2024 ఎన్నికల్లో వైసీపీ ప్రధాన అజెండాను ఖరారు చేసిన మంత్రి ధర్మాన..!!
ఏపీకి ఏకైక రాజధానిగా విశాఖపట్నం ఉంటుందంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు స్పందించారు.
గుంటూరు: ఏపీకి ఏకైక రాజధానిగా విశాఖపట్నం ఉంటుందంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు తాజాగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు మూడు రాజధానులు ఉంటాయని చెప్పుకొంటూ వస్తోన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు రాజధానులు ఉండవనేది బుగ్గన వ్యాఖ్యలతో స్పష్టమౌతోందని, ఇదంతా వైసీపీ ఆడుతున్న గేమ్ లో భాగమంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తోన్నాయి.

సజ్జల సహా..
మూడు రాజధానుల ఏర్పాటుపై ఇవ్వాళ పలువురు మంత్రులు, వైసీపీ నాయకులు స్పందించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయాలనేదే తమ ఉద్దేశమని ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పాలనను వికేంద్రీకరించడానికే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మూడు రాజధానుల నినాదంతోనే ఎన్నికలకు వెళ్తామనీ స్పష్టంచేశారు.

అంబటి కూడా..
అటు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా దీనిపై స్పందించారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ విధానమని తేల్చి చెప్పారు. దీనితోనే రాష్ట్రం సమతుల అభివృద్ధిని సాధిస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో హైదరాబాద్ లో ఏం జరిగిందో అందరూ చూశారని గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన హైదరాబాద్ ను రాష్ట్ర విభజన తరువాత వదులుకుని రావాల్సి వచ్చిందని, అలాంటి పొరపాటు మళ్లీ జరగకూడదని అన్నారు. అందుకే వైఎస్ జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు.

వెనక్కి వెళ్లం..
తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు సైతం ఈ అంశంపై మాట్లాడారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిని వికేంద్రీకరించడానికి ప్రభుత్వం మూడు రాజధానులను నిర్ణయించిందని, ఇందులో నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పారు. విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను కూడా అమలు చేస్తుందని ధర్మాన అన్నారు.

మూడు ప్రాంతాలకు ఆమోదయోగ్యం..
గత తెలుగుదేశం ప్రభుత్వం- శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అమలు చేయలేదని ధ్వజమెత్తారు. మూడు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకుంటారని, మూడు రాజధానుల అంశం త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని హామీ ఇచ్చారు ధర్మాన. పెట్టుబడులన్నీ ఒకే ప్రాంతంలో పెడితే ప్రాంతీయ విభేదాలు వస్తాయని, హైదరాబాద్ విషయంలో అదే జరిగిందని ఆయన గుర్తు చేశారు. వికేంద్రీకరణ అజెండాతోనే రానున్న ఎన్నికలకు వెళ్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు.

శివరామకృష్ణన్ కమిటీ..
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా తమ ప్రభుత్వం మూడు రాజధానుల అమలు చేపట్టిందని వివరించారు. ఈ నివేదికలో పొందుపరిచిన అంశాల్లో చాలామటుకు అమలు అయ్యాయని వివరించారు. మూడు రాజధానుల ఏర్పాటుపై సందేహాలు అనవసరమని ధర్మాన స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు నారా లోకేశ్ ఎందుకు పాదయాత్ర చేస్తోన్నాడంటూ అచ్చెన్నాయుడు తల పట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీ ఒరిగేదేమీ ఉండదనేది ఆ పార్టీ సీనియర్లకు తెలిసొచ్చిందని వ్యాఖ్యానించారు.

వికేంద్రీకరణకే మద్దతు..
రాష్ట్రం విడపోక ముందు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా అధ్యయనం చేశాయా? అని ధర్మాన నిలదీశారు. శ్రీకృష్ణ కమిటీ గానీ, శివరామకృష్ణ కమిటీగానీ అభివృద్ధి వికేంద్రీకరణకే మద్దతు పలికిందని గుర్తు చేశారాయన. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా పాలన రాజధానిగా విశాఖను చేయాలని నిర్ణయించామని పునరుద్ఘాటించారు. అమరావతిని రాజధానిగా చేస్తే- ఉత్తరాంధ్ర మళ్లీ ఓ 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications