వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: స్మార్ట్‌ఫోన్ వ్యసనం నుండి చిన్నారులను బయటకు తీసుకురావటానికి మార్గాలివే.. ట్రై చెయ్యండి!!

|
Google Oneindia TeluguNews

మీ పిల్లల స్మార్ట్‌ఫోన్ వ్యసనం మీకు ఇబ్బంది కలిగించడమే కాకుండా, మీ పిల్లల ఆరోగ్యానికి కూడా హాని చేస్తుందని ఇప్పటికే వైద్యులు పదేపదే హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ లో ఎక్కువ సమయం పిల్లలు గడపటం వల్ల వారిలో ప్రవర్తనా సమస్యలు, నాడీ సంబంధిత సమస్యలు, ఒబేసిటీ, నిద్రలేమి, డిప్రెషన్ వంటి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లలను స్మార్ట్ ఫోన్ నుంచి దూరంగా ఉంచడం కోసం, తల్లిదండ్రులు ఒక్కసారిగా వారిని స్మార్ట్ ఫోన్ వాడకుండా నివారించకుండా, నిదానంగా వారి ఆలోచనలను వేరే అంశాలపై మళ్లించాలని సూచిస్తున్నారు. పిల్లలను స్మార్ట్ ఫోన్ వ్యసనం నుండి బయట పడేయడానికి వైద్యులు అనేక సూచనలు చేస్తున్నారు. ఇక వాటిని గురించి తెలుసుకుందాం.

పిల్లల ఖాళీ సమయంలో ఆటపాటలు.. యాక్టివిటీస్ చేయించండి

పిల్లల ఖాళీ సమయంలో ఆటపాటలు.. యాక్టివిటీస్ చేయించండి


పిల్లలు ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా వారు ఏదైనా ఆటపాటలలో మునిగి పోయేలా చూడండి. మొబైల్ ఫోన్ మీద దృష్టి మళ్లకుండా పిల్లలను తరచుగా ఏదైనా చురుకుగా ఉండే ఆటలలో నిమగ్నమయ్యేలా ప్లాన్ చేసుకోండి. చిన్నచిన్న ఆటలతో పిల్లల శారీరక కదలికలను కూడా గమనిస్తూ వారిని ప్రోత్సహించండి. చక్కని రైమ్స్ చెబుతూ, కాస్త పెద్ద పిల్లలైతే వారికి ఆసక్తిగా ఉండే కథలు చెబుతూ వారిలో ఉత్సాహాన్ని నింపండి.

పిల్లలకు వారి పనులు పురమాయించండి

పిల్లలకు వారి పనులు పురమాయించండి


పిల్లలు మొబైల్ ఫోన్ కావాలని అడుగుతున్నప్పుడు హోంవర్క్ చేసావా? ఈ రోజు పాఠం చదువుకున్నావా? ఇంకా నీ పనులన్నీ పూర్తి చేసుకున్నావా? అని ప్రశ్నించండి. చిన్నారికి సంబంధించిన పనులను మీరు పురమాయించండి. ఫోన్ ఇస్తాను కానీ, ముందు నీ పనులన్నీ చక్కగా పూర్తి చేసుకోమని చిన్నారికి చెప్పండి. తన పనులన్నీ పూర్తయ్యేసరికి సమయం పడుతుంది కాబట్టి, ఆ పనుల్లో నిమగ్నమైన చిన్నారులు ఒక్కోసారి మొబైల్ ఫోన్ గురించి మరిచిపోతారు.

కుటుంబ సభ్యులు అందరూ టీవీలో చిన్నారులకు ఉపయోగపడే కార్యక్రమాలను చూడండి

కుటుంబ సభ్యులు అందరూ టీవీలో చిన్నారులకు ఉపయోగపడే కార్యక్రమాలను చూడండి


చిన్నారుల మొబైల్ ఫోన్ యొక్క అనియంత్రిత వినియోగాన్ని అరికట్టడానికి ఉత్తమ మార్గం కుటుంబ సభ్యులందరూ కలిసి టీవీలో మంచి కార్యక్రమాన్ని చూడటం. పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని టీవీ లో పెట్టి, వారితో కలిసి ఆ కార్యక్రమాన్ని చూడ్డం వల్ల స్మార్ట్ ఫోన్ నుండి పిల్లల మనసు మళ్ళుతుంది. పొరపాటున కూడా మీరు బిజీగా ఉన్నారని, మిమ్మల్ని విసిగించకుండా ఉంటారని పిల్లలకు మొబైల్ ఫోన్లను అలవాటు చేయకండి

యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ లో నిమగ్నం చెయ్యండి

యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ లో నిమగ్నం చెయ్యండి


పిల్లలను యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ లో నిమగ్నం చేయండి. తద్వారా వారు సరదాగా గడుపుతూ జ్ఞానాన్ని పొందవచ్చు. ఇక స్మార్ట్ ఫోన్ అడిక్షన్ నుంచి పిల్లలను బయట పడేయడానికి ఖచ్చితమైన స్మార్ట్ ఫోన్ షెడ్యూల్ ను నిర్వహించండి. అలా నిర్వహించడం వల్ల తగిన సమయాన్ని సెట్ చేసి పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వడం వల్ల, వారి ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడానికి, అనవసర వినియోగాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది.

బహిరంగ ప్రదేశాల్లో ఆటలకు ప్రాధాన్యత ఇవ్వండి

బహిరంగ ప్రదేశాల్లో ఆటలకు ప్రాధాన్యత ఇవ్వండి


పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు మొబైల్ ఫోన్లను అలవాటు చేయకండి. బహిరంగ ప్రదేశాలలో ఆటలాడడం, సంగీతం వినడం, పెయింటింగ్, లేదా ఏదైనా క్రాఫ్ట్ వర్క్ నేర్చుకోవడం వంటి అభిరుచులను కొనసాగించాలని పిల్లలను ప్రోత్సహించండి. పిల్లలు మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఆన్లైన్ లో ఉన్న సమయంలో వారు ఏం చేస్తున్నారో కచ్చితంగా గమనించండి. తెలిసీ తెలియని వయసులో ఆన్లైన్ ను మిస్ యూజ్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలు మొబైల్ ఫోన్ పట్టుకున్న దగ్గరనుండి వారు ఏ విధంగా వినియోగిస్తున్నారో జాగ్రత్తగా గమనిస్తూ వారికి దిశానిర్ధేశం చెయ్యండి.

 కుటుంబంతో చిన్నారులు గడిపేలా ఎక్కువ ప్లాన్ చెయ్యండి

కుటుంబంతో చిన్నారులు గడిపేలా ఎక్కువ ప్లాన్ చెయ్యండి


మొబైల్ ఫోన్ లో ఎక్కువగా ఉండే కంటే కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడేలా, వారితో కలిసి ఆడుకునేలా పిల్లల కార్యక్రమాలను డిజైన్ చేయండి. అలా చేయడం వల్ల పిల్లలు కొంత స్మార్ట్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడతారు. ఇక స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను, వివిధ వీడియోల ద్వారా పిల్లలకు చూపిస్తూ పిల్లలకు అవగాహన కల్పించండి. తద్వారా పిల్లల్లో కాస్త స్మార్ట్ ఫోన్ వినియోగం తగ్గించాలనే ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మొబైల్ ఫోన్ లకు సెక్యూరిటీ లాక్ పెట్టుకోవడం వల్ల ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలు దొంగచాటుగా మొబైల్ ఫోన్లను వినియోగించే అవకాశం ఉండదు. స్మార్ట్ ఫోన్ చిన్నారులకు వ్యసనంగా మారకుండా చూసుకోవడమే ప్రధాన కర్తవ్యం. ఇక వ్యసనంగా మారిన తర్వాత దాని నుండి బయటకు తీసుకురావడానికి కోపంతో కాకుండా, పక్కా ప్రణాళికతో పిల్లలను స్మార్ట్ ఫోన్ వినియోగానికి దూరం చేయండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
To get children out of smartphone addiction, if they do things like make children focus on games, and activities, parents spend time with them etc..slowly they will get rid of that addiction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X