వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: వేడినీళ్ళు తాగటం మంచిదే.. కానీ అదేపనిగా తాగితే మాత్రం డేంజర్.. ఎందుకంటే!!

|
Google Oneindia TeluguNews

చాలా మంది బరువు తగ్గడానికి మరియు చర్మ సమస్యల నుండి బయటపడటానికి వేడి నీటిని తాగుతూ ఉంటారు. అంతే కాకుండా జలుబు రాకుండా కూడా వేడి నీటిని తాగుతారు. వేడి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్న క్రమంలో చాలా మంది ఇటీవల కాలంలో వేడి నీళ్లు తాగడం పై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు.

అతిగా వేడినీళ్ళు తాగితే అనేక నష్టాలు

అతిగా వేడినీళ్ళు తాగితే అనేక నష్టాలు


కొంతమంది ఉదయాన్నే నిద్రలేచి వేడినీరు తాగడం వల్ల బరువు తగ్గుతామని, ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతున్నారు. రాత్రి పడుకోబోయే ముందు కూడా వేడి నీళ్ళు తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు. వేడి నీళ్లు తాగడం మంచిదే అయినా అదేపనిగా వేడి నీళ్ళు తాగడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు వైద్యనిపుణులు. మీరు ఎక్కువగా వేడినీరు తాగితే, అది మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

దాహం వేసినప్పుడల్లా వేడినీళ్ళు తాగితే మెదడుపై ప్రభావం

దాహం వేసినప్పుడల్లా వేడినీళ్ళు తాగితే మెదడుపై ప్రభావం


వేడి నీళ్లు తాగొచ్చు కానీ, అదేపనిగా వేడి నీళ్లు తాగడం, ఎప్పుడు దాహం అనిపించినా వేడినీరు తాగడం మీ ఏకాగ్రతను ప్రభావితం చేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. చాలా వేడి నీరు మెదడు కణాల వాపుకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇది మానసిక సమస్యలకు దారి తీస్తుందని చెప్తున్నారు.

 ఎక్కువ వేడినీళ్ళు తాగితే మూత్రపిండాలపై ప్రభావం

ఎక్కువ వేడినీళ్ళు తాగితే మూత్రపిండాలపై ప్రభావం


అదేపనిగా వేడినీరు తాగడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయని కూడా అంటున్నారు. మూత్రపిండాలు ప్రత్యేక కేశనాళిక వ్యవస్థను కలిగి ఉంటాయని, ఇవి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తాయి అని చెబుతున్నారు. అయితే వేడి నీళ్ల వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా వేడి నీరు తాగే వారిపై చెడు ప్రభావం చూపుతుంది. కిడ్నీలు ఎక్కువగా పని చేయడం వల్ల, పాడైపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

వేడినీళ్ళతో జీర్ణవ్యవస్థకు ఇబ్బంది

వేడినీళ్ళతో జీర్ణవ్యవస్థకు ఇబ్బంది


చాలా వేడి నీరు కూడా జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా వేడి నీరు తాగితే అది ప్రేగులను కూడా ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ప్రేగులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు వేడినీరు తాగడం మానుకోవాలని సలహా ఇస్తున్నారు. అంతేకాదు వేడినీరు తాగడం నోటిపూతలకు కారణమవుతుందని చెబుతున్నారు.

అతిగా వేడినీళ్ళు తాగితే శ్వాసకోశ వ్యాధుల సమస్య

అతిగా వేడినీళ్ళు తాగితే శ్వాసకోశ వ్యాధుల సమస్య


అతిగా వేడినీరు తాగడం వల్ల చాలా తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఇది మెదడు మరియు శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. వేడి నీళ్లు తాగవచ్చు గాని ఉదయం, రాత్రి సమయాల్లో లిమిట్ గా తాగడం వల్ల అది ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని, అలాకాకుండా అతిగా తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక వేడి నీళ్ల విషయంలో అతి సర్వత్రా వర్జయేత్ అంటున్నారు వైద్య నిపుణులు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Medical experts say that drinking hot water is good, but there are also disadvantages of drinking hot water too much. It is said that drinking too much hot water affects the brain, kidneys, digestive system and respiratory system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X