Vitamin C: మీకు 'సి' విటమిన్ లోపం ఉందా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!

తరచుగా తలనొప్పి వస్తోంటే పని ఒత్తిడి భావించి కాఫీనో టీనో తాగితే తగ్గిపోతుందని అనుకుంటాం. గంటకోసారి టీ తాగడం అలవాటు చేసుకుంటాం. కానీ ఏ సమస్యకైనా మనం తీసుకునే ఆహారంలో లోపాలే. మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు,విటమిన్లు ఉండాలి. ముఖ్యంగా మనకు మిటమిన్ సి చాలా అవసరం. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయట.

రోగ నిరోధక శక్తి

రోగ నిరోధక శక్తి

విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఇది సంక్రమణను నివారించడానికి, వ్యాధితో పోరాడటానికి సహాయపడుతుందట. సమతుల్య ఆహారం, వివిధ రకాల పండ్లు, కూరగాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ సి అందుతుంది. నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

తెల్లరక్తకణాలు

తెల్లరక్తకణాలు

తెల్లరక్తకణాల ఉత్పత్తినీ పనితీరునీ ఎంతో మెరుగుపరిచే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌- 'సి' విటమిన్‌. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలర్జీలనూ ఇన్‌ఫెక్షన్లనూ నివారిస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది- దీన్ని శరీరం నిల్వ చేసుకోలేదు. కాబట్టి రోజూ ఆహారంలో తగినంత తీసుకోక తప్పదు. నిమ్మ, బత్తాయి, నారింజ, ఉసిరి, స్ట్రాబెర్రీ, జామ, బొప్పాయి, క్యాబేజీ, పచ్చిమిర్చి, బంగాళాదుంప, బ్రకోలి, కొత్తిమీరలాంటి వాటిల్లో ఈ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది.

కొత్తిమీరలో

కొత్తిమీరలో

'సి' విటమిన్‌ నిమ్మజాతి పండ్లలోనే ఉంటుందని చాలామందికి అపోహ. నిజానికి వందగ్రాముల నిమ్మ పండు కన్నా జామపండులో మూడురెట్లు, కొత్తిమీరలో రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందిది. నిమ్మలో బొప్పాయిలో దాదాపు సమానంగా ఉంటుందట. కివీ పండ్లల్లో విటమిన్ సి తో పాటుగా డైటరీ ఫైబర్ కకూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

ఎముకల బలోపేతం

ఎముకల బలోపేతం

బొప్పాయి మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు ఇది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది కూడా. అలాగే ఎముకలను బలోపేతం చేస్తుంది. ఒక కప్పు బొప్పాయిలో 88.3 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. బ్రోకలీలో ఫైబర్ తో పాటుగా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండులో క్యాన్సర్ ను నివారించే సామర్థం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని, మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+