విషాదం ... చిన్నారి దీప్తిశ్రీ మృతదేహం లభ్యం .. ఇంద్రపాలెం వంతెనవద్ద మూటలో విగతజీవిగా

చిన్నారి దీప్తి శ్రీ కథ విషాదాంతంగా మారిది. సవతి తల్లి దాష్టీకానికి దీప్తి శ్రీ బలైపోయింది . చిన్నారి మిస్సింగ్ కేసు తర్వాత 48 గంటలకు మిస్టరీ వీడింది. ఇంద్రపాలెం వంతెన వద్ద చిన్నారి దీప్తిశ్రీ మృతదేహం లభ్యమైంది. చిన్నారి దీప్తి శ్రీని తానే హతమార్చి ఉప్పుటేరులో పడేశానని దీప్తిశ్రీ సవతి తల్లి శాంతి కుమారి చెప్పటంతో పోలీసులు ఇంద్రపాలెం వంతెన వద్ద గాలింపు చేపట్టి ఎట్టకేలకు దీప్తి శ్రీ మృతదేహాన్ని బయటకు తీశారు.

ఇంద్ర పాలెం వంతెన వద్ద లభ్యమైన దీప్తి శ్రీ మృతదేహం

ఇంద్ర పాలెం వంతెన వద్ద లభ్యమైన దీప్తి శ్రీ మృతదేహం

ఇంద్రపాలెం వంతెనవద్ద ఉప్పుటేరులో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీయించిన పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీప్తిశ్రీని సవతితల్లి శాంతకుమారి హత్య చేసి గోనెసంచిలో మూటకట్టి ఉప్పుటేరులో పడేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించటంతో, ధర్మాడి సత్యం బృందాన్ని రంగంలోకి దించారు పోలీసులు. 15 మంది సభ్యుల బృందం గాలించి దీప్తిశ్రీ మృతదేహాన్ని వెలికితీసింది. చిన్నారిని హత్య చేసిన శాంతకుమారి ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉంది.

చిన్నారి ప్రాణం తీసి ఉప్పుటేరులో పడేసి .. సైలెంట్ గా వచ్చిన శాంతి కుమారి

చిన్నారి ప్రాణం తీసి ఉప్పుటేరులో పడేసి .. సైలెంట్ గా వచ్చిన శాంతి కుమారి

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్‌ వ్యవహారం మిస్టరీ ఫైనల్ గా విషాదాంతం అయ్యింది. 48 గంటల తర్వాత ఈ మిస్టరీపై పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారు. సవతి తల్లే హంతకురాలని గుర్తించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు స్కూల్ నుండి తీసుకువెళ్లిన శాంతి కుమారి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మృతదేహాన్ని మూటకట్టి ఇంద్ర పాలెం వద్ద ఉప్పుటేరు లో పడేసింది. తనకేమీ తెలియనట్టు సైలెంట్ గా ఇంటికి వచ్చేసింది.

ఆస్థి కోసమే ఘాతుకం... ప్రాణం తీసిన పిన్ని

ఆస్థి కోసమే ఘాతుకం... ప్రాణం తీసిన పిన్ని

తనను, తన కుమారుడిని కాకుండా భర్త ఎక్కువగా దీప్తి శ్రీ మీద ప్రేమ చూపించటం , అలాగే దీప్తి శ్రీని చంపేస్తే ఆస్తి మొత్తం తనకు, తన కుమారుడికే ఉంటుందని భావించటం వల్ల ఆస్తి కోసమే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పిన్ని అని భావించి ఆమెతో వెళితే పాశవికంగా చిన్నారి ఉసురు తీసింది. ఇక ఈ కేసులో శాంతకుమారికి ఎవరైనా సహకారం అందించారా? అన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

పోస్ట్ మార్టం కు దీప్తి శ్రీ మృతదేహం .. రిపోర్ట్ వస్తే మరిన్ని విషయాలు తెలిసే చాన్స్

పోస్ట్ మార్టం కు దీప్తి శ్రీ మృతదేహం .. రిపోర్ట్ వస్తే మరిన్ని విషయాలు తెలిసే చాన్స్

ఈ రెండు గంటల సమయంలో శాంతి కుమారి ఎక్కడికి వెళ్లింది,ఏం చేసింది,ఆమెకు సహకరించిన వారు ఎవరు? ఎవరి ప్రమేయం లేకుండా శాంతి కుమారినే ఈ దారుణం చేసిందా అన్నక్రమంలో పొలేఉస్లు దర్యాప్తు చేస్తున్నారు. దీప్తి శ్రీ మృత దేహాన్ని పోస్ట్ మార్టంకు పంపిన పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక అసలు దీప్తి శ్రీ మర్డర్ మిస్టరీలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. అనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు శాంతి కుమారి ఈ ఘాతుకానికి పాల్పడటానికి మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+