గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నారా లోకేశ్‌పై రూ.700 కోట్ల వల.. జగన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన చినబాబు.. అనూష విషయంలో ఫైర్..

|
Google Oneindia TeluguNews

గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాల్లో అవినీతి, అక్రమాలను పరిశీలించేందుకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తన పనిలో మరో అంకాన్ని పూర్తిచేసింది. ఇప్పటికే రాజధాని భూములపై ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సీఐడీ ఎంక్వైరీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. రెండో అంకంగా చంద్రబాబు హయాంలోని ప్రభుత్వ పథకాలపై మంత్రుల కమిటీ నివేదిక రూపొందించింది.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సారధ్యంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, గౌతం రెడ్డి సభ్యులుగా ఉన్న కమిటీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తమ రిపోర్టు సమర్పించారు. అదే సమయంలో.. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్.. ఉండవల్లి అనూష వ్యవహారంపై స్పందిస్తూ సీఎం, వైసీపీ శ్రేణులపై అతి తీవ్రమైన కామెంట్లు చేశారు.

 కిమ్ జాంగ్‌తో నారా లోకేశ్ మంతనాలు.. చంద్రబాబును ఉతికినా జగన్‌కు షాక్.. ఇదేందంటూ సైరాపంచ్.. కిమ్ జాంగ్‌తో నారా లోకేశ్ మంతనాలు.. చంద్రబాబును ఉతికినా జగన్‌కు షాక్.. ఇదేందంటూ సైరాపంచ్..

అందులో ఏముందంటే..

అందులో ఏముందంటే..

గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ రిపోర్టుపై కీలక చర్చ జరిగింది. చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న రంజాన్ తోఫా లాంటి స్కీమ్ ల ద్వారా గత ప్రభుత్వం రూ.158 కోట్ల అవినీతికి పాల్పడినట్లు సబ్‌ కమిటీ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు, హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల కోసం ఏడాదికి రూ.40 కోట్లు చొప్పున ఖర్చు చేసినట్టుగానూ నివేదికలో రాశారు. వీటితోపాటు.. ఏడాది కాలంగా చర్చల్లో నలుగుతోన్న.. ‘ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు'లోనూ ఏకంగా రూ.700 కోట్ల గోల్ మాల్ జరిగినట్లు రిపోర్టులో స్పష్టం చేశారు. రిపోర్టులోని అంశాల ఆధారంగా ఆయా స్కాములపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని వైసీపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వరా మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడైన మాజీ మంత్రి నారా లోకేశ్ ను ఇరుకున పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.

తొలి నుంచీ వివాదం..

తొలి నుంచీ వివాదం..

రూ. 700 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయంటూ కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టులో పేర్కొన్నవాటిలో ఫైబర్ నెట్ అంశంపై మొదటి నుంచీ వివాదాలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని ప్రజలందరినీ కేవలం రూ.149కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, టెలిఫోన్ కనెక్షన్ అందించే ఉద్దేశంతో డిసెంబరు 27, 2017న చంద్రబాబు ‘ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్'ను ప్రారంభించారు. ఫైబర్ నెట్ ప్రసారాల్లో ప్రభుత్వం చూపించే చానెల్స్ తప్ప లోకల్ చానెల్స్ వచ్చే అవకాశం లేకపోవడం, రెండు రకాల సెటాప్ బాక్సులు, తక్కువ క్లారిటీ, విపరీతమైన టెక్నికల్ సమస్యలపై అప్పట్లో గందరగోళం ఏర్పడింది. టీడీపీ సర్కారు మాత్రం దీన్నొక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగానే చెప్పుకుంది. ఐటీ శాఖ మంత్రి హోదాలో నారా లోకేశ్ ఫైబర్ నెట్ వ్యవహారాలను పర్యవేక్షించారు.

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. బాబు-లోకేశ్‌కు సీబీఐ ఉచ్చు.. మహిళలకు శుభవార్త.. 16 నుంచి అసెంబ్లీ..ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. బాబు-లోకేశ్‌కు సీబీఐ ఉచ్చు.. మహిళలకు శుభవార్త.. 16 నుంచి అసెంబ్లీ..

వేమూరి హరి ద్వారా..

వేమూరి హరి ద్వారా..

ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ప్రారంభం నుంచే అవకతవకలు జరిగాయని, ప్రాజెక్టు హెడ్ గా వేమూరి హరి ప్రసాద్ నియామకంలోనూ అక్రమాలు జరిగాయని, నకిలీ సర్టిఫికేట్ల ద్వారా వేమూరిని ఆ పోస్టులో కూర్చొబెట్టినట్లు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టులో రాసుంది. నిజానికి ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చినా.. అసలేమాత్రం అర్హత లేని సంస్థలకు అవకాశాలు కట్టబెట్టారని, వాటిలో చాలా కంపెనీలు సూట్ కేసు కంపెనీలే అని సబ్ కమిటీ తేల్చింది. రెండు రకాల సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లలోనూ అవకతవకలు జరిగాయని చెప్పింది. మొత్తంగా ఫైబర్ నెట్‌ ప్రాజెక్టులో సుమారు రూ.700కోట్ల మేర అవినీతి జరిగిందని మంత్రుల కమిటీ తేల్చింది.

ఆల్ ది బెస్ట్ చెప్పిన లోకేశ్..

ఆల్ ది బెస్ట్ చెప్పిన లోకేశ్..

ఫైబర్ నెట్ తోపాటు గత ప్రభుత్వంలో చేపట్టిన వివిధ పథకాల్లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఏపీ కేబినెట్ చేసిన తీర్మానంపై లోకేశ్ స్పందించాల్సి ఉంది. అయితే కేబినెట్ నిర్ణయాలు వెలువడ్డ చాలా సేపటికి ఆయన మరో అంశంపై.. ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్లు చేశారు. ‘‘సీఎం జగన్.. నన్ను బద్నాం చేయడానికి పడుతున్న కష్టంలో ఒక్క శాతంమైన ప్రజాసమస్యలపై దృష్టిపెడితే ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా.. నన్ను టార్గెట్ చెయ్యడమే మీ లక్ష్యం అయితే ఆల్ ది బెస్ట్''అని లోకేశ్ రాసుకొచ్చారు.

ఉండవల్లి అనూషపై..

ఉండవల్లి అనూషపై..

రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ పై అనుచిత కామెంట్లు చేసి, పోలీసు కేసును సైతం ఎదుర్కొన్న టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త ఉండవల్లి అనూష మరోసారి వార్తల్లో నిలిచారు. టీడీపీ సోషల్ మీడియా విభాగానికి ఆమెను సారధిగా నియమిస్టున్నట్లు నారా లోకేశ్ పేరుతో వెలువడిన ఉత్తర్వుల కాపీ వైరల్ అయింది. కేసులు, కష్టాలు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, వాళ్లలో ధైర్యం నూరిపోయడానికే అనూషను ఐటీ హెడ్ గా నియమిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. కానీ సదరు లేఖ నకిలీదని, వైసీపీ ఐటీ విభాగం వాళ్లు దురుద్దేశపూర్వకంగా అనూషపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నారా లోకేశ్ క్లారిటీ ఇచ్చారు.

Recommended Video

Ram Mohan Naidu Strong Counter To Vijay Sai Reddy | మాట కి మాట..!!
సొంత తల్లిపైనా..

సొంత తల్లిపైనా..

ఉండవల్లి అనూష వ్యవహారంలో ఘాటుగా స్పందించే క్రమంలో మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రత్యర్థుల కుటుంబీకుల్ని, సీఎం జగన్ తీరును ప్రస్తావిస్తూ ఆయన చేసిన కామెంట్లు రచ్చకు దారితీశాయి. ‘‘ఫేక్ బతుకులు మారవు. సీఎం జగన్ విసిరేసే 5 రూపాయిల చిల్లర కోసం సొంత తల్లి పైనా తప్పుడు పోస్ట్ పెట్టే నీచ స్థాయికి వైసీపీ పేటీఎం బ్యాచ్(వైసీపీ ఐటీ వింగ్) దిగజారిపోయింది. యుద్ధం డైరెక్ట్ గా చేసే దమ్ములేని దద్దమ్మ జగన్.. ఇలాంటి చెత్త పనులు చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారు''అంటూ లోకేశ్ ఫైరయ్యారు.

English summary
Andhra Pradesh cabinet Sub-committee has recommended a thorough investigation by cbi into the alleged corruption during the TDP regime between 2014-19. other side, nara lokesh serious reacted on undavalli anusha issue and slams cm jagan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X