అందుకే జగన్ అలా చేసారు..! మద్యం రేట్లు పెరగడం వెనక రహస్యాన్ని చెప్పిన రోజా..!!

అమరావతి/హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో ఒక్క సారిగా జనజీవన స్రవంతి స్తంభించిపోయింది. దేశం మొత్తం ఉన్నట్టుంది షట్ డౌన్ అయిపోయింది. ఇదిలా ఉండగా కర్ప్యూ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో అన్ని కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం నిషేదం విధించింది.

అయితే ఇంతకాలం మద్యం అమ్మకాలపైన కూడా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. గత 40రోజులుగా మద్యం దొరకకపోవడంతో మద్యం ప్రియులు విలవిల్లాడిపోయారు. కాగా ఆంధ్ర ప్రదేశ్ లో తెరిచిన మద్యం షాపుల వద్ద జనాలు పెద్ద సంఖ్యలో వరుసకట్టారు. సుమారు రెండు మూడు కిలో మీటర్ల మేర క్యూ లో నిలబడి మద్యం కోసం ఎదురుచూసిన వైనం పట్ల ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మందుపై ఏపీ సీఎం జగన్ ముందుచూపు.. అందుకే రేట్లు పెంచారన్న ఎమ్మెల్యే రోజా..

మందుపై ఏపీ సీఎం జగన్ ముందుచూపు.. అందుకే రేట్లు పెంచారన్న ఎమ్మెల్యే రోజా..

ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం తాజాగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలు చేసుకోవచ్చని పేర్కొంది. ఈమేరకు మద్యం అమ్మకాలకు కూడా అనుమతిచ్చింది సర్కార్. దీంతో పలు షాపుల ముందు, మందు ప్రియులు దుకాణాల వద్ద కిలో మీటర్ల మేర బారులు తీరారు. అలాగే మద్యం అమ్మకాల పట్ల ప్రత్యేక సమయం కేటాయించడంతో సమయంలోపు మద్యం కొనుగోలు చేసుకునేందుకు మద్యం ప్రియులు షాపుల ముంది పోటెత్తారు. మద్యానికి ఏర్పడ్డ డిమాండ్ చూసి ఏపి ఎక్సైజ్ శాఖ మద్యం ధరలను పెంచే ప్రత్నం చేసింది. పెంచిన రేట్లను ఖాతరు చేకుండా మద్యంకోసం ఎగబడడం పలు జిల్లాల్లో కనిపించింది. ఇదే మద్యం రేట్ల పెరుగుదలపై నగరి ఎమ్మెల్యే రోజా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.

తెరుచుకున్న మద్యం షాపులు.. 3కిలోమీర్ల మేర క్యూ కట్టిన మద్యం ప్రియులు..

తెరుచుకున్న మద్యం షాపులు.. 3కిలోమీర్ల మేర క్యూ కట్టిన మద్యం ప్రియులు..

కరోనా మహమ్మారి బుసలు కొడుతూ ప్రజానికంపై విషం చిమ్ముతున్న తరుణంలో ఏపిలో జరుగుతున్న మద్యం విక్ర‌యాలు, ధరల పెంపు వ్యవహారంపై అధికార‌, ప్రతిప‌క్షాల మధ్య యుద్దం జరుగుతోంది. కరోనా తీవ్ర‌త పెరుగుతున్న‌ తరుణంలో మ‌ద్యం షాపులు తెరవడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. షాపుల వ‌ద్ద భౌతిక‌ దూరం కూడా పాటించడం లేదని నేతలు మండిపడుతున్నారు. ఇటు ప్రతిపక్షం విమర్శలకు అధికార వైసీపీ అంతే స్థాయిలో సమాధానం చెప్పుకొస్తోంది. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా టీడీపీ నేత‌ల‌ విమర్శల పై మండిపడ్డారు. మద్యం రేట్లు ఎందుకు పెంచాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు.

దశల వారీగా మద్యం ఎత్తివేత.. ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉన్నామన్న రోజా..

దశల వారీగా మద్యం ఎత్తివేత.. ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉన్నామన్న రోజా..

ధరలు పెంచితే బ‌డుగు బలహీన వర్గాలు మద్యానికి దూరంగా ఉంటారనే ఉద్దేశంతోనే జ‌గ‌న్ స‌ర్కార్ రేట్లు పెంచిందన్నారు రోజా. మ‌ద్యపాన నిషేధంలో భాగంగా సీఎం జ‌గ‌న్ ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తున్నార‌ని తెలిపారు. మద్యం రేట్లు పెంచితే టీడీపీ నేతలు ఎందుకు ఇబ్బందిప‌డుతున్నార‌ని రోజా ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో చంద్రబాబు మద్యం ఏరులై పారితే, జగన్ ప్ర‌భుత్వం దశలవారీగా మద్య నిషేధం చేస్తోందన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 40 వేల బెల్టుషాపులు, 40 శాతం బార్లు, 20 శాతం వైన్‌ షాపులు జ‌గ‌న్ దశల వారీగా తొలగించారన్న విషయాన్ని గుర్తుచేసారు రోజా.

Recommended Video

    Liquor: Check Out New Increased Price of Quarter Half And Full Bottles Liquor
    ఏపిలో మద్యం షాపుల హంగామా.. గొంతు తడుపుకున్న లిక్కర్ లవర్స్..

    ఏపిలో మద్యం షాపుల హంగామా.. గొంతు తడుపుకున్న లిక్కర్ లవర్స్..

    అంతే కాకుండా కరోనా కట్టడికి ముఖ్య‌మంత్రి జగన్‌ తీవ్రంగా కృషి చేస్తుంటే, చంద్రబాబు, టీడీపీ నేతలు ఏసీ గదుల్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. సాయంత్రం 7 గంటల వరకే మద్యం అమ్మకాలు కొనసాగుతాయని ప్రభుత్వం చెప్పడంతో, ఎలాగైనా లిక్కర్ అందుకునేందుకు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. కేవలం ఐదుగురు మాత్రమే షాపు వద్ద ఉండాలన్న రూల్ పక్కన పెట్టి భారీ సంఖ్యలో క్యూ లైన్లలో దర్శనమిచ్చారు మద్యం ప్రియులు. కనీసం కొన్నిలిక్కర్ షాపుల ముందయితే మాస్కులు, సోషల్ డిస్టెన్స్ కూడా పాటించకుండా, ఒకరి మీద ఒకరు పడిపోతూ, లైన్లలో నిలుచున్నారు లిక్కర్ లవర్స్.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+