వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Water: పడుకునే ముందు నీళ్లు తాగడం మంచిదేనా..?

|
Google Oneindia TeluguNews

ఏ వైద్యుడిని అడిగినా నీళ్లు తాగడం మంచిదనే చెబుతారు. అవును నీరు తాగాడం శీరీరానికి చాలా మంచింది. నీళ్లు ఎక్కువగా తాగకుంటే
శరీరం డీహైడ్రేషన్ బారి పడే అవకాశం ఉంది. అందుకే నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగకుంటే మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నీళ్లు తాగడం మంచిదే కానీ ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు తాగకూడదట.

40 నిమిషాల గ్యాప్
అలాగే శరీర అవసరానికి మించి నీళ్లను అతిగా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట.మరి రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగొచ్చా అంటే మంచిదేనని చెబుతున్నారు. నీరు తాగిన తర్వాత వెంటనే నిద్రపోవద్దట. అయితే హార్ట్ పేషెంట్లు, డయాబెటీస్ పేషెంట్లు రాత్రిపూట నీళ్లను ఎక్కువగా తాగడం మంచిది కాదట. ఎందుకంటే వీళ్లు నీళ్లను ఎక్కువగా తాగితే రాత్రిపూట నిద్రపోకుండా మూత్రానికే వెళ్లాల్సి వస్తుంది. భోజనం చేసేటప్పుడు, ఆ వెంటనే నీళ్లను తాగడం మంచిది కాదు. ఒక 40 నిమిషాల గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగాలట. ఇకపోతే రాత్రి పడుకునే ముందు పుష్కలంగా నీళ్లను తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

 Is it good to drink water before sleeping at night?

కిడ్నీల్లో రాళ్లు
నీళ్లు ఎక్కువగా తాగకపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు, అర్ష మొలలు, మలబద్దకం, అజీర్థి, వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే పగటి సమయంలో నీళ్లను ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదట. పడుకునే కంటే అర గంట ముందు నీళ్లు తాగాలట. నిద్రకు ముందు గోరు వెచ్చని నీరు తాగడం మంచిదన నిపుణలు చెబుతున్నారు. పడుకునే ముందు కంటే ఉదయన్నే లేచిన తర్వాత నీరు తాగడం మంచిదట. పరగడుపున టీ, కాఫీ కంటే నీళ్లు తాగడం మంచిదని చెబుతున్నారు.

English summary
Is it good to drink water at night before going to sleep? How many liters of water should be drunk per day?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X