వామ్మో.. పోలీసులే ఇలా.. షాపులో చోరబడీ మరీ చోరీ.. ఎక్కడ అంటే
పోలీసులు.. శాంతి భద్రతనుల పర్యవేక్షించడం వారి విధి.. అలాగే దొంగతనాలు జరిగితే వారిని పట్టుకోవడం.. ఇతర కేసులను చూస్తారు. అందుకే పోలీసులు అంటే సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. కొందరు చేసే పనులతో మొత్తం డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ పేరు వస్తుంది.. అయితే చిత్తూరు జిల్లాలో పోలీసులు ఓ తిక్క పని చేశారు. అవును వారే దొంగలుగా మారారు. ఇదీ మాత్రం వంద శాతం నిజం.. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చూడండి.
రాత్రి పూట దొంగతనాలు జరగకుండా చూసేందుకు పోలీసులు వాహనాల్లో గస్తీ తిరుగుతుంటారు. ఇదీ కామనే.. అన్నీ చోట్ల ఇలానే జరుగుతుంది. చోరీలు, నేరాలు జరగకుండా చూసుకోవడమే వారి విధి. చోరీలు జరగకుండా చూడాల్సిన పోలీసులే.. దొంగతనాలు చేస్తున్నారు. అందరూ కాదు కొందరు.. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాకు చిక్కాయి. అందులో పోలీసులే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఓ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ రాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న బట్టల దుకాణంలోకి వెళ్లారు. ఇద్దరు దుకాణం వద్దే స్కూటర్ ఆపి, ఫుట్‌పాత్‌పై ఉండే వస్త్ర దుకాణంలోకి వెళ్లారు. అక్కడ గల దుస్తులను తీసుకుని వెళ్లిపోయారు.చోరీ జరిగిన ఆరు రోజుల తర్వాత సీసీ కెమెరా ద్వారా ఈ విషయం బయట పడింది. పోలీసులపై దుకాణ యజమాని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దుస్తులు చోరీ చేసింది ఏఆర్ కానిస్టేబుల్ అని, అతడికి సాయం చేసిన మరో పోలీసు ఏఆర్ ఏఎస్ఐ అని అధికారులు నిర్ధారించారు. పోలీసులే ఇలా చేయడం నిజంగా దారుణం.. దొంగల నుంచి రక్షించాల్సిన వారు భక్షించడం సరికాదు.
చోరీకి సంబంధించిన విషయం బయటకు రాలేదు. కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. చివరకు మీడియాకు ఈ సీసీ దృశ్యాలు చిక్కాయి. దీంతో విషయం బయటకు వచ్చింది. లేదంటే ఆ చోరీ విషయం కనుమరుగయ్యే అవకాశం ఉండేది. బయటకు వచ్చేది కాదు.. ఆ ఇద్దరు పోలీసులు దొరలుగానే చెలామని అయ్యేవారు. మీడియా జోక్యంతో వారి అసలురంగు బయటపడింది.












Click it and Unblock the Notifications