Edible Oil: వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
మనం వంట చేసుకోవడానికి నూనె వాడతాం. కాసింత ఆయిల్ పోసి కర్రి చేస్తాం. కానీ చిరుతిళ్లు చేయాలంటే నూనె ఎక్కువ కావాలి. పిండి వంటలు చేయగా నూనె మిగులుతుంది. ఈ నూనెను మళ్లీ వాడతారు. అలాగే హోటళ్లలోను ఒకసారి వినియోగించిన వంట నూనెను పదేపదే ఉపయోగిస్తారు. అయితే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.

గుండె జబ్బులు
వాడిన నూనె వాడి తయారైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు, లివర్ జబ్బులు, హైపర్‌టెన్షన్, అల్జీమర్ వంటి వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ, కడుపులో మంట, గ్యాస్, కాలేయ సమస్యలు వస్తాయి. తాజాగా చేసిన ఓ సర్వేలో వాడిన నూనెను వాడుతున్నవారు దాదాపు 60 శాతం మంది ఉన్నారని తేలింది.

అల్జీమర్స్
ఎక్కువ సార్లు వాడిన నూనె వలన దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఉపయోగించిన నూనెను మళ్లీ వాడడం అస్సలు మంచిది కాదట. వాడిన నూనె వాడడం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధులు వస్తాయట. అయితే పిండి వంటలు చేయగా మిగిలిన నూనె ఏం చేయాలంటారా..

వాడిన నూనె ఏం చేయాలంటే..
కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన ఎన్‌ఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ ఒకసారి వాడిన వంట నూనెను కొనుగోలు చేస్తుందని మీకు తెలుసా. ఇప్పటికే విశాఖలోని పలు హోటళ్లలోను, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్లలోను వాడిన వంటనూనె సేకరణ కోసం డ్రమ్ములు కూడా ఏర్పాటు చేశారట. లీటర్ అయిల్‌కు రూ.30 వంతున చెల్లిస్తున్నారు.












Click it and Unblock the Notifications