రాత్రి పూట పెరుగు తింటున్నారా.. అయితే జాగ్రత్త..!
చాలా మందికి పెరుగు అంటే ఇష్టముంటుంది. కొందరైతే పెరుగు లేనిదే అన్నం తినరు. అన్నం చివరన పెరుగు లేకుండా.. భోజనం ముగించరు. ఇక పెళ్లిలు, ఫంక్షన్లకైతే పెరుగు ఉండాల్సిందే. అయితే చాలా మంది మధ్యాహ్నంతో పాటు రాత్రి కూడా పెరుగు తింటారు. మధ్యాహ్నం తింటే మంచిదే కానీ రాత్రి తింటే సమస్యలు తలెత్త అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు
రాత్రి పూట ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు రాత్రి తింటే మాత్రం జలుబు చేసే అవకాశాలున్నాయి. రాత్రిపూట పెరుగు తినడం వల్ల గొంతులో కఫం ఏర్పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు తప్పనిసరిగా పెరుగు తినాల్సి వస్తే.. పలుచని మజ్జిగ తాగడం మంచిదని సూచిస్తున్నారు.

కీళ్లనొప్పులు
కీళ్లనొప్పులతో బాధపడేవారు రోజూ పెరుగు తింటే మంచిది కాదు. బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదట ఎందుకంటే ఆహారం జీర్ణం కాదట. పెరుగు ఎముకలు, దంతాలకు బలాన్ని అందిస్తుంది, అయితే ఇప్పటికే ఆర్థరైటిస్ ఉన్నవారు పెరుగును తినడం తగ్గించాలి.

ఫాస్ఫరస్
ప్రతిరోజూ పెరుగు తీసుకునే వారిలో గుండె సంబంధిత సమస్యలు చాలామటుకు కంట్రోల్‌లో ఉంటాయట. దీన్ని తీసుకోవడం వల్ల హైబీపీ కూడా అదుపులోకి వస్తుందట. పెరుగులో ఉండే ఫాస్ఫరస్ ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి.












Click it and Unblock the Notifications