తొక్కలోది అని తీసిపారేస్తున్నారా? నిమ్మతొక్కలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా ఆ పని చెయ్యరు!!

మనం సాధారణంగా నిమ్మకాయలను వాడిన తర్వాత తొక్కలను పడేస్తూ ఉంటాం. తొక్కే కదా అని మనం లైట్ తీసుకుంటాం. తొక్కలతో ఎటువంటి ప్రయోజనం ఉండదని అనుకుంటాం కానీ నిమ్మకాయ తొక్క లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా మనం వాటిని ఉపయోగించుకుంటాం. ఎట్టిపరిస్థితుల్లోనూ పారేయడానికి ఇష్టపడం. అసలు ఇంతకీ నిమ్మకాయ తొక్కలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? నిమ్మకాయ తొక్క వల్ల కలిగే లాభాలు ఏంటి? అంటే..

నిమ్మ తొక్కలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

నిమ్మ తొక్కలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

నిమ్మకాయ తొక్కలలో శక్తివంతమైన బయో యాక్టివ్ కాంపౌండ్స్ తోపాటు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సీ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి, మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇక నిమ్మతొక్కలలో ఉండే డీలైమొనెన్ గుండెజబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నిమ్మతొక్కలు క్యాన్సర్ వ్యాధిని నయం చేయడంలోనూ ఎంతగానో ఉపయోగపడతాయి. నిమ్మతోక్కల పొడి శరీర సౌందర్యాన్ని పెంచే స్క్రబ్ గా కూడా ఉపయోగపడుతుంది.

 నిమ్మ తొక్కలతో చర్మ సమస్యలకు పరిష్కారం.. టీలలో కూడా కలుపుకుంటే బెస్ట్

నిమ్మ తొక్కలతో చర్మ సమస్యలకు పరిష్కారం.. టీలలో కూడా కలుపుకుంటే బెస్ట్


నిమ్మ తొక్కలను ఎండబెట్టి, వాటిని పొడిగా చేసి ఆ పొడిలో కాస్త తేనె కలిపి, ముఖానికి అప్లై చేస్తే ముఖం పైన ముడతలు, మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. నిమ్మ తొక్కలను నేరుగా ముఖానికి అప్లై చేస్తే డార్క్ స్పాట్స్, ముడుతలు, ఇతర చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఎండబెట్టిన నిమ్మ తొక్కల పొడిని గ్రీన్ టీ, హెర్బల్ టీలో కలుపుకొని తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మ తొక్కల పొడిని కొంచెం వంట సోడా, ఉప్పు కలిపి పళ్ళు తోముకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి, తెల్లగా మెరుస్తాయి.

 నిమ్మ తొక్కలతో చెడు కొలెస్ట్రాల్ కు చెక్.. స్ట్రెస్ రిలీఫ్

నిమ్మ తొక్కలతో చెడు కొలెస్ట్రాల్ కు చెక్.. స్ట్రెస్ రిలీఫ్


నిమ్మ తొక్కల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీనిని మనం తీసుకోవడం వల్ల మన జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గించడానికి కూడా నిమ్మ తొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మ తొక్క లో ఉండే పెక్టిన్ వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నిమ్మ తొక్కను వాసన చూస్తే ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. నిమ్మ తొక్క లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల అది మన శరీరం ఆరోగ్యంగా ఉండే లాగా సహాయపడుతుంది. గాల్ బ్లాడర్ లో ఏర్పడే రాళ్ళు పోవడానికి కూడా నిమ్మతొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతారు. అందుకే నిమ్మ తొక్కలను పడేయకుండా వాటిని పొడి చేసుకుని పెట్టుకుంటే అది వివిధ రకాలుగా మనకు ఆరోగ్యాన్ని తెచ్చి పెడుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+