health tips: నిద్రలేమితో బాధపడుతున్నారా... ప్రశాంతమైన నిద్ర కోసం ఈ చిట్కాలు ట్రై చెయ్యండి!!
2022-08-04
రాత్రి సమయంలో ఎంత నిద్రపోవాలని ప్రయత్నం చేస్తున్నా నిద్ర పట్టడం లేదా? నిద్రలేమి కారణంగా రోజంతా చిరాకుగా ఉంటున్నారా? నిద్రలేమితో అనారోగ్యం బారిన పడుతున్నారా? విపరీతంగా ఒబేసిటీకి గురవుతున్నారా? ఇక అలాంటి వారు నిద్రలేమి సమస్య గురించి తెలుసుకోవలసినవి? ప్రశాంతమైన నిద్ర కోసం పాటించాల్సిన కొన్ని సలహాలు సూచనలు మీ కోసం .

నిద్రలేమి వల్ల అనారోగ్యం
తక్కువ సమయం నిద్రపోయే వారికి బరువు పెరిగే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇది చిన్న పిల్లలు, పెద్ద వారిలో కూడా జరగవచ్చునని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు నిద్ర లేమి ఆకలిని నియంత్రించే హార్మోన్ ని ప్రభావితం చేస్తుంది. దాంతో క్యాలరీలు ఎక్కువ తీసుకుంటారు. చాలినంత నిద్రపోయే వారు తక్కువ క్యాలరీలు తీసుకుంటారని తెలుస్తోంది. కాబట్టి నిద్రలేమి కారణంగా, ఆహారాన్ని ఎక్కువ తీసుకుని, విపరీతంగా బరువు పెరుగుతారని చెబుతున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, మానసికంగా ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉండటం నిద్రలేమికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

నిద్రలేమి కారణంగా వచ్చే జబ్బులు ఇవే
ప్రతి రోజూ 7 నుండి 8 గంటల కంటే తక్కువ నిద్ర ఉన్నవారికి హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు నిద్ర లేమి ఆరోగ్యకరమైన వారిలో కూడా ప్రీడయాబెటిస్ కి కారణం కావచ్చు. తక్కువ సమయం నిద్రకీ టైప్ 2 డయాబెటీస్ కీ సంబంధం ఉందని స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయని పేర్కొంటున్నారు. నిద్ర లేమికీ ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ కీ లింక్ ఉందని తెలుస్తోంది. ఆరోగ్యకరమైన నిద్ర అలవాటు లేకపోతే అది డిప్రెషన్ కి కూడా కారణం కావచ్చని తెలుస్తోంది. నిద్ర లేమి బ్రెయిన్ ఫంక్షన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సరిగ్గా నిద్రపోని వారి సోషల్ స్కిల్స్ చాలా తక్కువగా ఉంటాయని చెప్తున్నారు, వీరు అవతలివారి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ని గమనించలేరని కూడా వైద్యులు చెబుతున్నారు.

చక్కని నిద్ర తో ప్రయోజనాలు ఎన్నో
చక్కని నిద్ర జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ని మెరుగు పరుస్తుంది. అలాగే, చక్కని నిద్ర శరీరకంగా చురుకుగా ఉండడానికి సహకరిస్తుంది. రోజుకి కనీసం ఎనిమిది గంటల నిద్ర వల్ల ఇమ్యూన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.నిత్యం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్ర పోవటం వల్ల రోజంతా యాక్టివ్ గా కనిపిస్తారు. కొన్ని జీవన శైలి మార్పుల ద్వారా చక్కని నిద్రకి మార్గం వేసుకోవచ్చు.

ప్రశాంతమైన నిద్రకి సలహాలు
ప్రశాంతమైన నిద్ర పోవాలంటే నిద్రకి ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని చెబుతున్నారు. పడుకోబోయే ముందు పుస్తకాలు చదవాలని లేదా ధ్యానం చేయాలని సూచిస్తున్నారు. రాత్రి పూట కాలి మడమలకి నూనె రాసుకుంటే కూడా నిద్ర పడుతుందని సూచిస్తున్నారు. నిద్రకు ముందు ఒక గ్లాసు వేడి గేదె పాలను తాగితే కూడా నిద్ర పడుతుందని చెబుతున్నారు. రాత్రిపూట హెవీగా భోజనం చేస్తే నిద్ర సరిగ్గా పట్టదని చెబుతున్నారు. లైట్ గా భోజనం చేస్తే నిద్ర పడుతుందని అంటున్నారు. నిద్రలేమితో బాధపడేవారు ప్రతిరోజూ ఎక్సర్సైజులు, యోగా చేయాలని సూచిస్తున్నారు. పడుకోవడానికి మూడు గంటల ముందు రాత్రి భోజనం చేయాలని సూచిస్తున్నారు.

మధ్యాహ్న సమయంలో నిద్రకు దూరంగా ఉండాలి
ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్ర పోయే, ఒకే సమయానికి నిద్ర లేచి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో నిద్రకు వీలైనంతవరకూ దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. పగటిపూట సూర్యకాంతి శరీరంపై పడేలా చూసుకోవాలని, రాత్రి సమయాలలో బ్రైట్ లైట్ కు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరిగా నిద్ర పట్టకపోతే వైద్యులను సంప్రదించాల్సిందేనని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications