Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ రూట్‌లో వందే భారత్‌కు పచ్చజెండా ఊపిన ఏలూరు ఎంపీ

Vande Bharat Express: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 51 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.

సికింద్రాబాద్‌- విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అంచనాలకు మించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. వీకెండ్ రోజుల్లో ప్రయాణికుల తాకిడి మరింత అధికంగా ఉంటోంది. దీనితో పాటు అదనపు స్టేషన్లల్లో హాల్ట్ సౌకర్యన్ని కల్పించాలనే విజ్ఞప్తులూ అందుతున్నాయి.

MP Putta Mahesh flagged off Vande Bharat additional stop at Eluru Railway Station

వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌- విశాఖపట్నం- సికింద్రాబాద్ రూట్‌లో మరో స్టేషన్‌లో హాల్ట్ సౌకర్యాన్ని కల్పించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ప్రస్తుతం ఈ ఎక్స్‌ప్రెస్‌కు వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్‌లల్లో మాత్రమే హాల్ట్ సౌకర్యం ఉంది.

కొత్తగా ఏలూరు రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ కల్పించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఏలూరులో నిమిషం పాటు ఆగుతుంది. ఈ నేపథ్యంలో దానికి అటు ఇటుగా ఉండే విజయవాడ, రాజమండ్రి స్టేషన్లల్లో ఈ రైలు సమయాన్ని స్వల్పంగా సవరించాల్సి వచ్చింది.

నంబర్ 20707 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలుదేరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఉదయం 9:05 నిమిషాలకు విజయవాడకు చేరుకుంటుంది. 9:10 నిమిషాలకు బయలుదేరుతుంది. ఉదయం 9:49 నిమిషాలకు ఏలూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. 9:50 నిమిషాలకు బయలుదేరుతుంది. 11 గంటలకు రాజమండ్రికి చేరుకుంటుంది. 11:02 నిమిషాలకు విశాఖపట్నానికి బయలుదేరి వెళ్తుంది.

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు తిరుగుముఖం పట్టే నంబర్ 20708 నంబర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4:38 నిమిషాలకు రాజమండ్రికి చేరుకుంటుంది. 4:40 నిమిషాలకు బయలుదేరుతుంది.

MP Putta Mahesh flagged off Vande Bharat additional stop at Eluru Railway Station

సాయంత్రం 5:54 నిమిషాలకు ఏలూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. 5:55 నిమిషాలకు బయలుదేరుతుంది. 6:40 నిమిషాలకు విజయవాడకు చేరుకుని.. అయిదు నిమిషాల తరువాత సికింద్రాబాద్‌ వైపు పరుగులు పెడుతుంది.

ఏలూరులో ఆగిన తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును లోక్‌సభ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్.. పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారంతా ఏలూరు నుంచి విజయవాడకు అదే రైలులో ప్రయాణించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+