Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

health tips: మొబైల్-ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోతున్నారా? 100లో 80మందికి ఈ జబ్బు.. జాగ్రత్త!!

ఆధునిక యుగంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి మొబైల్‌, ల్యాప్‌టాప్‌ల వినియోగం బాగా పెరిగిపోయింది. మొబైల్‌లు ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తున్నాయి. ఇక ఉద్యోగాలలో ల్యాప్‌టాప్‌లు మరియు కంప్యూటర్‌ల వాడకం దాదాపు తప్పనిసరి అయింది. రోజువారీ జీవితంలో, ప్రజలు మొబైల్‌లు మరియు ల్యాప్‌టాప్‌లను ఉపయోగించటం ఒక నిత్య అవసరంగా మారిపోయింది. అవి లేకుంటే పూట గడవని స్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక ఇదే వారి ఆరోగ్యానికి చేటు చేస్తుందని చెబుతున్నారు వైద్యనిపుణులు.

మొబైల్, ల్యాప్ ట్యాప్ ల వినియోగం వల్ల కళ్ళ సమస్యలు, నరాల జబ్బులు

మొబైల్, ల్యాప్ ట్యాప్ ల వినియోగం వల్ల కళ్ళ సమస్యలు, నరాల జబ్బులు

మొబైల్ మరియు ల్యాప్‌టాప్‌ల అధిక వినియోగం ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా పెంచుతోందని హెచ్చరిస్తున్నారు. తరచుగా పిల్లలు ఎక్కువ మొబైల్స్ ఉపయోగించడం వల్ల వారికి హాని కలుగుతుందని చెబుతున్నారు. పదేపదే మొబైల్ లను ఉపయోగించడం వల్ల, అలాగే ల్యాప్‌టాప్‌ల అధిక వినియోగం కళ్ళకు హాని కలిగించడమే కాకుండా, నరాల నొప్పి వంటి సమస్యలు పెరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మొబైల్, ల్యాప్ టాప్ ఉపయోగించేవారిలో 80 శాతం మందికి న్యూరాల్జియా

మొబైల్, ల్యాప్ టాప్ ఉపయోగించేవారిలో 80 శాతం మందికి న్యూరాల్జియా

మొబైల్ మరియు ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా ఉపయోగించే వారిలో 80 శాతం మంది న్యూరాల్జియాతో బాధపడుతున్నారని ఇటీవల ఒక అధ్యయనం తేల్చింది. న్యూరాల్జియా అంటే నిర్దిష్టమైన నరాల నొప్పి . న్యూరాల్జియా సమస్య ఉన్న వారిలో శరీరంలో ఏ నరాలైనా ప్రభావితమవుతాయి. ఎక్కువగా ల్యాప్‌టాప్‌లను చూడడం వల్ల , మొబైల్ ఫోన్లను వదిలిపెట్టకుండా చూస్తూ ఉండడం వల్ల ఈ సమస్య వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు

నరాల నొప్పి తీవ్రతరమై న్యూరాల్జియాగా... కారణం ఇదే

నరాల నొప్పి తీవ్రతరమై న్యూరాల్జియాగా... కారణం ఇదే

సహజంగా మనుషులలో కలిగే నరాల నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. రసాయనాలు, మధుమేహం, వాడుతున్న మందుల వల్ల, ఇన్ఫెక్షన్ తదితర కారణాల వల్ల నరాలపై ఒత్తిడి ఉంటుంది. ల్యాప్‌టాప్ లేదా మొబైల్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా నరాల ఒత్తిడి వల్ల నొప్పి వస్తుంది. ఇది న్యూరల్జియా బాధను మరింత పెంచుతుంది. కోవిడ్ కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు డెస్క్ వర్క్ పెరిగిన తర్వాత, ల్యాప్‌టాప్‌లు మరియు మొబైల్‌ల వాడకం దాదాపు పది రెట్లు పెరిగింది. దీని అధిక వినియోగం కారణంగా ప్రజలు న్యూరాల్జియా బారిన పడుతున్నారు.

న్యూరాల్జియా కోసం మందులు వాడినా ఫలితం శూన్యం

న్యూరాల్జియా కోసం మందులు వాడినా ఫలితం శూన్యం

మెడ నుండి మోచేతికి మరియు నడుము నుండి పాదాలకు నరాల నొప్పుల బాధలను అనుభవిస్తున్నారు. అయితే ఈ నొప్పితో బాధపడుతూ వైద్యుల వద్దకు వెళ్లి మందులు వేసుకున్నా.. నొప్పి తగ్గకపోవడంతో ఎమ్‌ఆర్‌ఐ, సీటీ స్కాన్‌లు చేయగా గంటల తరబడి మొబైల్‌, ల్యాప్‌టాప్‌ వాడడం వల్ల ఇలా వారు నరాల నొప్పుల బారిన పడుతున్నట్టు తేలింది. మెడలోని డిస్క్ ఉబ్బరం.. అనేక నరాల మార్గాలపై ఒత్తిడి కారణంగా, న్యూరల్జియా సమస్య మరింత పెరుగుతున్నట్లుగా వెల్లడైంది

న్యూరాల్జియా లక్షణాలు ఇవే

న్యూరాల్జియా లక్షణాలు ఇవే

ఇక న్యూరాల్జియా లక్షణాలను చూస్తే మెడ నుంచి మోచేతులు మోకాళ్ల వరకు నొప్పులు రావడం, మంటలు మరియు తిమ్మిర్లు వంటి అనుభూతి కలగడం, భుజంలో తిమ్మిర్లు రావడం, కండరాల బలహీనతతో పాటు కండరాల నొప్పి కలగడం కనిపిస్తుంది. అకస్మాత్తుగా నొప్పి ప్రారంభమై అది తీవ్రతరమవుతుంది. ఒక్కోసారి నడవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అయితే న్యూరాల్జియాతో బాధపడుతున్న వారికి డాక్టర్లు ఇచ్చే మందులతోపాటు కొన్ని చిట్కాలను పాటించవలసిన అవసరం ఉందని చెబుతున్నారు.

న్యూరాల్జియా తగ్గాలంటే చెయ్యాల్సిన చిట్కాలు ఇవే

న్యూరాల్జియా తగ్గాలంటే చెయ్యాల్సిన చిట్కాలు ఇవే

న్యూరాల్జియా బాధితులు సాధ్యమైనంత వరకూ మొబైల్ ఫోన్ ను, ల్యాప్ టాప్ వాడకాన్ని తగ్గించాలి అని సలహా ఇస్తున్నారు. మొబైల్ ఉపయోగిస్తున్నప్పుడు మరీ కళ్ళకి దగ్గరగా పెట్టుకోకూడదు అని సూచిస్తున్నారు. లాప్ టాప్, మొబైల్ ఫోన్ ను చూస్తున్నప్పుడు యాంటీ గ్లేర్ గ్లాసులను ఉపయోగించాలని సలహా ఇస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మెడ, నడుం, నరాల నొప్పులు తగ్గుతాయని సూచిస్తున్నారు. ఇక ఉద్యోగస్తులు లాప్ ట్యాప్ ముందు గంటల తరబడి కూర్చోకుండా, మధ్య మధ్యలో ఒక ఐదు పది నిముషాలు బ్రేక్ తీసుకుంటూ పని చేసుకుంటే కాస్త న్యూరాల్జియా సమస్య నుండి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఎక్కువ గ్యాడ్జెట్స్ ఉపయోగం వల్ల అనవసరమైన రోగాలను కొనితెచ్చుకుంటున్నామని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+