health tips: తిన్నాక ఈ పనులు చేస్తున్నారా? డేంజర్ .. చెక్ చేసుకోండి!!

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని సూత్రాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా భోజనం చేయకముందు, చేసిన తర్వాత కొన్నిటిని తినకుండా ఉంటే బరువు పెరగకుండా ఉంటుంది. విపరీతంగా పొట్ట పెరగడానికి బరువు పెరగడానికి ఏది పడితే అది తినడం, సమయం ప్రకారం తినకపోవడం కారణాలని చెబుతున్నారు.

భోజనం చేసిన తర్వాత తినకూడనివి, తాగకూడనివి ఇవే

భోజనం చేసిన తర్వాత తినకూడనివి, తాగకూడనివి ఇవే

ఇక భోజనం చేసే ముందు చేసిన తరువాత తినకూడని పదార్థాల విషయానికి వస్తే, భోజనం చేసే ముందు కానీ చేసిన తర్వాత గానీ పండ్లను ఎక్కువగా తినకూడదు. అలా తింటే పొట్ట బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక భోజనం చేసిన తర్వాత చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అలా కూల్ డ్రింక్స్ తాగటం కూడా మంచిది కాదని దానివల్ల కూడా పొట్ట పెరుగుతుందని చెబుతున్నారు. ఇక చాలామంది భోజనం చేసే ముందు, చేసిన తర్వాత విపరీతంగా స్వీట్స్ తింటారు. ఇలా స్వీట్స్ తినడం కూడా బాగా పొట్ట పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు.

భోజనం తర్వాత టీ తాగటం, నిద్ర పోవటం మంచిదేనా ?

భోజనం తర్వాత టీ తాగటం, నిద్ర పోవటం మంచిదేనా ?

భోజనం చేసిన తర్వాత చాలా మంది నిద్రకు ఉపక్రమిస్తారు. చక్కగా గంట రెండు గంటల పాటు మంచి నిద్ర తీస్తారు. కానీ ఆ విధంగా చేయడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత తిన్న భోజనం అరగకముందే పడుకుంటే అది జీర్ణ సమస్యలను తీసుకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక భోజనం చేసిన తర్వాత చాలా మంది టీ తాగుతూ ఉంటారు. అలా చేయడం వల్ల తేయాకు లో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరము ఉపయోగించుకోకుండా అడ్డుకుంటుందని అది ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

తిన్న తర్వాత స్నానం చేస్తున్నారా? అయితే జరిగేదిదే

తిన్న తర్వాత స్నానం చేస్తున్నారా? అయితే జరిగేదిదే

ఇక చాలామంది భోజనం చేసే సమయంలో విపరీతంగా నీటిని తాగుతూ ఉంటారు. అలా నీటిని తాగడం మంచిది కాదని చెబుతున్నారు. దానివల్ల కూడా పొట్ట పెరుగుతుందని అంటున్నారు. చాలా మంది తినగానే స్నానం చేయడానికి వెళుతూ ఉంటారు. దానివల్ల కాళ్లు, చేతుల్లో రక్తప్రసరణ పెరుగుతుందని, పొట్టచుట్టూ రక్తప్రసరణ తగ్గి జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుందని చెప్తున్నారు. కాబట్టి స్నానం చేసిన తర్వాత భోజనం చేయవచ్చు కానీ, భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదని హెచ్చరిస్తున్నారు.

భోజనం చేసిన వెంటనే నడుస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి

భోజనం చేసిన వెంటనే నడుస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి

అంతేకాదు భోజనం అయిన వెంటనే నడిస్తే ఆరోగ్యంగా ఉంటామని, తిన్న వెంటనే చాలామంది నడక ప్రారంభిస్తారు. అయితే ఇది కూడా మంచిది కాదని చెబుతున్నారు. ఎందుకంటే భోజనం చేసిన వెంటనే నడవడం వల్ల పోషకాలను గ్రహించడంలో జీర్ణవ్యవస్థ విఫలమవుతోందని, తిన్న తర్వాత పదినిమిషాల తర్వాత నడిస్తే మంచిదని చెబుతున్నారు. ఇక ఈ విషయాలను తెలుసుకొని తినేముందు, తిన్న తర్వాత ఈ పనులను చేయకుండా ఉంటే పొట్ట పెరగదని, ఊబకాయం రాదని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+