గదిలో వేసి.. కర్రలతో దాడి, బాబాయ్ చేతిలో ఇద్దరు చిన్నారుల మృతి..
చిన్నారులపై ఏం పగో తెలియదు.. కానీ మట్టుబెట్టాడు. వారిద్దరూ అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటున్నారు. ఆ సమయంలో బాబాయి అయిన కాటూరి శ్రీనివాసరావు అనే సైకో ఇంటిలో తలుపులు వేసి మరీ కర్రలతో కొట్టాడు. ఈ ఘటన సోమవారం రేపల్లెలో జరిగగా.. స్థానికంగా కలకలం రేపింది. నిందితుడే పోలీసులకు లొంగిపోయాడు.
పట్టణంలోని 23వ వార్డులో ఉంటున్న అమ్మమ్మ వద్ద చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన పార్థివ్ సాహసవత్ (10), రోహిత్ తశ్విన్ (8) ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. వీరి పేరంట్స్ కొండేటి కోటేశ్వరరావు ఉమాదేవి దంపతులు కాగా.. ఉమాదేవి చెల్లెలి భర్త కాటూరి శ్రీనివాసరావు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. కొండేటి కోటేశ్వరరావు ఉమాదేవి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ లాక్ డౌన్ వల్ల పిల్లలను రేపల్లె 23వ వార్డులో నివాసం ఉంటున్న అమ్మమ్మ మోర్ల విజయలక్ష్మి వద్ద ఉంచారు.

సోమవారం పిల్లలను ఇంట్లోకి కాటూరి శ్రీనివాసరావు తీసుకెళ్లాడు. కర్రలతో చితకబాదాడు.. ఎంతలా అంటే... వారిద్దరూ చనిపోయేంతలా కొట్టాడు. ఆ తర్వాత కాటూరి శ్రీనివాసరావు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. అతని మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మందులు వాడుతున్నట్లు విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారుల హత్యతో రేపల్లె ఉలిక్కిపడింది.
తండ్రి తర్వాత స్థానం బాబాయ్‌దే కానీ.. అతను తన స్థాయి మరచిపోయాడు. వారు ఏం చేశారో తెలియదు.. కానీ మూర్ఖుడిలా బిహేవ్ చేశాడు. గదిలో బంధించి మరీ.. కర్రలతో గొడ్డును బాదినట్టు మరీ బాదాడు. దీంతో వారిద్దరూ చనిపోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications