వామ్మో.. మాములు అల్లుడు కాదు.. పండగకొచ్చిన ఖాకీ ఏం చేశాడంటే..
చలాన్ అంటేనే ఉలిక్కిపడతాం. అదీ వంద అయినా.. వెయ్యి అయినా కట్టేది లేదంటారు కొందరు. అవును ఫైన్ కట్టమని చెబితే వారికి ఎక్కడ లేని దుఖం వస్తోంది. అందుకే టౌన్/ సిటీలలో మెయిన్ రోడ్ నుంచి కాక గల్లీల గుండా వెళతారు. అయితే ఇటీవల దసరా పండగ ముగిసింది. అందరూ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇళ్లళ్లకు చుట్టాలు/ అల్లుళ్లు వస్తుంటారు. అయితే ఓ అల్లుడు.. అత్తగారింటి వద్ద కూడా డ్యూటీ చేశాడు. అదీ స్థానికుల కోపం నశళానికి ఎక్కేందుకు కారణమైంది. ఇంతకీ ఏమైందో తెలుసుకుందాం. పదండి

పండగకు వచ్చి..
పండగగు
అత్తగారింటికి
ఎస్సై
వచ్చాడు.
అసలే
ఖాకీ
అయే..
అక్కడ
తన
డ్యూటీ
చేశాడు.
ఆ
గ్రామంలో
ఉన్న
బైక్‌లకు
ఫైన్
విధించారు.
ఇంకేముంది
స్థానికులకు
చిర్రెత్తుకు
వచ్చింది.
తూర్పుగోదావరి
జిల్లా
సామర్లకోట
మండలం
పండ్రావాడ
గ్రామంలో
ఈ
ఘటన
జరిగింది.
బిక్కవోలు
ఎస్సై
శ్రీనివాస్
పండగకు
పండ్రావాడ
గ్రామంలోని
అత్తగారింటికి
వచ్చారు.
అత్తగారింట్లో
హాయిగా
ఉండక...
గ్రామంలో
ఉన్న
బైకులకు
ఫైన్
వేస్తూ
కూర్చున్నాడు.
ఆన్
లైన్
ద్వారా
రెండు
బైక్‌లకు
చలానా
కూడా
విధించారు.
ఆ
ఫైన్
కూడా
భారీగానే
ఉన్నాయి.
ఒక
బైక్‌కు
రూ.
10,070,
మరో
బైక్‌కు
రూ.
5,035
ఫైన్
వేశారు.
దీంతో
గ్రామస్తులకు
చిర్రెత్తుకు
వచ్చింది.

ఎస్సైపై మండిపాటు
గ్రామస్థులు ఎస్సైపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పోలీస్ స్టేషన్ పరిధిలో లేనప్పటికీ ఫైన్ వేయడంపై మండిపడ్డారు. ఇదీ మంచి పద్దతి కాదని సూచించారు. ఆయన అత్తగారింటికి వెళ్లి గొడవపడ్డారు. వారిపై ఎస్సై కూడా సీరియస్ అయ్యారు. దౌర్జన్యం చేశారంటూ కేసు బుక్ చేస్తానని హెచ్చరించారు. అయినా స్థానికులు భయపడలేదు. దీనిపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎస్సైకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఏమన్నా ఉంటే మీ స్టేషన్ పరిధిలో చూసుకోవాలని హితవు పలికారు.

ఇదేం పని..?
ఎస్సై తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. పండగకు వచ్చి ఇలా చేయడం సరికాదని అందరూ అంటున్నారు. తన పరిధి కానీ చోట ఇలా ఫైన్ వేయడం ఏంటీ అని అడుగుతున్నారు. ఏ అధికారంతో ఇలా చేశారు అని నిలదీస్తున్నారు. అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఫైన్ ఎక్కువగా ఉండటం కూడా గ్రామస్తుల కోపానికి కారణమైంది. ఓ వందో, రెండొందలు అయితే కట్టేస్తామని కొందరు అంటున్నారు. సో మొత్తానికి ఎస్సై చేయడం వల్ల పండగ మూడ్ పోయినట్టు అయ్యింది.