Naidu and Padmaja revealed many shocking things to the doctors during the medical examination of the couple who were rushed to Ruya Hospital for treatment.Padmaja cut dauguter's tongue and ate it as she is claiming that she is kali maa .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X