వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: సరిగ్గా నిద్ర రావటంలేదా? మీ జీవనశైలి, ఈ పనులే కారణాలు కావొచ్చు!!

|
Google Oneindia TeluguNews

మీరు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారా? రాత్రి పూట నిద్ర రావడం లేదని తెగ బాధపడుతున్నారా? నిద్ర రాకపోవడం వెనుక అనేక కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది నిద్ర అని వైద్యులు ఇప్పటికే చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్ర పోవాలని సూచిస్తున్నారు ఇక టీనేజర్లు రాత్రిపూట 10 గంటల పాటు నిద్ర పోవాలని నిపుణులు చెబుతున్నారు.

health tips: నిద్రలేమితో బాధపడుతున్నారా... ప్రశాంతమైన నిద్ర కోసం ఈ చిట్కాలు ట్రై చెయ్యండి!!health tips: నిద్రలేమితో బాధపడుతున్నారా... ప్రశాంతమైన నిద్ర కోసం ఈ చిట్కాలు ట్రై చెయ్యండి!!

 నిద్ర పోలేకపోవటం క్వాలిటీ లైఫ్ ను దెబ్బ తీస్తుంది

నిద్ర పోలేకపోవటం క్వాలిటీ లైఫ్ ను దెబ్బ తీస్తుంది


అయితే చాలామంది నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. నిద్రలేమి జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేయవచ్చు. తగినంత నాణ్యమైన నిద్ర పోకపోవడం మీ క్వాలిటీ లైఫ్ ను దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఇంతకీ నిద్రపోలేకపోవడానికి కొన్ని ప్రధాన కారణాలను గురించి తెలుసుకుందాం.

సమయపాలన , మంచి నిద్ర అలవాట్లు లేకుంటే నిద్రలేమి సమస్య

సమయపాలన , మంచి నిద్ర అలవాట్లు లేకుంటే నిద్రలేమి సమస్య


మనిషి జీవితాన్ని సక్రమంగా నడిపించడానికి మంచి ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలో, అదేవిధంగా మంచి నిద్ర అలవాట్లు కూడా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచి నిద్ర కోసం నిద్రపోయే సమయాన్ని కచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కొంతమంది రాత్రి సమయాలలో ఎప్పుడు పడితే అప్పుడు పాడుకుంటూ ఉంటారు. రోజుకో టైం ప్రకారం నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం కూడా నిద్రలేమికి కారణం అవుతుందని చెబుతున్నారు. క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకునేవారు, సమయపాలన పాటిస్తూ, ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమిస్తే నిద్రలేమి సమస్య నుండి బయట పడవచ్చు అని చెబుతున్నారు.

 నిద్రకు ముందు టీవీలు, ల్యాప్ ట్యాప్ లు, సెల్ ఫోన్లు చూస్తే నిద్ర కష్టమే

నిద్రకు ముందు టీవీలు, ల్యాప్ ట్యాప్ లు, సెల్ ఫోన్లు చూస్తే నిద్ర కష్టమే


ఇక నిద్ర పోయే ముందు చాలా మంది టీవీలకు అతుక్కుపోతారు. కొందరు కంప్యూటర్లకు, ల్యాప్ ట్యాప్ లకు , సెల్ ఫోన్ లకు అడిక్ట్ అవుతున్నారు. ఇక కొందరు యువత పడుకునే ముందు వీడియో గేమ్లు ఆడటం పైన దృష్టి పెడుతున్నారు. దీంతో నిద్రలేమి సమస్య తలెత్తుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్రకు ఉపక్రమించడానికి ముందు టీవీలు, ల్యాప్ ట్యాప్ లు, సెల్ ఫోన్ లు చూడటం మంచిది కాదని, దీని వల్ల నిద్రలేమి ఖచ్చితంగా కలుగుతుందని చెబుతున్నారు.

 నిద్రకు ముందు హెవీ భోజనం... నిద్రాభంగం

నిద్రకు ముందు హెవీ భోజనం... నిద్రాభంగం


ఇక నిద్ర పోయే ముందు చాలా మంది ఆహారం తీసుకుంటారు. నిద్రకుపక్రమించే ముందు ఆహారం తీసుకోవడం కూడా నిద్రలేమికి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా తినడం వల్ల మీరు పడుకున్న సమయంలో శరీర అసౌకర్యానికి గురవుతుంది. కడుపులో మంట వంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. దీంతో రాత్రివేళల్లో పడుకునే ముందు ఆహారం తీసుకునేవారు సరిగా నిద్రపోలేరు అని వైద్యులు చెబుతున్నారు. అందుకే రాత్రి వేళల్లో ఆహారం తీసుకోవడానికి ఒక సమయం నిర్దేశించుకోవాలి అని, రాత్రి నిద్రకు ఉపక్రమించే మూడు గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 ఒత్తిడి, ఒబేసిటీ, జాబ్ షిఫ్ట్ లు, అనారోగ్య కారణాలు .. సరిగా నిద్ర పోనివ్వని ఇతర కారణాలు

ఒత్తిడి, ఒబేసిటీ, జాబ్ షిఫ్ట్ లు, అనారోగ్య కారణాలు .. సరిగా నిద్ర పోనివ్వని ఇతర కారణాలు


నిద్రలేమికి మరొక కారణం సాధారణ ఒత్తిడి, లేదా వృత్తి, వ్యాపారాలలో చోటుచేసుకునే ఒత్తిడి, షిఫ్టుల వారీగా చేసే ఉద్యోగం, ఇతర అనారోగ్య కారణాల కు ఉపయోగిస్తున్న మందులు తదితరాలు కూడా మనల్ని సరిగా నిద్రపోనివ్వని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు అధిక బరువు కూడా నిద్రలేమికి ఒక కారణమని చెబుతున్నారు. సరైన శారీరక వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం ప్రస్తుతం నిద్రలేమికి కారణాలుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం వందలో 70 నుండి 80శాతం మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇక పైన చెప్పిన నిద్రకు చెడు చేసే అలవాట్లను మార్చుకుంటే, మంచి నిద్ర అలవాట్లను చేసుకుంటే నిద్రలేమి సమస్య నుండి కొంత మేరకు బయటపడవచ్చని చెబుతున్నారు.


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Not sleeping well? Doctors say that the things you do before sleeping can be the reasons. going to sleep without regular schedule, eating heavy meals before sleep, watching TVs, laptops, cell phones, stress, work shifts etc efffects your sleep.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X