• search
 • Live TV
తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దుబ్బాక ఫలితం జగన్‌కు పాఠం -సంచైత-సాయిరెడ్డి గురించి అక్కడిలా -వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు

|

లెక్కకు మించి సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా, అద్భుతమైన రీతిలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నప్పటికీ దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి పాలయ్యారని, ఇది పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపీలోని అధికార పార్టీకి, మరీ ముఖ్యంగా సీఎం జగన్ కు పాఠం లాంటిందని వైసీపీకే చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీ, తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

  Vijay Sai Reddy Mocks TDP Celebrations On BJP Victory In Dubbaka | Oneindia Telugu
  ఏపీలో అటకెక్కిన అభివృద్ధి..

  ఏపీలో అటకెక్కిన అభివృద్ధి..

  ‘‘రాజధాని రచ్చబండ కార్యక్రమం ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాల్సిందిగా చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. అందులో ప్రధానమైనది ‘వైఎస్సార్ పెళ్లి కానుక'. ఎస్సీ, ఎస్టీ, ఓసీల మధ్య కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. కానీ ఈబీసీలకు మాత్రం డబ్బులివ్వడంలేదు. పక్కన తెలంగాణలో ‘కల్యాణలక్ష్మి'ని ఈబీసీలకు కూడా వర్తింపజేశారు. కేవలం మత మార్పిడుల కోసమే ఏపీలో ‘పెళ్లి కానుక'అమలవుతోందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎవరైనా అభివృద్ధి చేసి, తద్వారా వచ్చే ఆదాయంతో ప్రజలకు మంచి చేస్తారు. కానీ జగన్ సర్కారు మాత్రం విశాఖలాంటి పెద్ద ఊళ్లలో భూముల్ని అమ్మి పాలన సాగించేలా ప్రణాళికలు వేశారు. ప్రజల ఆస్తులు అమ్మి సంక్షేమానికి ఖర్చుపెట్టడం సంక్షోభానికి దారితీస్తుంది. ఇవాళ ఏపీలో రోడ్లు వేసుకునే పరిస్థితి కూడా లేదు. అటువైపు..

  16న జగన్ భవితవ్యం: తర్వాతి సీఎం ఎవరు? -సుప్రీం నోటీసులు -సాయిరెడ్డికి చుక్కలు: ఎంపీ రఘురామ

  అభివృద్ధి చేసినా ఓటమి..

  అభివృద్ధి చేసినా ఓటమి..

  ఏపీలో అభివృద్ధి అటకెక్కింది. ఉపాధి హామీ బకాయి నిధులిస్తే.. ఎక్కడవి గత సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీ లకు పోతాయో అని పలు రకాల ఎంక్వైరీలు పెట్టారు. కానీ ఇప్పుడా మాజీ ప్రజాప్రతినిధుల్లో 85 శాతం మంది వైసీపీలో చేరారు. కనీసం ఇప్పటికైనా ఈజీఎస్ నిధులు ఇవ్వకుంటే నాయకులతోపాటు ప్రజలూ ఇబ్బంది పడడుతున్నారు. మరోవైపు తెలంగాణలో వెల్ఫేర్ స్కీములతో అభివృద్ది జరుగుతున్నా.. అధికార టీఆర్ఎస్ కు ప్రతికూల ఫలితాలు ఎందుకు వచ్చాయో వైసీపీ నేతలు ఆలోచించాలి. దుబ్బాకలో బీజేపీ విజయం వెనుక ప్రధాని మోదీ గ్లామర్ ఉందన్నది వాస్తవమే అయినా, కేసీఆర్ పథకాలు, అభివృద్ధి ఏమైపోయాయి అనేది ఇక్కడ ప్రశ్న. దీనిపై వైసీపీ నేతలు.. ముఖ్యంగా సీఎం కోటరీలోని సభ్యులు ఆలోచన చేయాలి.

  ట్రంప్‌కు మోదీ భారీ షాక్ -బైడెన్‌తో మాటామంతి -‘విదేశీ నేతల'పై ఆంక్షల వేళ సంచలనం

  సంచైత-సాయిరెడ్డి గురించి అందరికీ..

  సంచైత-సాయిరెడ్డి గురించి అందరికీ..

