చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండో డోస్‌లో కోవిషీల్డ్‌కు బదులు కోవాగ్జిన్‌- చిత్తూరు గ్రామంలో భయాందోళనలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో నిన్న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కరోనా ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ ఓ డోసు వేయాల్సి ఉండగా మరో డోసు వేయడంతో భయాందోళనలు నెలకొన్నాయి. జరిగిన తప్పిదంపై వైద్యసిబ్బంది స్పందించకపోవడంతో గ్రామస్ధుల్లో భయాలు మరింత పెరుగుతున్నాయి.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం గుడయానంపల్లి గ్రామంలో నిన్న ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ జరిగింద. గ్రామంలోని 30 మంది గతంలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తొలిడోస్‌ వేయించుకున్నారు. దీంతో ఈసారి రెండో డోస్‌గా మరోసారి కోవిషీల్డ్ వేస్తారని భావించారు. కానీ వైద్య సిబ్బంది మాత్రం వారికి కోవాగ్జిన్ డోసులు వేశారు. గ్రామస్దుల్లో అంతగా అవగాహన లేకపోవడంతో ముందు వారికి అర్ధం కాలేదు. ఆ తర్వాత విషయం తెలిసి లబోదిబోమంటున్నారు.

tension in villagers after covaxin given as second dose instead of covishield in chittoor

నిన్న గుడయానంపల్లిలో కోవిషీల్డ్‌కు బదులుగా కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ డోసులు వేసిన తర్వాత సిబ్బంది ఊరి నుంచి వెళ్లిపోయారు. గ్రామస్ధులకు ఆ తర్వాత విషయం తెలియడంతో వైద్యాధికారుల్ని సంప్రదించేందుకు ప్రయత్నించారు. కానీ వారు అందబాటులోకి రాలేదు దీంతో ఓ టీకాకు బదులు మరో టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారులు వెంటనే స్పందించి తమ ఆరోగ్యం కాపాడాలని గ్రామస్ధులు కోరుతున్నారు.

Recommended Video

COVID Third Wave | Easing COVID 19 Curbs | Oneindia Telugu

English summary
fears looms in gudayanampalli villagers in chittoor district after medical staff administered covaxin second dose instead of covishield in yesterday's vaccination drive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X