అచ్చెన్న..23 చోట్ల గెలిస్తే.. దూరంగా ఉంటా, పోటీ చేయ: రోజా సవాల్
సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఏపీలో వైసీపీ- టీడీపీ నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, టీడీపీ ఏపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుల డైలాగ్ వార్ పీక్‌కి చేరింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు వస్తాయనే అచ్చెన్నాయడు కామెంట్లపై రోజా ఘాటుగా స్పందించారు. ఆ మాటల యుద్దం కోటలు దాటింది. పరస్పర విమర్శలకు కూడా దారితీసింది.

23 కూడా రావు..
160 కాదు కదా.. ఇప్పుడు ఉన్న 23 కూడా రావని రోజా పవర్ పంచ్ ఇచ్చారు. దీనిపై అచ్చెన్నాయుడు కూడా వేగంగానే స్పందించారు. ఎమ్మెల్యే పదవీకి రోజా రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే అంటూ మాట్లాడారు. 2024 ఎన్నికల్లో తాము అసలు పోటీనే చేయబోమని రోజాకు సవాల్ విసిరారు. ఆయన ఒక్కరే కాదు.. తమ పార్టీ అనేలా పరోక్షంగా సంకేతాలను ఇచ్చారు. దానికి కూడా రోజా వేగంగా కౌంటర్ ఇచ్చారు.

రాజీనామానా.. ఎందుకు..?
తాను రాజీనామా చేయడం ఏమిటి? వచ్చే ఎన్నికల్లో వారు పోటీ చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. దమ్ముంటే టీడీపీ వారినే 23 సీట్లకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఛాలెంజ్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని రోజా ప్రతి సవాల్ విసిరారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందించాల్సి ఉంది. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రోజా.. ఉగ్రరూపం దాల్చారు. అచ్చెన్నాయుడుపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.

కౌంటర్ అటాక్
ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేవు. సమయం ఉంది. తెలంగాణలో ఏడాది కాగా.. ఏపీలో ఎక్కువే ఉంది. కానీ పరిస్థితి మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. అవును తెలంగాణలో కేసీఆర్ పర్యటనలు.. ఏపీలో చంద్రబాబు, ఇతర నేతలు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళతారా అనే సందేహాం కలుగుతుంది. తెలంగాణలో ఇప్పటికే ఒకసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. మరీ ఏపీలో కూడా జగన్ అలానే ఆలోచిస్తున్నారని చంద్రబాబు కామెంట్స్ చేస్తున్నారు. ఆ తర్వాత సవాళ్ల పర్వం కొనసాగుతోంది. దీంతో ఎన్నికలకు వెళయ్యిందా అనే సందేహాం కలుగుతుంది. కానీ ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొద్దీ రోజులు ఆగాల్సిందే. కానీ అధికార పార్టీ నుంచి మాత్రం అలాంటి సంకేతాలు లేవు.. కానీ టీడీపీ చేసిన ఆరోపణలపై మాత్రం ధీటుగానే సమాధానం ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications