దీపాలను వెలిగించడానికి ఎలాంటి నూనెను వినియోగించాలి?: ఈ పొరపాటు అస్సలు చెయ్యొద్దు
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల్లో రద్దీ నెలకొంది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కాణిపాకం వంటి ప్రఖ్యాత శైవ క్షేత్రాలను భక్తులు సందర్శిస్తోన్నారు. శివనామస్మరణలు, అయ్యప్ప భక్తుల భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
కార్తీక పౌర్ణమి ఘడియలు సమీపిస్తోండటంతో ఆకాశదీపాలను వెలిగించడానికి సన్నాహాలు సాగుతున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు అన్ని ఆలయాల్లో ఆకాశ దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. పౌర్ణమి రోజున కోటి దీపోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

హిందూ సంప్రదాయంలో దీపానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీపాన్ని జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సిరిసంపదలకు ప్రతీకగా భావిస్తారు.. పూజిస్తారు. కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు మరింత. ఎక్కడైతే దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో..అక్కడ మహాలక్ష్మీ కొలువు తీరుతుందని పెద్దలు చెబుతుంటారు.
ఏ నూనెతో దీపారాధన చేయాలి? దీపాలను వెలిగించడానికి ఏ నూనెను వినియోగించాలి? ఏ నూనెను వాడటం వల్ల ఎలాంటి ఫలితాలు సంభవిస్తాయి? అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఎలాంటి దోషాలు కలగకుండా, దుష్ప్రభావాలు సంభవించకుండా ఉండటానికి కొన్ని రకాల నూనెలను మాత్రమే దీపారాధాన చేయాలి.
ఇందులో- రెండు ప్రమిదల్లో ఒక దాంట్లో ఆవు నెయ్యి, మరో దాంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం. ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. దీని వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆవు నెయ్యిలో నువ్వుల నూనె, వేపనూనె కలిపి దీపారాధన చేసినా సత్ఫలితాలు కలుగుతాయి.
కొబ్బరి నూనెతో దీపారాధన చేయవచ్చు. వినాయకుడి పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిదని పెద్దలు చెబుతారు. దీపాలను వెలిగించడంలో నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారని ప్రతీతి. నువ్వుల నూనె, పంచ దీప నూనెలను దీపారాధాన కోసం వాడవచ్చు.
వేరుశెనగ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, పామాయిల్, వెజిటబుల్ ఆయిల్స్, రైస్ బ్రాన్ ఆయిల్, సింథటిక్ ఆయిల్స్, కాటన్ సీడ్ ఆయిల్‌ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని వాడటం వల్ల అన్నీ దుష్ఫలితాలను చవి చూడాల్సి వస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు.












Click it and Unblock the Notifications