వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Triphala Churnam: ఆ సమస్యలు ఉన్నవారికి త్రిఫల చూర్ణం సరైన మందు..!

|
Google Oneindia TeluguNews

ప్రస్తుతం జీవన విధానంత చాలా మందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆహారపు అలవాట్లు, కలుషితమైన నీరు, గాలి, ఆహారం వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ మధ్య చాలా మందికి ఉబ్బరం, మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు త్రిఫల చూర్ణం వాడడం మంచిది. దీన్ని ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో తయారు చేస్తారు. త్రిఫల చూర్ణం పొట్టలోని మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహకరిస్తుంది. జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరచడంతో పాటు పిత్తా శయం(గాల్‌బ్లాడర్‌)లో పేరుకుపోయిన రాళ్లను కరిగించేందుకు, ఇన్ఫెక్షన్లను నివారించేందుకు ఉపయోగపడుతుందట.

 జీర్ణవ్యవస్థ

జీర్ణవ్యవస్థ


ఇందులోని గాలిక్‌యాసిడ్‌, ఎలాజిక్‌ యాసిడ్‌ జీర్ణవ్యవస్థను మెరుగు పరిచి, రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి, క్యాన్సర్లను రాకుండా చేస్తుంది. ట్రిబ్యులానిక్‌ యాసిడ్‌ అనేది కీమో థెరపీ, రేడియో థెరపీల ప్రభావం నుంచి రక్షిస్తుంది. ఈ చూర్ణంలోని క్వెర్సెటిన్‌ కళ్లు, జుట్టు, చర్మ ఆరోగ్యానికి మేలుచేస్తుంది. అంతేకాదు రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుందట. శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటికి పంపి, కాలేయం మెరుగ్గా పని చేసేందుకు ఉపయోగపడుతుందట. త్రిఫల చూర్ణం చర్మంలోని రక్తనాళాల్లో రక్తప్రసరణను పెంచి చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. చర్మానికి పోషణనిస్తుంది. చర్మానికి సహజంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందట. కొందరి చర్మం సున్నితంగా ఉండి ఎలర్జీలకు గురి అవుతుంది. ఈ లోపం ఉన్నవారు త్రిఫల చూర్ణం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.

 పైల్స్

పైల్స్


పైల్స్ సమస్య ఉన్నవారు త్రిఫల చూర్ణం వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం త్రిఫల చూర్ణం వాడితే మలబద్ధకం, కంటి సంబంధ సమస్యలు, జుట్టు రాలటం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, రక్తపోటు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయట. కడుపులో నులిపురుగులు కూడా త్రిఫల చూర్ణం పోగొడుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అత్యంత సమర్థవంతంగా పనిచేసే త్రిఫల చూర్ణాన్ని లేదా త్రిఫల మాత్రలను వాడటం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని నిపుణులు చెబుతున్నారు. కానీ మోతాదుకు మించి త్రిఫల చూర్ణం తీసుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయట.

డయాబెటిక్ లక్షణాలు

డయాబెటిక్ లక్షణాలు


త్రిఫల చూర్ణంలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ చూర్ణం మధుమేహం రాకుండా సమర్థవంతంగా పోరాడుతుంది. అయితే మధుమేహం మందులు వాడుతున్న వ్యక్తులు త్రిఫలాన్ని అధికంగా తీసుకుంటే.. వారి రక్తంలోని చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పడిపోతాయట. ఎందుకంటే మధుమేహం మందులతో కలిపి త్రిఫల తీసుకోవడం ద్వారా హైపోగ్లైసీమియా వస్తుంది. అంటే రక్తప్రవాహంలో గ్లూకోజ్ లోపం ఏర్పడుతుందట. ఉందుకే మధుమేహ రోగులు త్రిఫల చూర్ణం తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. వేరే మెడిసిన్స్ వాడేటప్పుడు త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని చెబుతారు. ఎందుకంటే త్రిఫల చూర్ణం అనేది వేరే మెడిసిన్స్ పని చేయకుండా అడ్డుకుంటుందట.

English summary
Consuming Triphala Churnam reduces the health problems. Especially those with piles should use Triphala Churnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X