• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ఈ పాతవస్తువులు ఇంట్లో ఉంటే దరిద్రం.. మీ ఇంట్లో ఉన్నాయా? చూసుకోండి!!

|
Google Oneindia TeluguNews

జీవితంలో ప్రశాంతంగా బతకాలంటే, ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే ఇంటికి వాస్తు ఉండడంతోపాటు, ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి. ఇంట్లో ఉండే అనేక వస్తువులు మా జీవితం పై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మనకు తెలియకుండానే కొన్ని వస్తువులు మన జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. చిన్న వస్తువులే కదా అని నిర్లక్ష్యం చేస్తే, వాటి వల్ల కలిగే అనర్ధాలు మాత్రం లెక్కకు మిక్కిలి ఉంటాయి. ఇక అందుకే మన ఇళ్ళల్లో ప్రతికూల ప్రభావాన్ని చూపించే ఐదు వస్తువులను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పాత న్యూస్ పేపర్లు ఇంట్లో ఉంటే ఫలితం ఇలా

పాత న్యూస్ పేపర్లు ఇంట్లో ఉంటే ఫలితం ఇలా


ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం. ఇక ఆ న్యూస్ పేపర్లను రోజూ ఇంట్లో ఓ చోట పెడుతూ ఉంటాం. న్యూస్ పేపర్లను పెద్ద కుప్పగా తయారు చేస్తాం. ఎప్పుడో కానీ వాటిని విక్రయించం. అయితే అలా ఇంట్లో కుప్పలుగా పాత న్యూస్ పేపర్లు ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని, పాత వార్తాపత్రికలను ఆ విధంగా ఉంచటం వల్ల వాటిలో దుమ్ము ధూళి చేరి మన ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తాయి అని చెబుతున్నారు. పాత వార్తాపత్రికలను ఇంట్లో పోగు చేసుకోవడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇది కుటుంబంలో అనుకూల వాతావరణాన్ని నాశనం చేసి కుటుంబ సభ్యుల మధ్య గొడవకు కారణం అవుతుందని చెబుతున్నారు. అందుకే పాత న్యూస్ పేపర్ లను ఎప్పటికప్పుడు ఇంట్లో లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

పాడైపోయిన తాళాలతో మీ అదృష్టం నాశనం

పాడైపోయిన తాళాలతో మీ అదృష్టం నాశనం


పాడైపోయిన తాళాలు, తుప్పు పట్టి పోయిన నిరుపయోగంగా ఉన్న తాళాలు ఇంట్లో ఉంచుకోకూడదు అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పాత తాళాలను ఉంచుకోవడం అశుభ సూచకమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ తాళాలు ఇంట్లో ఉంటే మీ అదృష్టాన్ని కూడా నాశనం చేస్తాయని చెబుతున్నారు. పాడైపోయిన పాత తాళాలు ఇంట్లో ఉంటే పురోగతి ఉండదని, ఆర్థిక ప్రగతి ఉండదని చెబుతున్నారు. కనుక ఇంట్లో పాడైపోయిన పాత తాళాలను తీసి వేయడం మంచిది.

చిరిగిన పాతబట్టలు, పాడైపోయిన చెప్పులు దరిద్రం

చిరిగిన పాతబట్టలు, పాడైపోయిన చెప్పులు దరిద్రం

పాడైపోయిన బట్టలు, చినిగిపోయిన బట్టలు, ఉపయోగించని జీర్ణ దశకు చేరుకున్న బట్టలను కూడా ఇంట్లో ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఇవి మీ పురోగతిని నిరోధిస్తాయి. ఇవి మీ కెరీర్లో రక రకాల ఇబ్బందులను సృష్టిస్తాయి. ఇవి లేని దరిద్రాన్ని ఇంటికి తీసుకు వస్తాయి. అంతేకాదు ఇంట్లో పాడైపోయిన బూట్లు, తెగిపోయిన చెప్పులు ఉంచుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. ఇవి కూడా దరిద్రానికి హేతువులు. ఇక ధరించని పాడైపోయిన చెప్పులను శనివారం నాడు పారేయాలి. ఇలా చేయడం వల్ల శని ప్రభావం కొంతమేరకు జీవితంపై తగ్గుతుంది.

పని చెయ్యని పాత గడియారాలతో జీవితంలో అవరోధాలు

పని చెయ్యని పాత గడియారాలతో జీవితంలో అవరోధాలు

ఇంట్లో కదలని, పనిచేయని పాత గడియారాలు ఉంచుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. పనిచేయని గడియారాలు జీవితంలో అవరోధాలను సృష్టిస్తాయి. జీవితంలో మంచి సమయాన్ని మనం ఆస్వాదించకుండా చేస్తాయి. అందుకే పొరపాటున కూడా ఇంట్లో పనిచేయని గడియారాలు, వాచీలను ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఐదు వస్తువులను సాధ్యమైనంత తొందరగా బయట పడేస్తే ఇంట్లో ప్రతికూల ప్రభావం కొంతమేర తగ్గుతుందని చెబుతున్నారు.


Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

vastu tips: తాళంచెవులను ఎక్కడపడితే అక్కడ పెడుతున్నారా? అయితే తీవ్ర ఇబ్బందులే!!vastu tips: తాళంచెవులను ఎక్కడపడితే అక్కడ పెడుతున్నారా? అయితే తీవ్ర ఇబ్బందులే!!

English summary
Vastu Shastra experts say that if there are old newspapers, old locks, old watches, old clothes and old torn sandals in the house, it gives poverty. It is said that these should be avoided.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X