  మాన్సాస్ ట్రస్టు, సింహాచలం భూములపై కన్నేసిన వైసీపీ అనుచితాలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. ఆ ట్రస్టు ద్వారా లబ్దిపొందుతోన్న విద్యార్థులు ‘సేవ్ మాన్సాస్' పేరుతో పిటిషన్ రూపొందించారు. దానికి నేను కూడా సంతకం చేశాను. మాన్సాస్, సింహాచలం ఆలయాల వ్యవహారాల్లోకి వైసీపీ ఎంటరైందే దోపిడీ కోసం. ఎప్పుడో భర్తను వదిలేసి వెళ్లిన భార్యగారి బిడ్డ సంచైతను సాయిరెడ్డి ఎందుకు తెరపైకి ఎందుకు తెచ్చారో, దాని వెనుక కుట్ర ఏంటో ఉత్తరాంధ్రలో ఇంటింటికీ తెలుసు. పైకి మాత్రం ప్రభుత్వ భూముల జోలికొస్తే ఊరుకోబోమని విజయసాయి రెడ్డి చెబుతున్నారు. మరి ప్రైవేటు భూముల జోలికి వైసీపీ నేతలు వెళితే కాపాడేది ఎవరు?

  మాకేంటి? అని ప్రభుత్వం అడగటమేంటి?

  మాకేంటి? అని ప్రభుత్వం అడగటమేంటి?

  కొత్త ఇసుక విధానంపై ప్రజల నుంచి సలహాలు కొరిన ప్రభుత్వం.. తాజాగా ఇసుక తవ్వకాలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించే విషయమై ఆలోచనలుచేస్తున్నది. టన్నుకు ఎంతిస్తారో చెప్పమని కోరుతున్నారు. ఉచితంగా దొరికే ఇసుకపై జగన్ ద్వంద్వ విధానాలు అనుసరిస్తున్నారు. డబ్బులు పెట్టి జనం కొనుక్కుంటే ఉచితం అన్నారు.. సరే ఉచితంగా తీసుకుంటామంటే మళ్లీ పైసలు వసూలు చేస్తామంటున్నారు. ఉసుక విధానంలో చిత్తశుద్ధి ఉంటే.. రాష్ట్రం మొత్తం ఒకేరీతిగా రేటు పెట్టి టెండర్లు పిలవాలి. కానీ జీవోలో మాత్రం.. ‘‘ప్రభుత్వానికి ఎంత డబ్బు ఇస్తారు?''అని అడుగుతున్నారు. అసలు ఏపీకి కేంద్ర సంస్థలు వచ్చే పరిస్థితి ఉందా? వాటి ముసుగులో మళ్లీ ఆముగ్గురు కాంట్రాక్టర్లకే లబ్ది చేకూరేలా జనాన్ని ముంచబోతున్నారు. చంద్రబాబు బాటలోనే జగన్ పయనిస్తున్నారు. పట్టా భూముల్లో ఇసుక తొవ్వితే తప్పేంటి? కృష్ణాజిల్లాలో 10 లక్షల క్యూబిక్ మీటర్ల పరిధిలో మంచి ఇసుక ఉంది. పట్టాభూములు ఉన్నోళ్లు ఇసుక తొవ్వుకొని, ప్రభుత్వానికి పన్ను చెల్లించమని చెబితే తప్పేంటి? ఏపీలో సిమెంటు కంటే ఇసుక ప్రియం అయిపోయింది. దీనిపై కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలను పరిశీలిస్తాను. చివరిగా..

  వైఎస్సార్ జోలికొస్తే ఊరుకోబోము..

  వైఎస్సార్ జోలికొస్తే ఊరుకోబోము..

  మహానేత వైఎస్సార్ చనిపోయిన తర్వాత సరిగ్గా ఏడో రోజున నర్సాపురం నియోజకవర్గంలోని మార్టేరులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అది రాష్ట్రంలోనే మొట్టమొదటి వైఎస్సార్ విగ్రహం. అలాంటిదాన్ని మా ప్రభుత్వమే, మా నేతలే కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. సొంత డబ్బులతో బస్టాండ్ కడతానని చెబుతోన్న ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి.. ఆ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ నేనొక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నా.. వైఎస్సార్ అంటే జగన్ కు తండ్రి మాత్రమే కాదు.. ప్రజల ఆస్తి. మహానేత విగ్రహం జోలికొస్తే.. వైసీపీ, జగన్ లను కూడా జనం సహించబోరని గుర్తుంచుకోండి'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

  English summary
  narasapuram ysrcp raghurama krishnam raju said that telangana dubbaka by poll result is a lesson to ysrcp and ap cm jagan. speaking to media on friday, the rebel mp alleges that vijayasai reddy and sanchaita gajapathi raju trying to grab lands.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X