వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: విపరీతమైన నడుం నొప్పా? ఉపశమనం కోసం సింపుల్ చిట్కాలు.. ట్రై చెయ్యండి!!

|
Google Oneindia TeluguNews

చాలామంది నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇక నడుం నొప్పి తగ్గడం లేదని ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. నడుం నొప్పికి విపరీతంగా మందులు వాడతారు. అయితే జీవన విధానాన్ని మార్చుకోవడం, నడుము నొప్పికి సంబంధించి అది తగ్గే విధంగా నిపుణుల సలహా మేరకు వ్యాయామం చేయడం వంటి చిన్న చిన్న పనులతో నడుం నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందొచ్చు. నడుం నొప్పి నుండి ఉపశమనం పొందడానికి చేయవలసిన అనేక పనులను ఇక్కడ తెలుసుకుందాం.

health tips: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్నిసార్లు తినాలి? ఆయుర్వేదం ఏం చెప్తుందంటే!!health tips: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్నిసార్లు తినాలి? ఆయుర్వేదం ఏం చెప్తుందంటే!!

నడుము నొప్పిని తగ్గించుకునే సింపుల్ చిట్కా లు

నడుము నొప్పిని తగ్గించుకునే సింపుల్ చిట్కా లు


బాగా నడుము నొప్పిగా ఉన్నవారు తగ్గించుకోవాలంటే ముందు మీరు ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెన్నెముక కండరాలు బలోపేతం చేయడంతోపాటు, కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. చిన్న చిన్న టిప్స్ తో నడుం నొప్పిని తగ్గించుకోవచ్చు. పడుకునే సమయంలో వెనుక భాగం పై ఒత్తిడి పడుతుంది. నడుంనొప్పి ఎక్కువగా ఉన్నవారు మోకాళ్ళ కింద దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల, కాళ్ళు ఎత్తుగా పెట్టడం వల్ల నడుంపై ఒత్తిడి తగ్గి కాస్త రిలీఫ్ గా ఉంటుంది.

సరైన శిక్షణతో వ్యాయామం.. నడుం నొప్పి నుండి ఉపశమనం

సరైన శిక్షణతో వ్యాయామం.. నడుం నొప్పి నుండి ఉపశమనం


ఇక నడుం నొప్పిని తగ్గించుకోవడంలో వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక వ్యాయామం చేసే సమయంలో నడుముకు సంబంధించిన ముఖ్యమైన కండరాలపై దృష్టిసారించి సరైన శిక్షణతో వ్యాయామం చేయడం వల్ల, ముఖ్యంగా కండరాలను సాగదీసే స్ట్రెచ్ ఎక్సర్సైజులు చేయడంవల్ల ఫలితం ఉంటుంది. మీ వెన్ను సంబంధిత గాయాల ప్రమాదాన్ని తగ్గించడంలో వ్యాయామం సహాయపడుతుంది. నడుం నొప్పి తగ్గడం కోసం వారానికి కనీసం రెండు సార్లు నడుమును బలపరిచే వ్యాయామాలను చేయండి

కాల్షియం మరియు విటమిన్ డి తీసుకోవడంతో ప్రయోజనాలు

కాల్షియం మరియు విటమిన్ డి తీసుకోవడంతో ప్రయోజనాలు


ఎముకలు బలంగా ఉన్నప్పుడు నడుము నొప్పి వంటి సమస్యలు ఎక్కువ బాధించవు. బలహీనమైన ఎముకలు ఉన్నప్పుడు కచ్చితంగా నడుంనొప్పి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి కాల్షియం మరియు విటమిన్ డి పుష్కలంగా తీసుకోవడం ద్వారా మీ వెన్నెముకలోని ఎముకలకు బలం చేకూరుతుంది. అందుకే తప్పనిసరిగా కాల్షియం మరియు విటమిన్ డి తీసుకోవడం మర్చిపోకండి. పాలు, పెరుగు, ఆకుకూరలు, విటమిన్ సప్లిమెంట్లు వంటి వాటిలో విటమిన్ డి ఉంటుంది.

నడుము నొప్పి ఉన్నవారు చెప్పుల విషయం లో జాగ్రత్త

నడుము నొప్పి ఉన్నవారు చెప్పుల విషయం లో జాగ్రత్త


నడుం నొప్పిని నివారించడం కోసం చెప్పుల వినియోగం పైన కూడా జాగ్రత్త వహించండి. ఎత్తు మడమల చెప్పులు ఎక్కువగా వేసుకునే వారికి నడుం నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ మడమ ఉన్న చెప్పులను ధరించండి. ఇవి మన నడుంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒక్క అంగుళం కంటే తక్కువ మడమ ఉంటేనే ఫలితం ఉంటుంది.

కూర్చునే, నిల్చునే భంగిమల విషయంలో జాగ్రత్త

కూర్చునే, నిల్చునే భంగిమల విషయంలో జాగ్రత్త


ఇక ఆఫీసులో కూర్చున్నప్పుడు, నిలబడి ఉన్నప్పుడు సరైన భంగిమ పద్ధతులను పాటించండి. మనం కూర్చునే విధానం బట్టి కూడా నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే కూర్చున్నా, నిల్చున్నా కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి ప్రతిరోజూ గంటల తరబడి కంప్యూటర్ ముందు పని చేసేవారు మంచి కుర్చీని ఎంపిక చేసుకొని కూర్చోవాలి. లేదంటే నడుం నొప్పి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది.

 బరువు తగ్గితే నడుం నొప్పి నుండి ఉపశమనం

బరువు తగ్గితే నడుం నొప్పి నుండి ఉపశమనం

ఇక నడుం నొప్పికి మరొక కారణం విపరీతమైన బరువు. ఎక్కువ బరువు ఉన్న వారిలోనూ నడుము నొప్పి విపరీతంగా వస్తుంది. బరువు తగ్గితే సహజంగానే నడుం నొప్పి నుండి కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గటం పై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు, చిన్న చిన్న మార్పులతో నడుం నొప్పి ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మందులతోనే నడుము నొప్పి తగ్గాలని చూడకుండా, ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి. కచ్చితంగా విపరీతమైన బాధ నుండి కాస్తయినా ఉపశమనం పొందుతారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Extreme back pain? Simple tips such as exercising for relief, sleeping with a pillow under the knees, taking care in sitting and standing postures, and reducing stress can help relieve back pain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X