నీలి చిత్రాలే వ్యసనం : బాలికలకు చూపిస్తూ దొరికిపోయాడు
గుంటూరు: జిల్లాలోని తెనాలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మృగాడు.. పదేళ్ల బాలికకు నీలి చిత్రాలు చూపించాడు. దీంతో ఆ బాలిక భయంతో తల్లి దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు నిందితుడికి దేశశుద్ధి చేశారు.

వదిలేసిన భార్య..
తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పసుపులేటి దుర్గా ప్రసాద్‌కు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. పిల్లలు కలగకపోవడం, అతని వేధింపులు కారణంగా భార్య వదిలేసి వెళ్లిపోయింది.

వ్యసనంగా నీలిచిత్రాలు
వెదురు బొంగుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న అతడు.. తరచూ తన మొబైల్ ఫోన్లో నీలి చిత్రాలు చూస్తేండేవాడు. దీంతో అతనికి అవి వ్యసనంగా మారిపోయాయి. అతను చూడటమే కాకుండా.. ఇంటి సమీపంలోని బాలికలను పిలిచి ఆ వీడియోలను చూపించేవాడు.

భయంతో చిన్నారి..
గతంలో కూడా ఓ బాలిక తనకు నీలి చిత్రాలు చూపించిన విషయం తన కుటుంబసభ్యులకు తెలపడంతో అతన్ని చితకబాది వదిలేశారు. తాజాగా, మరో పదేళ్ల బాలికకు నీలి చిత్రాలు చూపించాడు. కాగా, ఆ చిన్నారి భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి తన తల్లితో ఈ విషయం చెప్పింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు దుర్గా ప్రసాద్‌కు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత అతడ్ని పోలీసులకు అప్పగించారు.

వివాహితపై దారుణం..
ఇది ఇలావుంటే, నెల్లూరు జిల్లాలో కొందరు మృగాళ్లు దారుణానికి తెగబడ్డారు. నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి శుక్రవారం రాత్రి సమీప గ్రామానికి వెళ్లింది. అక్కడ భర్త మద్యం తాగి ఆమెతో గొడవపడ్డాడు. మనస్తాపంతో ఆ మహిళ తిరిగి స్వగ్రామానికి ఒంటరిగా వెళ్తున్న సమయంలో పక్క గ్రామానికి చెందిన కురుగొండ్ల నరసయ్య, సక్కిరాల రవి, బండ్ల కామక్షయ్య బైక్‌పై వచ్చి ఆమెను అడ్డగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయారు. శనివారం నిందితులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications