వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: గుండెకు హానిచేసే ఐదు శత్రువులు ఇవే; తెలుసుకుని జాగ్రత్తపడితే హృదయం పదిలం!!

|
Google Oneindia TeluguNews

ఇటీవల కాలంలో అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవారు, అకస్మాత్తుగా గుండె పోటుకు గురై ప్రాణాలు వదులుతున్న సంఘటనలు అనేకం మనం చూస్తున్నాం. ఆధునిక కాలంలో అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా చిన్న వయసులోనే ఎంతో మంది గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న ఎంతోమందికి తమ గుండె డేంజర్ బెల్స్ మోగిస్తోంది అన్న విషయం కనీసం తెలుసుకోలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పైన అవగాహన లేకపోవడమే ఇటీవలకాలంలో గుండెపోటుతో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలకు కారణంగా తెలుస్తోంది.

health tips: ఈ 9లక్షణాలలో ఏ ఒక్క లక్షణం ఉన్నా డయాబెటిస్ ఉన్నట్టే... గుర్తించండిలా!!health tips: ఈ 9లక్షణాలలో ఏ ఒక్క లక్షణం ఉన్నా డయాబెటిస్ ఉన్నట్టే... గుర్తించండిలా!!

గుండెకు మొదటి శత్రువు ఉప్పు... వాడకం తగ్గించండి

గుండెకు మొదటి శత్రువు ఉప్పు... వాడకం తగ్గించండి

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అసలు ఏం చేయాలి? గుండెకు హాని కలిగించే శత్రువులు ఎవరు? వంటి విషయాలను తెలుసుకుంటే గుండెకు హాని కలిగించే వాటినుండి దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. గుండెకు హాని కలిగించే శత్రువులలో మొదటిది ఉప్పు. విపరీతంగా ఉప్పు తినే వారిలో గుండె సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఉప్పు తినే వారికి బీపీ మాత్రమే కాకుండా, గుండె కూడా అనారోగ్యానికి గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రతి మనిషి ఒక రోజుకు టేబుల్ స్పూన్ సాల్ట్ మాత్రమే ఉప్పు తినాలని చెబుతున్నా ఉప్పును మాత్రం ఏ మాత్రం తగ్గకుండా వినియోగిస్తున్నారు. ఇది గుండెకు చేటు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

గుండెను పాడు చేసే మరో శత్రువు చెక్కెర .. తినటం మానెయ్యండి

గుండెను పాడు చేసే మరో శత్రువు చెక్కెర .. తినటం మానెయ్యండి


ఇక గుండె ఆరోగ్యాన్ని పాడు చేసే మరొక శత్రువు చక్కెర. అధికంగా చక్కెర వినియోగించడం వల్ల, విపరీతంగా స్వీట్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం పాడవుతుందని వైద్యులు చెబుతున్నారు. కచ్చితంగా చక్కెర వినియోగాన్ని తగ్గించాలని, అసలు వాడకుండా ఉంటేనే మంచిదని వైద్యులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని పాడుచేసే మరొక శత్రువు నూనె, విపరీతమైన నూనె వాడకం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా మనకు తెలియకుండానే గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉంటుంది.

మాంసం అధికంగా తింటున్నారా? అయితే మీ గుండెకు ఇబ్బందే

మాంసం అధికంగా తింటున్నారా? అయితే మీ గుండెకు ఇబ్బందే


గుండె ఆరోగ్యానికి హాని కలిగించే మరొక శత్రువు మాంసం. రెడ్ మీట్ తినడం గుండె ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. కనుక తరచూ మాంసాహారం తినే వారిలో గుండెకు సంబంధించిన సమస్యలు అధికంగా వస్తాయి కాబట్టి కొలెస్ట్రాల్ ను ఎక్కువగా పెంచే మాంసాన్ని ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి మాంసాహారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. ఆకుకూరలు, కూరగాయలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.

శారీరక వ్యాయామం లేకపోవటం కూడా గుండెకు శత్రువే

శారీరక వ్యాయామం లేకపోవటం కూడా గుండెకు శత్రువే


ఇక గుండె ఆరోగ్యాన్ని పాడుచేసే మరొక శత్రువు శారీరక వ్యాయామం లేకపోవడం. శారీరకంగా వ్యాయమం లేనివారికి, శారీరక అనారోగ్యాలు అనేకం కలుగుతాయి. అందులో గుండెకు సంబంధించిన అనారోగ్యం కూడా ఒకటి. శారీరక వ్యాయామం లేకపోతే మనం తినే ఆహార పదార్థాలు కొవ్వుగా మారి, అది మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. గుండెకు చేటు చేస్తుంది.

 బాగా టెన్షన్ పడినా గుండెకు ముప్పే

బాగా టెన్షన్ పడినా గుండెకు ముప్పే

అంతేకాదు విపరీతంగా టెన్షన్ పడడం కూడా గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందే వారిలోను గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. గుండెకు చేటు చేసే ఈ ముఖ్యమైన శత్రువులను దూరంగా పెడితే కచ్చితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుందని, దీనిపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Doctors say that the five enemies that harm the heart are salt, sugar, oils, meat, lack of exercise and tension. It is said that if you are careful about these things, you can maintain heart health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X