వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ప్లాంట్ ఎక్కడ పడితే అక్కడ పెంచితే కష్టాలను స్వాగతించినట్లే

మనీ ప్లాంట్ చాలా ఇళ్లలో ఉంటుంది. సరైన వాస్తు నియమాలు పాటించకుంటే అది ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తు ప్రకారం ఇమడని ప్రదేశంలో దీనిని ఉంచడం వల్ల డబ్బు కొరత, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనీ ప్లాంట్‌ను పెంచడంతో పాటు దీన్ని ఎక్కడెక్కడ ఉంచకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఈశాన్య దిశలో..

వాస్తు ప్రకారం, ఇంటి ఈశాన్య దిశలో మనీ ప్లాంట్‌ను పెట్టకూడదు. ఇక్కడ ఉంచితే అప్పులు పెరిగి, ఆరోగ్య సమస్యలతో డబ్బు అనవసరంగా ఖర్చవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఈ దిశలో మనీ ప్లాంట్ ఉంచడం పూర్తిగా తప్పు అవుతుంది. అలాగే.. బాత్ రూమ్ దగ్గర మనీ ప్లాంట్ పెట్టడం వాస్తు రీత్యా సరికాదు. మనీ ప్లాంట్ శుక్రుడికి ప్రతీక. బాత్ రూమ్ వద్ద దీన్ని ఉంచితే ధన ప్రవాహాన్ని తగ్గుతుంది. ఆర్థిక వనరులను క్షీణింపజేస్తుందని వాస్తు నిపుణులు చెబుతారు.

Right Vastu place for money plant will help you flourish in prosperity whereas wrong position chaos

బెడ్రూమ్ లో..

పడక గదిలో మనీ ప్లాంట్ ఉంచకూడదని వాస్తు నిపుణులు సూచిస్తారు. మరీ ముఖ్యంగా మీరు నిద్రించే ప్రదేశానికి దగ్గరగా ఉంచవద్దు. ఇలా చేస్తే దంపతుల మధ్య గొడవలు పెరుగుతాయి, జీవితంలో ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతాయి. ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెట్టాలా అని చాలా మంది సందేహిస్తారు. వాస్తు ప్రకారం, దీనిని ఇంటి వెలుపల గోడ దగ్గర లేదా ఓపెన్ గార్డెన్ వంటి ప్రదేశంలో ఉంచాలి. ప్రధాన ద్వారం వద్ద గానీ, ఆగ్నేయ దిశలో పెట్టడం వల్ల ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది.

ఎక్కడ పెట్టినా సానుకూలమే అనుకుంటే..

మనీ ప్లాంట్ ఎక్కడ పెట్టినా సానుకూల ఫలితాలనే ఇస్తుందనేది ఒక అపోహ. వాస్తు ప్రకారం, చీకటి ప్రదేశాల్లో దీనిని ఎప్పుడూ ఉంచకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక కొరత ఏర్పడి, ఆస్తుల నష్టానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనీ ప్లాంట్ తీగలు నేలకు తాకకుండా చూసుకోవాలి. అవి నేలను తాకితే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుందని నమ్ముతారు. దీనివల్ల ఇంట్లో శ్రేయస్సు ఉండదు, ఆర్థిక సమస్యలు నిరంతరం కొనసాగుతాయి. తీగలను పైకి కట్టి ఉంచడం ఎల్లప్పుడూ మంచిది.

ఆకులు ఎండినా..

మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోయినా, పసుపు రంగులోకి మారినా వెంటనే తీసేయాలి. అలాంటి ఆకులు ఇంట్లో ప్రతికూల శక్తిని వ్యాప్తి చేస్తాయి. పాడైన ఆకులను తొలగిస్తూ, ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా సానుకూల వాతావరణానికి ఇబ్బంది ఉండదు. ఇది ఇంట్లో శ్రేయస్సును తెచ్చినప్పటికీ, దానిని సరైన వాస్తు నియమాల ప్రకారం ఉంచి నిర్వహించడం కీలకం. లేకపోతే అది ప్రతికూలతకు దారితీస్తుంది.

Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే. మనీ ప్లాంట్ పై పూర్తి వివరాల కోసం సంబంధిత వాస్తు నిపుణులను సంప్రదించడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+