తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోనసీమ జిల్లాకు ఆ మహనీయుడి పేరు: జనసేన ఎమ్మెల్యే: ఆయనకు ఆయనే సాటి

|
Google Oneindia TeluguNews

కాకినాడ: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు పలు డిమాండ్లు కూడా తెరమీదికి వచ్చాయి. ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితులు, వాటి నేపథ్యానికి అనుగుణంగా పేర్లను పెట్టాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. జిల్లా కేంద్రాల నిర్ధారణ, నియోజకవర్గాల విలీనం వంటి అంశాల్లో అధికార వైఎస్ఆర్సీపీ నుంచే నిరసన వ్యక్తం అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో రాయచోటిని కేంద్రంగా చేసుకుని అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం వివాదానికి దారి తీసింది.

 స్వాగతించిన జనసేన ఎమ్మెల్యే..

స్వాగతించిన జనసేన ఎమ్మెల్యే..

ఇప్పుడు తాజాగా కోనసీమ జిల్లా పేరుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును జత చేయాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. కొత్త జిల్లాను ప్రకటించినందుకు జనసేన పార్టీ శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. ఈ ప్రాంత ప్రజల తరఫున వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని రాపాక చెప్పారు.

 అంబేద్కర్ పేరు..

అంబేద్కర్ పేరు..

అమలాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తూ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయని చెప్పారు. అందరి విజ్ఞప్తి మేరకు ఈ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సూచించారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కోనసీమ పేరును కొనసాగిస్తూనే.. బీఆర్ అంబేద్కర్ పేరు జత చేయాలని అన్నారు. కోనసీమ అంబేద్కర్ జిల్లాగా మార్చాలని కోరారు.

 ఎస్సీల జనాభా అధికం..

ఎస్సీల జనాభా అధికం..


తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న రాజోలు సహా గన్నవరం, అమలాపురం, కొత్తపేట, మండపేట, రామచంద్రాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లో దళితులు పెద్ద సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఏడింట్లో రాజోలు, గన్నవరం, అమలాపురం నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడ్‌కు చెందినవని రాపాక చెప్పారు. అమలాపురం లోక్‌సభ స్థానం కూడా ఎస్సీ రిజర్వుడ్‌కు చెందినదేనని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే- ఈ ప్రాంతంలో ఎస్సీలు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని వివరించారు. అందుకే- ఈ జిల్లాకు బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాపాక వరప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

 మొదటి నుంచీ డిమాండ్..

మొదటి నుంచీ డిమాండ్..

మొదటి నుంచీ ఈ డిమాండ్‌ను తాము వినిపిస్తూనే వస్తున్నామని, దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పారు. చారిత్రక నేపథ్యం ఉన్న నేపథ్యంలో కోనసీమ పేరును కొనసాగిస్తూనే.. అంబేద్కర్ పేరును జత చేయాలని రాపాక వరప్రసాద్ సూచించారు. పరిపాలన సౌలభ్యం కోసం వైఎస్ జగన్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని అత్యంత సాహసోపేతంగా తీసుకున్నారని ఆయన ప్రశంసించారు.

ఆయనకు ఆయనే సాటి..

ఆయనకు ఆయనే సాటి..


కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అధికార, పోలీసు యంత్రాంగం రెట్టింపు అవుతుందని, అయినప్పటికీ- ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకోవడం మామూలు విషయం కాదని రాపాక అన్నారు. వైఎస్ జగన్‌ ఆయనకు ఆయనే సాటి అని కితాబిచ్చారు. ఇంత ధైర్యంతో ఏ నాయకుడు కూడా నిర్ణయాన్ని తీసుకోలేడని తేల్చి చెప్పారు. ప్రతి నాయకుడు కూడా తన స్వార్థం కోసం పని చేస్తుంటారని, ప్రజల కోసం పని చేసే నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరేనని అన్నారు.

అండగా ఉంటాం..

అండగా ఉంటాం..

వైఎస్ జగన్ ప్రభుత్వం పదికాలాల పాటు ఉండాలని, ప్రజలందరూ ఆయన వెంట ఉన్నారని రాపాక వరప్రసాద్ చెప్పారు. ప్రజలకు మేలు చేసే ఎలాంటి నిర్ణయాన్నయినా ధైర్యంగా తీసుకోవాలని, తామందరం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పరిపాలనలో వైఎస్ జగన్ వినూత్న, విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నారని చెప్పారు. ఏ నాయకుడు కూడా ఊహించలేని విధంగా, సాహసించిన విధంగా, మెజారిటీ ప్రజలకు లబ్ది కలిగించేలా నిర్ణయాలను తీసుకోవడమే కాకుండా.. అంతే సాహసోపేతంగా అమలు చేస్తున్నారని రాపాక అన్నారు.

English summary
Janasena MLA Rapaka Varaprasad welcomed the formation of new districts and praised to YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X