• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Health tips: పండుగల సమయంలో 5డైట్ చిట్కాలు పాటించండి.. మీ ఆరోగ్యం మీ చేతుల్లో!!

|
Google Oneindia TeluguNews

పండుగల సీజన్ వచ్చింది. వినాయక చవితి తర్వాత వరుసగా, దసరా, దీపావళి పండుగలను జరుపుకుంటాము. అయితే ప్రతి వేడుకలో, పండుగ సందర్భంగా చేసే ప్రత్యేకమైన వంటలు మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు పండుగ సీజన్ ముందు మీ శరీరాన్ని సిద్ధం చేయడానికి సరైన డిటాక్స్ ప్లాన్‌ను స్వీకరించాలని సూచిస్తున్నారు. ఇక పండుగ సమయంలో ఆహారం కారణంగా ఆరోగ్యం పాడు కాకుండా తీసుకోవాల్సిన అనేక జాగ్రత్తలను డైటీషియన్లు సూచిస్తున్నారు.

క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు.. మొదట చెయ్యాల్సింది ఇదే
సరైన ఆహారపు అలవాట్లు ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారని డైటీషియన్లు చెబుతున్నారు. ఇక కొన్ని సమయాలలో బాగా ఎక్కువగా ఆహారం తీసుకోవడం, మరికొన్ని సమయాలలో బాగా తక్కువగా ఆహారం తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లలో ఎప్పుడూ మధ్యస్తంగా తినాలని, తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవడం పెంచాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. మరియు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.

health tips: Follow 5 Diet Tips in Festive Season; Your Health In Your Hands!!

శరీరం డీహైడ్రేడ్ కాకుండా చెయ్యాల్సింది ఇదే
శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేషన్ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఎప్పుడూ ఎక్కువ గా నీరు త్రాగాలి అని కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం మరియు మరిన్ని ఆరోగ్యకరమైన ద్రవాలను డైట్ లో చేర్చుకోవాలి అని సూచిస్తున్నారు. అలాగే, మీరు హెల్తీ హెర్బ్స్ మరియు మసాలా దినుసులతో హెర్బల్ టీ తయారుచేసుకుని తాగవచ్చని సూచిస్తున్నారు.

health tips: Follow 5 Diet Tips in Festive Season; Your Health In Your Hands!!

ఇవి తాగటం మానుకోండి
ఇక ఇదే సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆల్కహాల్ మరియు కెఫిన్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్ మానుకోవాలని సలహా ఇస్తున్నారు. ఆరోగ్యకరమైన పానీయాలను, పండ్ల రసాలను తీసుకోవాలి అని సూచిస్తున్నారు. లేట్ నైట్ పార్టీలకు దూరంగా ఉంటే మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక కాఫీలు, టీలు తరచుగా తాగే అలవాటు ఉన్నా మానుకోవాలని సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్ కు స్వస్తి చెప్పాలని సూచిస్తున్నారు.

health tips: Follow 5 Diet Tips in Festive Season; Your Health In Your Hands!!

ఒత్తిడి తగ్గించుకోవటానికి ఈ పని చెయ్యాల్సిందే

ఇక ఇదే సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం కూడా అవసరం అని సలహా ఇస్తున్నారు. ఒత్తిడిని తగ్గించడానికి మరియు జీవక్రియను మెరుగుపరచడానికి యోగాను ప్రయత్నించవచ్చు , లేదా వాకింగ్ చేయవచ్చని సూచిస్తున్నారు. అంతేకాదు ఎక్సర్సైజులు చేయడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.

శరీరం నుండి వ్యర్ధాలను తొలగించటంలో దీనిదే కీలకపాత్ర
అంతేకాదు తగినంత నిద్ర కూడా మనుషుల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మంచి నిద్ర యొక్క ప్రాముఖ్యతను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దని సలహా ఇస్తున్నారు. ఇది మన శరీరాన్ని డిటాక్సిఫై చేసి, మన శరీరాన్ని ఫ్రెష్‌గా మార్చడంలో సహాయపడుతుంది. అందువల్ల, ప్రతి రాత్రి తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి ఇవి చేస్తే చాలు
మితాహారం తీసుకోవడం, మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ద్రవపదార్థాలు ఉండేలా చూసుకోవడం, పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవడం, శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవడం, ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ప్రతిరోజూ ఏడు నుండి ఎనిమిది గంటలపాటు నిద్రపోవడం మన శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అని, అనారోగ్య సమస్యల నుండి రక్షిస్తాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలతో ఆరోగ్యాన్ని కాపాడుకుని పండుగలను అందరితో ఉల్లాసంగా జరుపుకోవాలని చెప్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Doctors say that your health will be in your hands if you follow 5 diet tips during festivals like eating fresh fruits and vegetables, drinking more fluids, exercising, sleeping properly, and eating limit food
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X