• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bitter Gourd Benefits: చేదుగా ఉందని తినకుంటే మీకే నష్టం.. ఎందుకంటే..!

|
Google Oneindia TeluguNews

కాకరకాయ పేరు వినగానే చాలా మంది ముక్కిస్తారు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది. కానీ కాకరకాయ తింటే మనం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాకరకాయ తినడం వల్ల శరీరానికి కాపర్, విటమిన్ బి, ఆమ్లాలు, అసంతృప్తి కొవ్వులు లభిస్తాయి. ముఖ్యంగా కాకరకాయలను చలికాలంలో ఆహారంలో ఎక్కువగా వినియోగిస్తే వాతావరణ మార్పుల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు ఉపయోగపడుతుంది. కాకరకాయలో బచ్చలికూర, బ్రోకలీలోని బీటా కెరోటిన్, అరటిపండ్లలో ఉండే పొటాషియం కంటే దీనిలో రెండు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది.

సోడియం

సోడియం


100 గ్రాముల కాకరకాయలో 34 కేలరీలతో పాటుగా 13 మిల్లీ గ్రాముల సోడియం, 602 గ్రాముల పొటాషియం, 7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనిలో విటమిన్ బి 1, విటమిన్ బి 2, విటమిన్ బి 3, విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలేట్ జింక్, భాస్వరం, డైటరీ ఫైబర్స్ కూడా ఉంటాయి. కాకరలో ఉండే ఔషధ గుణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచి పలు వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.

ఆల్కలైడ్లు

ఆల్కలైడ్లు


కాక‌రకాయ‌లో ఉండే ఫైబ‌ర్‌ జీర్ణ స‌మ‌స్య‌లను దరి చేరనివ్వదు. కాకరకాయ తింటే మల‌బ‌ద్ధకం స‌మస్య‌ తగ్గుతుంది. కాక‌రకాయ జ్యూస్‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీలో రాళ్లు క‌రుగుతాయట. కాకరకాయలో ఉన్న ఆల్కలైడ్లు బ్లడ్ షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కాకరకాయ వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

అలర్జీలు

అలర్జీలు


అలర్జీలు, అజీర్ణాన్ని నివారిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. 2010 లో ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ జర్నల్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో కాకరకాయలో యాంటీ కార్సినోజెన్, యాంటీ ట్యూమర్ లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు. ఇది ప్రోస్టేట్, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాల్ని తగ్గిస్తుందట.

మధుమేహం

మధుమేహం


ప్రపంచవ్యాప్తంగా 382 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. కాకరకాయలో పాలిపెప్టైడ్-పి లేదా పి-ఇన్సులిన్ అని పిలువబడే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం ఉంటుంది. ఇదిసహజంగా డయాబెటీస్ ను నియంత్రిస్తుందని పరిశోధనలు నిరూపించాయి. కాకర టీలో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం ఎక్కువ కావున శరీరానికి చాలా రకాల లాభాలు లభిస్తాయి.

English summary
Eating kakarakaya provides the body with copper, vitamin B, acids and unsaturated fats. Especially if you consume a lot of turmeric in your diet during winter, it is useful to protect the body from seasonal diseases caused by weather changes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X