నకిలీ నోట్ల కలకలం: వెంగళాయపాలెంలో రూ. 2 కోట్లతో బ్యాగ్ లభ్యం
గుంటూరు: నగరంలోని భారీ నకిలీనోట్లు కలకలం రేపాయి. ఏటుకూరు బైపాస్‌లోని వెంగళాయపాలెం గ్రామం వద్ద అనుమానాస్పద బ్యాంగ్ ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. బ్యాగును తెరిచి చూశారు.
ఆ బ్యాగులో రూ. 2 కోట్ల నకిలీ నోట్లు బయటపడ్డాయి. 2 వేల నోట్ల కట్టలు 119, 500 ల నోట్ల కట్టలు 17 స్వాధీనం చేసుకున్నారు. క్యాష్ డిపాజిట్ యంత్రాల్లో నకిలీనోట్లు డిపాజిట్ చేసి ఇతర ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రా చేసుకుంటున్న ఉదంతాలు ఇటీవల వెలుగు చూస్తున్నాయని పోలీసులు తెలిపారు.

బ్యాగ్ దొరికిన మార్గంలో సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను పట్టుకుంటామని తెలిపారు. నోట్లను కలర్ జిరాక్స్ తీయించి ఉంచిన ముఠా గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల మేడికొండూరు పోలీసులు నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో ఈ దొంగ నోట్ల ముఠాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ పట్టుబడ్డాయి.
తుపాకీ చూపించి ఆభరణాలు చోరీ
తుపాకీ చూపించి ఓ మహిళ నుంచి ఆభరణాలు అపహరించిన ఘటన గుడివాడలో చోటు చేసుకుంది. టీచర్ కాలనీలో నివాసముండే గడ్డం కుమారి అనే మహిళ తన ఇంటి కింది పోర్షన్‌ను అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో తాము ఇళ్లు చూస్తామని వచ్చిన ఓ దుండగుడు ఇంట్లోకి వెళ్లి వెళ్లారు. ఆ మహిళ ఇళ్లును చూపించింది. నీళ్లు రావడం లేదని చెప్పి.. ఆమె ట్యాప్ వద్దకు ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆమె తన బంగారు గాజులను తీసి ఇచ్చింది. ఆ తర్వాత మెడలోని గొలుసు కూడా ఇవ్వాలని కోరడంతో ఆమె నిరాకరించింది. దీంతో అతడు తన వద్ద ఉన్న తుపాకీతో బెదిరించి ఆ గొలుసుకును కూడా లాక్కున్నాడు. ఆ తర్వాత ఆమెను బాత్రూంలో పెట్టి తలుపుమూసేసి పరారయ్యాడు.












Click it and Unblock the Notifications