Vitamin D: శరీరానికి విటమిన్ డి అవసరమే కానీ..
మన ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటిన్లు, విటమిన్లు, పోషకాలు అవసరం. విటమిన్లో డి విటమిన్ ఒక్కటి. ఈ విటమిన్ సూర్యరశ్మిలో అధికంగా లభిస్తుంది. అయితే కొందరికి తగిన మోతాదులో విటమిన్ డి ఉండదు. డి విటమిన్ లోపం వల్ల ఎముకలు, కండరాల్లో నొప్పి సమస్య ఉంటుంది. కొన్నిసార్లు వెన్ను లేదా కండరాలలో నొప్పి కూడా వచ్చే అవకాశం ఉందట.

రోగనిరోధక వ్యవస్థ
విటమిన్ డి మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చుతుంది. ఇది వైరస్లు, బ్యాక్టీరియా నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. విటమిన్ డి కేవలం శరీరంలో కాల్షియంను బాడీ గ్రహించేందుకే కాకుండా..మజిల్స్ సెల్స్‌కు కూడా చాలా అవసరం. విటమిన్ డి ఎక్కువగా ఉంటే కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

జీర్ణ వ్యవస్థ
విటమిన్ డి ఎక్కువ అయితే అది జీర్ణ వ్యవస్థపై ఆ ప్రభావం చూపుతుంది. విటమిన్ డి కారణంగా రక్తంలో కాల్షియం స్థాయి పెరుగుతుంది. కడుపులో నొప్పి, ఆకలి వేయకపోవడం, వాంతులు, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విటమిన్ డి ఎక్కువుంటే పదే పదే వాంతులు రావడం, అజీర్ణ సమస్య వస్తుందట.

ట్యాబ్లెట్లు
చాలా మంది, విటమిన్ డి కోసం ట్యాబ్లెట్లు వాడుతుంటారు. విటమిన్లు శరీరానికి చాలా అవసరం.. కానీ మోతాదుకు మించితే ప్రమాదం. విటమిన్ డి ఎక్కువవడం వల్ల అంతర్గతంగా భ్రమ వంటి స్థితి తలెత్తుతుందట.












Click it and Unblock the Notifications